S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/09/2019 - 00:06

టాలీవుడ్ ఇండస్ట్రీని -క్రమంగా గంధపు పరిమళాలు కమ్ముతున్నాయి.
చూపు తిప్పడానికి చాన్సివ్వకుండా -శే్వత సుగంథాలు పల్లపర్చుకుంటున్నాయి.
ఔనన్నా కాదన్నా కన్నడ అందాలదే రాజ్యం, భోగం.

06/08/2019 - 14:43

సంతోషం
సగం బలం -ఇది పెద్దల మాట.
సందేశం
సంపూర్ణ బలం -ఇదిప్పుడు టాలీవుడ్ పాట.
**
నిజానికి సినిమాకి -సందేశం కొత్తకాదు. ఆ మాటకొస్తే సందేశ ఉద్దేశంతోనే సినిమా మొదలైందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్క్రీన్‌మీద బొమ్మపడటం మొదలైనప్పుడే.. అంటే పౌరాణిక సినిమాల నుంచే సందేశం మొదలైంది.

05/25/2019 - 21:40

మూడు దశాబ్దాల క్రితంవచ్చిన ఏదోక సినిమాను గుర్తుచేసి కథ చెప్పమంటే -సన్నివేశం మిస్సవ్వకుండా సినిమా చూపించేసే ప్రేక్షకులున్నారు. కాని -మూడు రోజుల క్రితం చూసిన చిత్ర కథ చెప్పమంటే మాత్రం మూడు ముక్కలు కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.

05/19/2019 - 00:05

కొత్తొక వింత. పాతొక రోత -ఈ సామెత టాలీవుడ్‌కు సరిగ్గా సరిపోతుంది. మహేష్‌బాబు కొత్త సినిమా ‘మహర్షి’ కానె్సప్ట్‌ను అందుకునేందుకు పరుగులు తీస్తున్న ప్రభావితులను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కానె్సప్ట్ గొప్పదైనా -దాన్ని ఆచరించే సిన్సియారిటీ కొరవడితే మొదటికే మోసం రావొచ్చు. మహర్షి చిత్రంలో రైతు ప్రాధాన్యతను ప్రపంచానికి చెబుతూ ‘వీకెండ్ వ్యవసాయం’ కానె్సప్ట్‌ను ప్రజెంట్ చేయడం గొప్ప విషయమే.

05/12/2019 - 00:01

ఒకప్పుడు సినిమా అంటే-
కథేంటి? హీరో ఎవరు? ఈ ప్రశ్నలెదురయ్యేవి.
కొంతకాలం క్రితం వరకూ సినిమా అంటే-
హీరో ఎవరు? బడ్జెట్టెంత? అన్న ప్రశ్నలుండేవి.
ఇటీవలి కాలం వరకూ సినిమా అంటే-
కోటి దగ్గర ఆగేదా? కోట్ల క్లబ్‌కు చేరేదా? అన్న ప్రశ్నలూ వినిపించాయి.
ఇప్పుడు సినిమా అనగానే-
-బడ్జెట్ పద్మనాభమా?, బడ్జెట్ బాహుబలా? అంటున్నారు.

05/05/2019 - 00:08

మహర్షి సినిమా చాలా ఇంటెన్స్ వున్న కథ. దీని తరువాత ఎంటర్‌టైన్ చేద్దాం అనుకున్నాను. అయితే అదే సమయంలో సుకుమార్ ఇంటెన్స్‌తో కూడిన సీరియస్ కథను చెప్పాడు. అప్పుడే సీరియస్ కథ వద్దనుకుని అనిల్ రావిపూడి చెప్పిన ఎంటర్‌టైనర్ చేయడానికి సిద్ధమయ్యాను. ఈ విషయంలో సుక్కు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సుక్కు నాకు మంచి ఫ్రెండ్. అతనితో తప్పకుండా భవిష్యత్తులో సినిమా చేస్తా అని అంటున్నాడు మహేష్‌బాబు.

04/28/2019 - 00:13

జనంపై సినిమా ప్రభావమేమీ ఉండదంటారు కొందరు. సినిమాయే జనాన్ని నడిపిస్తుందంటారు మరికొందరు. ఎవరి వాదనలో ఎంత బలమన్నది పక్కనపెడితే - సినిమా కొత్తగా అనుభవంలోకి వచ్చిన తొలినాళ్లలో దాని ప్రభావం లేదని కొట్టిపారేయలేం. సినిమా టాకీ దశకొచ్చిన తొలినాళ్లలో పీడిత జనానికి సినిమాయే ప్రతినిధి అయ్యంది. వాళ్ల కష్టాలు కన్నీళను తెరపై చూపించింది. వాటినే కథలుగా మలచుకుంది.

04/21/2019 - 00:03

చేతిలోవున్న అదృష్టం మెదడుకు చేరకముందే మర్చిపోతే-
ఇదేదో సినిమా పాయింట్‌లా ఉందనిపిస్తోంది కదూ. నిజమే -పాయింట్ కనెక్టయితే చాలు కొత్త దర్శకులు.. కాదు కాదు కుర్ర దర్శకులు చెలరేగిపోతున్నారు. సినిమా అంటే ఒకప్పటి రుచి కాదు, కొత్త రుచులు కూడా ఆస్వాదించండంటూ వినోదాన్ని విస్తట్లో వడ్డిస్తున్నారు.

04/14/2019 - 00:11

ముద్దుకే ముద్దొచ్చే ఈ నవ్వు కోసమే బాలీవుడ్ మురిసిపోయేది. ఆమె సినిమా ఒప్పుకుంటేనే మహాభాగ్యమన్నట్టు కదిలిపోయేది. ఒకటా రెండా ఎన్నో సినిమాలు.. నెలా ఏడాదా.. దశాబ్దాలు. ఆమెను స్క్రీన్‌మీద చూపించేందుకు బాలీవుడ్ ఎన్నో కథలల్లుకుంది. ఎందరో హీరోలను ఆమె పక్కన చూపించేందుకు ప్రణాళికలు వేసేది. మూడక్షరాల ఆమె పేరు -బాలీవుడ్‌కు ఎంతో మురిపెం.

04/07/2019 - 00:13

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన వినయ విధేయ రామ, యన్‌టిఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలనే తీసుకుందాం. ఒకటి భారీ బడ్జెట్ సినిమా. మరొకటి గొప్ప చరిత్రవున్న వ్యక్తి బయోపిక్. ఏమైంది? ప్రేక్షకుడికి ఇవేం పట్టలేదు. సినిమా నచ్చలేదంతే అంటూ జడ్జిమెంట్ ఇచ్చేశాడు. అంత పెద్ద హీరోలు సైతం కామ్‌గా ఉండిపోయారు. అందుకే అనేది -ప్రేక్షకుడు హీరోలకే హీరో అని.
*

Pages