S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 00:09

భీమవరం, డిసెంబర్ 3: అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ నాణ్యత లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ ఆక్వా ఉత్పత్తులను సంస్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతు న్నాయ. ఇప్పటికే యాంటీ బయోటిక్స్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు విధించగా, తాజాగా పౌల్ట్రీ, కబేళా వ్యర్థాలను ఆక్వాసాగులో వినియోగించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

12/04/2016 - 00:05

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దు పెద్ద మనుషులకు ముందే తెలుసని ప్రతిపక్షాల ఆరోపణ.
తమకు ముందే తెలియకపోయిందే అని అక్కసు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
డొనాల్డ్ ట్రంప్‌ను మెజారిటీతో గెలిపించి ఆయన మాకొద్దని గొడవ చేయడమెందుకో?
గెలిపించిన వారు వేరు. గొడవ చేసేవారు వేరు...

12/04/2016 - 00:04

హైదరాబాద్, డిసెంబర్ 3: ఫార్మాసిటీ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) కసరత్తు చేస్తోంది. దీనికి మొత్తం 12,500 ఎకరాలు అవసరమని, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్వీకరించి అమలు చేస్తోందని టిఎస్‌ఐఐసి చైర్మన్ జి బాలమల్లు తెలిపారు. శనివారం ఆయన టిఎస్‌ఐఐసి అధికారులతో కలిసి ఫార్మాసిటీ ప్రాంతాన్ని సందర్శించారు.

12/04/2016 - 00:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్ప్ (జిఎస్‌పిసి) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్- సెప్టెంబర్)లో 374.03 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రథమార్ధంలో ఇది 369.55 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. చమురు అనే్వషణ వ్యయం తదితరాల రద్దు నేపథ్యంలో నష్టాలపాలైంది.

12/03/2016 - 23:59

‘నన్ను అన్యాయం చేశావు కదూ? పైన దేవుడున్నాడు.. అన్నీ చూస్తుంటాడు’- స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎవరైనా మోసం చేస్తే వెంటనే బాధిత బాలుడి నుంచి వచ్చే మాట ఇది! అప్పుడు లోకజ్ఞానం లేక, అమాయకంగా బతికే చిన్నతనపు ఊహల్లో చెప్పే మాటలవి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా దాదాపు ఊహతెలియని పిల్లాడి మాటల మాదిరిగానే కనిపిస్తున్నాయి. ‘దేవుడు కరుణిస్తే వచ్చే ఏడాది మనం అధికారంలోకి వస్తాం.

12/03/2016 - 23:54

పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించగానే తెలంగాణ సిఎం కెసిఆర్ రాష్ట్రానికి తగ్గే ఆదాయంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై బిజెపి నేత కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ‘ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం నల్లధనంతోనే నడిచిందా?’ అని ప్రశ్నించారు. దీనికి కెసిఆర్ ఇచ్చిన సమాధానంతో బిజెపి నాయకులు అవాక్కయ్యారు.

12/03/2016 - 23:50

చైనాలో అందరికీ ట్రంప్ గుర్తొస్తున్నట్లున్నాడు. దేన్ని చూసినా ట్రంపే వారికి కన్పిస్తున్నాడు. ఈ మధ్య హోంగ్జౌ జూలో ని బర్డ్ సఫారీలో కన్పించిన ఓ పక్షిని చూసిన ఓ జర్నలిస్టు అది అచ్చం ట్రంప్‌లా ఉందంటూ ట్రంప్‌కు, దానికి ఉన్న పోలికలను వర్ణిస్తూ కథనాలు ప్రచురించాడు. దీంతో ఇప్పుడు ఆ పక్షిని చూడడానికి జనం క్యూకట్టారు.

12/03/2016 - 23:49

పత్తిమొక్కను ఆశ్రయించుకొని సుమారు పదకొండు వందల రకాల సూక్ష్మజీవులు బతుకుతాయట. వీటిలో 1,090 రకాల సూక్ష్మజీవులు మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తాయని, మిగిలిన పదిరకాలు మాత్రమే పంటకు హాని చేస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతుంటారు. ఈ విషయాలు తెలిసినా తెలియకపోయినా పంటను రక్షించుకొనేందుకు రైతులు క్రిమిసంహారక మందులు విరివిగా వాడుతుంటారు.

12/03/2016 - 23:47

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యకి తపేరు తోఫర్ బ్రోఫై. పార్ట్‌టైమ్ కళాకారుడు. ఇతడి పక్కనే ఉన్న శునకం పేరు రోసెమ్‌బర్గ్. ఆ శునకం అంటే అతడికి ఇష్టం. తోఫర్ అంటే బర్గ్‌కూ అమితమైన ప్రేమ. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలకు చిహ్నం ఈ ఫొటో. ఒకేలా కనిపించేందుకు తరచూ విభిన్నరూపాల్లో దర్శనమిస్తూ వెబ్ మీడియాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు తోఫర్.

12/03/2016 - 23:47

పెద్దనోట్ల రద్దు వల్ల మూడు వారాలుగా ఎటూ పోలేని పరిస్థితి. విమానంలో వెళ్ళడం సులభం. ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్ తీసుకోవచ్చు. పెద్ద నగరాలకి కూడా ఆన్‌లైన్‌లో బస్ టిక్కెట్ దొరుకుతుంది. కాని ఏభై, వంద కిలోమీటర్ల దూరం బస్సులో ప్రయాణించాలంటేనే కష్టం.. బస్టాండుకు పోవాలన్నా, బస్సెక్కాలన్నా, నీళ్ళ సీసా కొనాలన్నా చిల్లర కావాలి. తివిరి ఇసుకనందు తైలంబు తీయవచ్చునేమో గాని, బ్యాంకుల్లోంచి చిల్లర తీ యలేం.

Pages