S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 03:48

విపత్కర పరిస్థితుల్లో ఒక గదిలో బంధించబడి నిస్సహాయంగా రోజుల తరబడి ఉండిపోయిన మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో క్రైం కథలో చక్కగా వివరించారు. క్రైం కథల ప్రత్యేకత అదే. వస్తు వైవిధ్యం! వెటకారం చేసేవారికి కనిపించకపోవచ్చు గానీ రైల్వేస్‌లో కాస్తంత మార్పు కనిపిస్తోంది. ప్లాట్‌ఫామ్స్ వెనకటికన్నా శుభ్రంగా ఉన్నాయి. రైళ్ల సరాసరి ఆలస్యం 2 గంటలు తగ్గింది.

12/04/2016 - 03:47

విశాఖపట్నం, డిసెంబర్ 3: ఆంధ్రావిశ్వవిద్యాలయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎయు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో రానున్న విద్యా సంవత్సరానికి బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సును సెల్ఫ్‌ఫైనాన్స్ విభాగంలో ప్రారంభించాలని నిర్ణయించారు.

12/04/2016 - 03:46

ఇసుక కుప్పలుగా
గుజ్జనగుళ్ల బాల్యం
భావితరాల
సైకత శిల్పులుగా

వంతెన తినె్నపై
బాల్యం భుజాలుగా చేతులు
తంతి తీగెపై
పక్షుల విన్యాసాలు

చెరువు నీటి తలముపై
బోకె బిచ్చల కప్పగెంతులు
బెకబెకల కేరింతలైన
చిలిపి బాల్యం

కిర్రుమని చప్పుడు చేస్తూ
బొంబాయి మిఠాయి
చేతి గడియారమై చుట్టేస్తే
అమాంతం నోరు మింగింది

12/04/2016 - 03:43

అక్షరమా.. అక్షరమా...
నీ గొంతు నొక్కేస్తున్నప్పుడు
సాక్ష్యాలు గుట్టలు గుట్టలుగా
బయటపడుతున్నప్పుడు
హక్కులకు రాజ్యాలు ‘బేడీ’లు
బిగిస్తున్నప్పుడు
నిజాన్ని నిగ్గుతేల్చి రచ్చబండ
కింద ఈడ్చాలి
సంకేలను’ స్వేచ్ఛగా బద్దలు కొట్టాలి
ఉక్కుపిడికిల్లు బిగించి గొంతెత్తి
గర్జించాలి
హక్కులుక స్వేచ్ఛా సమరం చేయాలి
ద్వేష విద్వేషా భావాలను

12/04/2016 - 03:39

మళ్లీ జన్మిస్తే
నేనిలా ఉండకపోవచ్చు.
ఇంతకన్న మెరుగ్గా
చురుగ్గా
మరింత మనిషిగా
చైతన్యపూరిత నవస్రోతస్వినిగా

అర్థమయ్యే లోపల్నే
జీవితం ముగిసిపోతుంది.
లోకాన్ని
అధ్యయనం చెయ్యకుండానే
కాలం కరిగిపోతుంది.

12/04/2016 - 03:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పొరుగు రాష్టమ్రైన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఏపీ సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు కుదురుకునే వరకూ చిన్నచిన్న ఇబ్బందులు ఉండేమాట వాస్తవమేనంటూ, అవేమీ వ్యక్తిగత విభేదాలు కావన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తానెప్పుడూ సిద్ధమేనని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

12/04/2016 - 03:43

హైదరాబాద్, డిసెంబర్ 3: రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబాలు, సామాన్యులు నగదురహిత వ్యవహారాలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ కోరారు. నగదురహిత కార్యకలాపాలను కొనసాగించే అంశంపై అవగాహన కల్పించేందుకు సచివాలయంలో ఉద్యోగులకు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు.

12/04/2016 - 03:26

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సామాజిక పింఛన్ల కింద ఎకాఎకి రూ.397 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ నిధులు బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి. కానీ చిల్లర కష్టాలతో పింఛనుదారులకు నగదు చెల్లింపులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పింఛనుదార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

12/04/2016 - 03:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు ప్రభావం బడ్జెట్‌పై భారీగా పడినందున కేంద్రం తాత్కాలిక ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. నోట్ల ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు చేయాల్సిన సాయంపై ఆరు అంశాలతో కూడిన ప్రతిపాదనలను కేంద్రానికి అందించారు. అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జిఎస్‌టి గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.

12/04/2016 - 03:14

అమరావతి, డిసెంబర్ 3: పెద్దనోట్ల చలామణిపై ఆంక్షల విధింపు, కొత్త నోట్ల కొరత వల్ల రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి నగదు తెప్పిస్తూ మరోవైపు నగదు రహిత విధానం కోసం ఇ-పోస్ మిషన్లు తెప్పించడం కోసం చేస్తున్న కృషి ఫలించింది.

Pages