S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 00:54

లండన్, డిసెంబర్ 3: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ వచ్చే ఏడాది జూన్ 15 నుంచి 25వ తేదీ వరకు జరిగే పురుషుల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) సెమీ ఫైనల్‌లో ఒకే పూల్ నుంచి పోటీపడనున్నాయి. 2018 వరల్డ్ కప్ హాకీకి అర్హత పొందే జట్లను ఖరారు చేయడానికి హెచ్‌డబ్ల్యుఎల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లో పది ప్రపంచ మేటి జట్లు తలపడతాయి. ఇప్పటికే ఆరు జట్లు ఖరారయ్యాయి.

12/04/2016 - 00:53

కరాచీ, డిసెంబర్ 3: జూనియర్ ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనకుండా తమ జూనియర్ హాకీ జట్టుపై అనర్హత వేటు వేయడం అన్యాయమని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) నిర్ణయాన్ని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) తప్పుపట్టింది. దీనిని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

12/04/2016 - 00:47

ముంబయి, డిసెంబర్ 3: పెద్ద నోట్లను రద్దు చేసి మూడు వారాలకు పైగా అయినా మార్కెట్‌లో కరెన్సీ కొరత తీరడం లేదు. ఇప్పటికీ పెద్దసంఖ్యలో ప్రజలు బ్యాంకులు, ఎటిఎం కేంద్రాల ముందు నగదుకోసం బారులు తీరుతున్నారు. ముంబయిలో శనివారం వారాంతపు ఖర్చులకోసం ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. గంటల తరబడి క్యూలో నిలబడుతున్నప్పటికీ బ్యాంకులు అంతంత మాత్రంగానే డబ్బులిస్తున్నాయి. ఉన్న నగదు అయిపోగానే ఆపేస్తున్నాయి.

12/04/2016 - 00:44

మొరాదాబాద్, డిసెంబర్ 3: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం జరిగిన బిజెపి పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాలంతోపాటుగా మనమూ మారాల్సిన అవసరం ఉందని, డిజిటల్ లావాదేవీలకు మళ్లక తప్పదని, ఓ బిచ్చగాడు స్వైపింగ్ మిషన్‌ను ఉపయోగిస్తున్నట్లుగా వాట్సాప్‌లో వచ్చిన ఓ వీడియోను ప్రస్తావించారు. ‘అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.. అయితే వాట్సాప్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది.

12/04/2016 - 00:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వయసు మీద పడుతున్న కొద్దీ ఎవరికైనా అలుపన్నది సహజం. అయితే 74 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్‌లో అలాంటిదేమీ కనిపించదు. ఆయన ఇప్పటికీ సినిమాలు, రకరకాల కార్యక్రమాలతో ప్రతి రోజూ బిజీగా గడపడమే కాదు, హ్యూమర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎదుటి వాళ్లు అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పడమే కాదు, అందులో హాస్యం కూడా తొణికిసలాడుతూ ఉంటుంది.

12/04/2016 - 00:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి అభివర్ణించారు. అంతేకాదు, దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో శనివారం నితీశ్ కుమార్ పాల్గొన్నారు.

12/04/2016 - 00:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగాలా? లేదా? (బ్రెగ్జిట్) అనే అంశంపై రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించేందుకు గతంలో తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ శనివారం సమర్ధించుకున్నారు. సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉన్న కీలక అంశాలపై ప్రజల అనుమతి తీసుకోకుండా పార్లమెంట్‌కు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

12/04/2016 - 00:36

జైపూర్, డిసెంబర్ 3: సైన్యంలో వివిధ కేటగిరిల్లో సవరించిన నిబంధల ప్రకారం సిపాయిల నియామకానికి శ్రీకారం చుట్టారు. జవాన్ల నియామకంలో శారీరక పరీక్షలే కాకుడా రాత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే తదుపరి పరీక్షలకు పిలుస్తారు.

12/04/2016 - 00:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రాజకీయాలను నేరరహితం చేయడంతో పాటు రాజకీయ పార్టీలకు అందే విరాళాలను ప్రక్షాళన చేయడానికి వీలుగా ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపించిన ఎన్నికల సంఘం దేశంలోని ఎన్నికలకు సంబంధించిన అన్ని చట్టాలను సమగ్రంగా సమీక్షించే దిశగా సాగుతోంది. తాను పంపించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి స్పందనకోసం ఆతృతగా వేచిచూస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) నసీం జైదీ శనివారం చెప్పారు.

12/04/2016 - 00:32

ముంబయి, డిసెంబర్ 3: పెద్దనోట్ల రద్దు తర్వాత తాము ఇన్నాళ్లుగా దాచుకున్న డబ్బులను కాపాడుకోవడానికి నల్లకుబేరులు అనేక పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ముంబయిలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం రెండు కార్లలో తరలిస్తున్న 2.7 కోట్ల రూపాయల విలువైన 9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Pages