S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 23:54

ఆదోని, సెప్టెంబర్ 23: వర్షాలు విస్తృతంగా కురుస్తుండడంతో తుంగభద్ర దిగువ కాలువ కింద పంటలు పండిం చే రైతులకు తుంగభద్ర నీటి బెంగ తీరింది. వర్షంనీరు రైతన్నలను ఆదుకుంది. అందువల్ల ఆయకట్టు భూము ల్లో వేసిన పంటలు వర్షపునీరు ఆదుకోవడంతో పచ్చగా పంటలు కళకళలాడుతున్నాయి.

09/23/2016 - 23:53

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 23:నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తవుతాయని రాజ్యసభ సభ్యులు టిజి.వెంకటేష్ తెలిపారు. రాయలసీమ యూనివర్శిటీకి నీరందించేందుకు నగరంలోని టెలికాంనగర్‌లో రూ. 1.8 లక్షలతో చేపట్టిన తాగునీటి సరఫరా లైన్లను శుక్రవారం ప్రారంభించారు.

09/23/2016 - 23:52

కర్నూలు, సెప్టెంబర్ 23:జిల్లాలోని నీటిపారుదల చెరువులో ముళ్లకంపలను తొలగించి పూడికతీత పనులు చేపట్టేందుకు సర్వే ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 23మండలాల తహశీల్దార్లు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

09/23/2016 - 23:52

పాణ్యం, సెప్టెంబర్ 23: మండల పరిధిలోని కొండజూటూరు గ్రామంలో గోరుకల్లు రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేసుకున్నందున గోరుకల్లు గ్రామంలో నీటి బుగ్గ లు ఉద్ధృతమైన సంగతి తెలిసిందే. వాటి ఉద్ధృతిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లోగడ రాజకీయ నాయకులు, అధికారు లు, ఈ గ్రా మాన్ని సందర్శించారు. శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి గోరుకల్లు గ్రామాన్ని సందర్శించారు.

09/23/2016 - 23:52

మహానంది, సెప్టెంబర్ 23: మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల ద్వారా రూ.25,63,148లు ఆదాయం లభించినట్లు ఇఓ డా.శంకర వర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మహానంది పుణ్యక్షేత్రంలోని ఉభయ దేవాలయాల హుండీలను ఇఓ, చైర్మన్ పాణ్యం ప్రసాద్‌ల ఆధ్వర్యంలో లెక్కించారు.

09/23/2016 - 23:51

కర్నూలు, సెప్టెంబర్ 23 : జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయమోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే 08518-277305, 277309 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలన్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.

09/23/2016 - 23:51

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 23:నగరంలోని ప్రభుత్వాసుపత్రి చరిత్రలో మొట్టమొదటి సారిగా గుండె విభాగంలో ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేయటం జిల్లాకే గర్వకారణమని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్డియో థోరాసిక్ విభాగంలో కర్నూలు నగరానికి చెందిన 22 ఏళ్ల షాజిదాబికి ఆరోగ్యశ్రీ నిధులతో ఓపెన్‌హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారన్నారు.

09/23/2016 - 23:50

నందికొట్కూరు, సెప్టెంబర్ 23:పట్టణ సమీపంలోని నాగటూరు ఎత్తిపోతల పథకం పంపుహౌస్ నీటిలో శుక్రవారం ఒకవ్యక్తి ప్రమాదవశాత్తూ పడి మృతి చెందాడు. కొణిదేల గ్రామానికి చెందిన బోయ పక్కీరయ్య(35) ఎత్తిపోతల పంపుహౌస్ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో పడ్డాడు. అతడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందినట్లు ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు.

09/23/2016 - 23:48

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: బలహీన వర్గాలను బలవంతులుగా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంకణం కట్టుకున్నారన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బీసీ సంక్షేమానికి అందించే పెండింగ్ రుణాలను శుక్రవారం రాజమహేంద్రవరంలో మంత్రి విడుదల చేశారు. ఈ మేరకు 2014-15, 2015-16కు సంబంధించి పెండింగ్‌లో వున్న రూ.102 కోట్ల రుణాల చెక్కును అందించారు.

09/23/2016 - 23:48

కరప, సెప్టెంబర్ 23: గత ఎన్నికల సమయంలో అధికారం కోసం అములకాని హామీలు ఇచ్చి నేడు కల్లబొల్లి మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన కరప మండలం పెదకొత్తూరులో గడపగడపకు వైసిపి కార్యక్రమం నిర్వహించారు.

Pages