S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 23:28

ఖమ్మం, సెప్టెంబర్ 23: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జోరువాన కురిసింది. ఖమ్మం నగరంతో పాటు పలు మండలాల్లో కుండపోతగా వర్షం పడడంతో జిల్లాలోని చెరువులు, వాగులు, ప్రాజెక్టులు నిండి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా టేకులపల్లి మండలంలో 110.4 మిల్లిమిటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా మధిర మండలంలో 1.8 మిల్లిమిటర్ల వర్షపాతం నమోదు అయింది.

09/23/2016 - 23:27

భద్రాచలం, సెప్టెంబర్ 23: జిల్లాల పునర్విభజన కీలకదశకు చేరుకుంది. దసరా సందర్భంగా కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు ప్రారంభించి విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముహూర్తం ముంచుకు రావడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

09/23/2016 - 23:26

భద్రాచలం, సెప్టెంబర్ 23: రాష్ట్ర విభజన సమయం నుంచి షాకుల మీదు షాకులు తింటున్న భద్రాచలం ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే ఆర్‌అండ్‌బి, నీటిపారుదల...వంటి కీలక కార్యాలయాలను భద్రాచలం నుంచి తరలించుకు పోయిన ప్రభుత్వం తాజాగా నూతనంగా ఆవిర్భవించనున్న కొత్తగూడెంకు మరో కార్యాలయాన్ని కూడా తరలించుకు పోయేందుకు రంగం సిద్ధం చేసింది.

09/23/2016 - 23:25

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 23: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మునే్నరు పొంగి పొర్లుతుందని, ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని మునే్నటిని పరిశీలించారు.

09/23/2016 - 23:25

జూలూరుపాడు, సెప్టెంబర్ 23: మండల పరిధిలోని పాపకొల్లు మేజర్ గ్రామ పంచాయతీ శివారు గ్రామం ముత్యాలమ్మకాలనీలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలనీలో పారిశుద్ధ్య లోపం తలెత్తింది. అంతర్గత రహదారులు, జనావాసాలు బురద కయ్యలుగా మారాయి. పిల్లలు ఇళ్లనుంచి బయటకు రావలంటేనే భయపడుతున్నారు. రోడ్లపై మోకాళ్లలోతు బురదనీటిలోనే కాలనీ వాసులు రాకపోకలు సాగిస్తున్నారు.

09/23/2016 - 23:23

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికే పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కూసుమంచి మండలంలోని రాజుతండా నుంచి ఒంటిగూడిసెతండా వరకు 130లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

09/23/2016 - 23:21

ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 23: బాధితులకు సరైన న్యాయం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ రేంజ్ డిఐజి సి రవివర్మ పేర్కొన్నారు. డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం నగరానికి మొదటిసారిగా రావడంతో ముందుగా ఆయనకు జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం శుక్రవారం ఘనస్వాగతం పలికారు.

09/23/2016 - 23:21

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 23: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవు ఇస్తున్నట్లు పర్సన్ ఇన్‌చార్జ్ శ్యాముల్‌రాజు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సరుకును యార్డుకు తరలించే సమయంలో తడచి ఆగమవుతాయనే ఉద్దేశ్యంతో యార్డుకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి రైతులు మార్కెట్‌లో విక్రయాలకు సరుకులు తీసుకరావద్దన్నారు.

09/23/2016 - 23:20

వైరా, సెప్టెంబర్ 23: గత రెండురోజులుగా కురుస్తున్న చెదురు, మదురు వర్షాలతో స్థానిక రిజర్వాయర్ నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 12అడుగులకు చేరుకుంది. గత జూన్ నెల నుండి కురుస్తున్న వర్షాలకు కేవలం మూడడుగులు మాత్రమే ఇప్పటి వరకు రిజర్వాయర్‌లోకి చేరుకుంది.

09/23/2016 - 23:20

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 23: ఖమ్మం జిల్లా పంచాయతీ వ్యవస్థను అధికారులు ఎట్టకేలకు లెక్క తేల్చారు. ఖమ్మం జిల్లా ఉమ్మడిగా ఉన్న సమయంలో41మండలాలు ఉండగా, కొత్తగూడెం నూతన జిల్లాగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో 21మండలాలు, కొత్తగూడెం జిల్లాలోకి 18మండలాలు ఉండేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

Pages