S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 23:48

కాకినాడ, సెప్టెంబర్ 23: జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న జిల్లా పౌరసరఫరాల సంస్ధ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దాడి చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవరణలో ఉన్న పౌరసరఫరాల సంస్ధ కార్యాలయంపై ఎసిబి దాడి చేయడంతో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ఎసిబి చేసిన దాడిలో సంస్ధ సహాయ మేనేజర్ (జనరల్) మండూరి జాన్‌కెనడీ రాజ్‌కుమార్‌ను వలపన్ని పట్టుకున్నారు.

09/23/2016 - 23:47

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: ప్రభుత్వం తన బాధ్యతలను మర్చిపోయినపుడు ప్రజలే కొన్ని పనులకు నడుంబిగిస్తారన్నట్టుగా రాజమహేంద్రవరం పౌరులు తమను తాము సత్కరించుకున్నట్టుగా రాజమహేంద్రవరంలో ఒక భారీ పురస్కార కార్యక్రమానికి నడుం బిగించారు.

09/23/2016 - 23:46

చింతూరు, సెప్టెంబర్ 23: ఆంధ్రాలో విలీనమైన చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో వైద్య సేవలు విస్తృతం చేసినట్టు చింతూరు ఐటిడిఎ పిఒ చక్రధరబాబు తెలిపారు. శుక్రవారం పిఒ చక్రధరబాబు స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో వైద్యాధికారులతో రోగుల గుర్తింపు, వైద్య సేవలు అందించడం తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు.

09/23/2016 - 23:46

మండపేట, సెప్టెంబర్ 23: మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో పంగిడి చెరువు పొంగి ప్రవహించడంతో ద్వారపూడి, వేములపల్లి గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రాజానగరం మండలం వైపు నుండి వర్షపు నీరు ఈ చెరువులోకి ప్రవేశించడంతో చెరువు గట్టు దక్షిణం వైపు నుండి గ్రామాల్లోకి నీరు వరదలా ముంచుకొచ్చింది. రోడ్లన్నీ పెద్దపెద్ద కాల్వల్లా తయారయ్యాయి. ఆరడుగుల మేర నీరు గ్రామాలలో ప్రవహిస్తోంది.

09/23/2016 - 23:46

రంగంపేట, సెప్టెంబర్ 23: మండలంలో పల్లెక్రాంతిని జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఈలకొలను గ్రామంలో యుఆర్‌ఎ ట్యాంకును పరిశీలించారు. దానిని ఎప్పుడు క్లీన్ చేశారు?, గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి ఎలా ఉంది?, డ్రెయినేజీల్లో పూడిక తీస్తున్నారా లేదా..అంటూ ఈలకొలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.

09/23/2016 - 23:45

చింతూరు, సెప్టెంబర్ 23: చింతూరు మండలం వాలమూరిగొంది గ్రామానికి చెందిన సోడే కృష్ణమూర్తి అనే గిరిజనుడు కాళ్ల వాపు వ్యాధి సోకి గత రెండు వారాలుగా బాధపడుతున్నాడు. శుక్రవారం కాళ్ల నొప్పులు ఎక్కువ కావడంతో చింతూరు క్లస్టర్ వైద్యశాలకు వచ్చి, వైద్యం పొందుతున్నాడు. చాపకింద నీరులా కాళ్లవాపు వ్యాధి ప్రబలడంతో ఏజెన్సీలోని గిరిజనులు భయాందోలలకు గురవుతున్నారు.

09/23/2016 - 23:45

కాట్రేనికోన, సెప్టెంబర్ 23: మత్స్యకార గ్రామాల్లో కొట్లాటలు, ఘర్షణలు అరికట్టేందుకు శాంతి కమిటీలను నియమిస్తున్నట్లు ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కాట్రేనికోన పోలీసు స్టేషను రికార్డులను అయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ హింసాత్మక సంఘటనలకు పాల్పడితే ఎంతటివారినైనా సహించేది లేదని, రౌడీషీటర్లు తెరుస్తామని హెచ్చరించారు.

09/23/2016 - 23:44

చింతూరు, సెప్టెంబర్ 23: మండలంలోని లక్కవరం అటవీ క్షేత్రం పరిధిలో వేటగాళ్ల బాణానికి ఓ జింక గాయపడిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో వేటగాడి బాణానికి గాయపడిన జింక మోతుగూడెం గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడింది. దీంతో గ్రామస్థులు గాయపడిన జింకను అటవీ అధికారులకు అప్పగించారు. ఈ జింకను చింతూరు పశువైద్యశాలకు తరలించి, అధికారులు చికిత్స అందించారు.

09/23/2016 - 23:44

పిఠాపురం, సెప్టెంబర్ 23: ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ తన కుటుంబంతో శుక్రవారం పాదగయను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈమెకు సూపరిటెండెంట్ వడ్డి శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు.

09/23/2016 - 23:44

విఆర్ పురం, సెప్టెంబర్ 23: స్థానిక రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలను రంపచోడవరం పిఒ చక్రధరబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలోని రోగుల వార్డులను, ప్రశూతి గదిని, రక్త పరీక్ష గదిని పరిశీలించారు. రక్త పరీక్ష గదిలో టెస్టులు ఎలా చేస్తున్నది పరిశీలించారు. అనంతరం వైద్యులతో రోగులకు అందిస్తున్న సేవలను గూర్చి అడిగి తెలుసుకున్నారు.

Pages