S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 23:17

నల్లగొండ, సెప్టెంబర్ 23: నల్లగొండ జిల్లాను అల్పపీడన వర్షాలు ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా, వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడా అన్నట్లుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెగని వర్షాలు కురుస్తుండగా సగటు 89.4మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది.

09/23/2016 - 23:16

కేతేపల్లి, సెప్టెంబర్ 23: నల్లగొండ జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల వల్ల అధికస్థాయిలో వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్‌గేట్లను శుక్రవారం 8అడుగుల మేర ఎత్తులేపి 41వేల క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు.

09/23/2016 - 23:15

నాంపల్లి, సెప్టెంబర్ 23: వర్షం గత మూడు రోజుల నుంచి విపరీతంగా కురుస్తుండటంతో గ్రామంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం అప్రమత్తమై బడులకు సెలవు ప్రకటించడంతో మొదటి రోజే మండంలోని గానుగుపల్లి గ్రామానికి చెందిన మానాల సాయికుమార్(14) శుక్రవారం శేశిలేటివాగు నుండి వచ్చే వరదనీరు గానుగుపల్లిలో విపరీతంగా పారుతుండటంతో విద్యార్ధి అందులో పడి గల్లంతయ్యాడు.

09/23/2016 - 23:15

మోత్కూరు, సెప్టెంబర్ 23: మండలంలోని ఫొడ్డుగూడెం గ్రామానికి చెందిన సప్పిడి మణెమ్మ (85) గురువారం రాత్రి ఇంటి గోడ కూలి మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజువారి మాదిరిగా భోజనం చేసిన తర్వాత రాత్రి నిద్రపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాని ఇంటి గోడలు నాని ఆమె మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందిది. ఆమె కొడుకు ఉన్నప్పటికి ఒంటరిగానే ఉంటుందని తెలిపారు.

09/23/2016 - 23:14

నల్లగొండ, సెప్టెంబర్ 23: జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో ఆస్తినష్టం, ప్రాణ నష్టం వాటిల్లిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి భరోసానిచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలో వర్షాలు, వరదల తాకిడికి గురైన ప్రాంతాలను ఆయన సందర్శించి బాధితుల నుండి వివరాలు తెలుసుకున్నారు.

09/23/2016 - 23:12

గద్వాల, సెప్టెంబర్ 23: గద్వాల జిల్లా చేయాలంటూ నడిగడ్డ ప్రజల ఆగ్రహజ్వాలాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. దీంతో శుక్రవారం నడిగడ్డలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అంతుచిక్కకుండా ఉద్యమకారులు తమదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం నుండి మూడు రోజుల బంద్‌కు జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. మొదటి రోజు బంద్ విజయవంతమైంది.

09/23/2016 - 23:11

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ధ్రోణితో జిల్లాలో వాన దంచికొడుతుంది. ఐదు రోజుల నుండి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడం జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాలకు వెళ్లే బీటి రోడ్ల బ్రిడ్జిలపై వర్షపునీరు వరదలా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

09/23/2016 - 23:14

నల్లగొండ, సెప్టెంబర్ 23: 2014-15 సంవత్సరం రైతుల పంటరుణమాఫీ వివరాలను తక్షణమే అందించాలని ఆడిట్ అధికారులను, బ్యాంకర్లను ఎజెసి ఎస్. వెంకట్రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశంలో పంట రుణామాఫీ పురోగతిని సమీక్షించారు. జిల్లాలో 4లక్షల 95వేల మంది రైతులు పంట రుణమాఫీ పొంది ఉన్నారని, నిబంధనల మేరకు ఒక్కో కుటుంబానికి 1లక్ష రూపాయల రుణమాఫీ వర్తించనుందన్నారు.

09/23/2016 - 23:10

అలంపూర్, సెప్టెంబర్ 23: ప్రతి విద్యార్థి భావిభారత పౌరులుగా తయారు కావాలని కలెక్టర్ శ్రీదేవి అన్నారు. శుక్రవారం అలంపూర్ పట్టణ సమీపంలో గల మాంటిస్సోరి స్కూల్‌లో జరిగిన ఇంటరాక్టివ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అబ్దుల్‌కలాం, పివి సిందు లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

09/23/2016 - 23:09

మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 23: బైపాస్ రోడ్డు నిర్మాణంతో పాలమూరు పట్టణానికి మహర్ధశ నెలకొంటుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం వందకోట్లతో తలపెట్టిన బైపాస్ రోడ్డు ఏర్పాటుకు క్రిష్టియన్‌పల్లి దగ్గర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డు ఏర్పడితే పాలమూరు ప్రజల చీరకాల వాంచ నేరవేరిందని అన్నారు.

Pages