S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 00:00

గుంటూరు, సెప్టెంబర్ 23: ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈనెల 24వ తేదీన దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శుక్రవారం కార్యక్రమ నిర్వహణపై కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

09/23/2016 - 23:59

పెదనందిపాడు, సెప్టెంబర్ 23: డ్రైనేజీ అధికారుల వైఫల్యం కారణంగానే రైతాంగం ఇక్కట్లకు గురవుతున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆరోపించారు. నల్లమడ వాగు పరివాహక ప్రాంతాల్లో వరదముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెదనందిపాడు వంతెన వద్ద ఆయన మాట్లాడుతూ అతివృష్టి సమయాల్లో ముంపు తప్పడం లేదన్నారు.

09/23/2016 - 23:59

తాడేపల్లి, సెప్టెంబర్ 23: కృష్ణా, గుంటూరు సరిహద్ధులోని ప్రకాశం బ్యారేజ్ నుండి లక్ష క్యూసెక్కుల నీరును అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద సందర్శకులు కృష్ణమ్మ జలకళను చూసేందుకు భారీగా తరలివచ్చారు.

09/23/2016 - 23:58

కాకుమాను, సెప్టెంబర్ 23: భారీవర్షాలు, వరద భీభత్సం కారణంగా పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 15 వేలపై చిలుకు ఎకరాల్లో వరి, ప్రత్తి, మిరప తదితర పంటలు నీటమునిగి జలాశయాలుగా మారాయి. వరద నీటి ఉద్ధృతికి కొల్లిమర్ల డ్రెయిన్ పలుచోట్ల కట్టలు తెగాయి. గరికపాడు, అప్పాపురం గ్రామాల మధ్య కొమ్మమూరు కాల్వకు రెండు భారీ గండ్లు, గార్లపాడు-కొండపాటూరు మధ్య నల్లమడ డ్రెయిన్‌కు ఒక గండి పడి వరదనీరు పొలంపైకి భారీగా చేరింది.

09/23/2016 - 23:58

అమరావతి, సెప్టెంబర్ 23: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాల మూలంగా అమరావతి-విజయవాడ రహదారిలో పెదమద్దూరు వద్ద గల కొండవీటి వాగు గురువారం రాత్రి నుండి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. విజయవాడ బస్సులు పెదమద్దూరు వరకు వచ్చి వెనుదిరుగుతున్నాయి.

09/23/2016 - 23:57

ప్రత్తిపాడు, సెప్టెంబర్ 23: నల్లమడ వాగు ఆధునికీకరణ పనులకు అవసరమైన 240 కోట్ల రూపాయల నిధులు త్వరలో మంజూరు చేయిస్తానని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రత్తిపాడు ఎండిఒ కార్యాలయంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు వరద ముంపునకు గురైన పంటల నష్టం అంచనాపై నియోజకవర్గ స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

09/23/2016 - 23:57

గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 23: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డంకులు సృష్టిస్తూ నిరోధక శక్తిగా మారారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ ధ్వజమెత్తారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/23/2016 - 23:56

పెదనందిపాడు, సెప్టెంబర్ 23: నల్లమడవాగు పరివాహక ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులో వర్షపునీరు పెరగడంతో పలుచోట్ల కరకట్టలకు గండ్లుపడి ఛిన్నాభిన్నమయ్యాయి. దీం తో వందలాది ఎకరాల్లో వేసిన మినుము, ప్రత్తి, మి ర్చి, వరి, మొక్కజొన్న పంటలు వరదనీటిలో కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది.

09/23/2016 - 23:55

కర్నూలు, సెప్టెంబర్ 23:కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలు డిసెంబర్ చివర, జనవరి 15వ తేదీ లోపు నిర్వహించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఓటరు సవరణ కార్యక్రమం చేపట్టిన అధికారులు ఆ పని పూర్తయిన వెంటనే ఎన్నికల నిర్వహణకు సిద్ధపడాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనప్రాయంగా ఆదేశాలు సైతం అందాయి. దీంతో ఎన్నికలకు అధికార పార్టీ టిడిపితో పాటు వైకాపా, కాంగ్రెస్ సమాయత్తమవుతున్నాయి.

09/23/2016 - 23:54

కర్నూలు, సెప్టెంబర్ 23:‘ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదు, అక్రమ కట్టడాలు కూల్చేస్తాం, వరద బారి నుంచి ప్రజలను రక్షిస్తాం’ వరదల సమయాల్లో జిల్లా కలెక్టర్ నుంచి గ్రామ తలారి వరకూ ఇవే మాటలు వల్లె వేస్తున్నారు. వరద సమయంలో ప్రజలను పరామర్శించి వారికి అంతో ఇంతో నష్టపరిహారం చెల్లించి ఆ తరువాత అన్నీ మరచిపోతున్నారు.

Pages