S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/31/2016 - 06:18

హైదరాబాద్, ఆగస్టు 30: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుపై ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానాన్ని తెలంగాణ శాసనమండలి మంగళవారం ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదం పొందిన జిఎస్‌టి బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు 50 శాతంపైగా రాష్ట్ర శాసనసభలు / శాసనమండళ్లు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తన అంగీకారం తెలుపుతూ పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చింది.

08/31/2016 - 06:17

హైదరాబాద్, ఆగస్టు 30: శాసన సభలో వస్తు సేవల పన్ను బిల్లు(జిఎస్‌టి) బిల్లుకు అన్ని పార్టీలూ మద్దతిస్తూనే.. దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి.

08/31/2016 - 06:17

హైదరాబాద్, ఆగస్టు 30:వరద ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని పులిచింతల గేట్లు వెంటనే ఎత్తి వేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావును కోరారు. మంగళవారం ఈ మేరకు ఫోన్ చేసి మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల నల్లగొండ జిల్లాలోని పలు గ్రామాలు ముంపు సమస్య ఎదుర్కొంటున్నాయి.

08/31/2016 - 06:16

న్యూఢిల్లీ, ఆగస్టు 30: సి.ఎన్.బి.సి, టి.వి 18 తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఈ సంవత్సరం అత్యంత అధిక ఆశావహ రాష్ట్రం అవార్డును రాష్ట్ర పురపాలక, ఐ.టి శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అరుణ్‌జైట్లీ ఈ అవార్డును రామారావుకు బహూకరించారు.

08/31/2016 - 06:15

శివ్వంపేట, ఆగస్టు 30: భూ తగాదం విషయం సోమవారం అర్దరాత్రి 2 గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులపై గిరిజనులు రాళ్లు, కారంపొడి, కట్టెలతో దాడి చేసిన సంఘటన మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామపంచాయితీలో గల తాలపల్లి ధర్మతాండలో జరిగింది.

08/31/2016 - 06:15

హైదరాబాద్, ఆగస్టు 30: జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమైన ఒక రోజు అసెంబ్లీ ముగిసింది. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశమైన శాసనసభ జిఎస్‌టి బిల్లుకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేయడంతో పాటు మూడు బిల్లుల ఆమోదం తరువాత మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు స్పీకర్ మధుసూదనాచారి నిరవధిక వాయిదా వేశారు. ఉభయ సభల్లోనూ మూడు బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారు.

08/31/2016 - 06:14

హైదరాబాద్, ఆగస్టు 30: కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నందున పోలీసు వ్యవస్థను సైతం పునర్ వ్యవస్థీకరించాలని పలువురు శాసన సభ్యులు కోరారు. సైబరాబాద్ మహానగర పోలీసు సవరణ బిల్లును హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం శాసన సభలో ప్రవేశపెట్టిన తరువాత జరిగిన చర్చలో పలువురు శాసన సభ్యులు కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు.

08/31/2016 - 06:13

హైదరాబాద్, ఆగస్టు 30: ముఖ్యమంత్రి కెసిఆర్, టిడిపి ఎమ్మెల్యేలు పార్టీ మార్పిడిపై అవినీతికి పాల్పడ్డారని విచారణ జరిపించాలని కోరుతూ ఫర్హాత్ ఇబ్రహీం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైదరాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి, పలువురు టిడిపి ఎమ్మెల్యేలపై అవినీతి కేసు నమోదు చేయాలని కింది కోర్టులో ఇబ్రహీం పిటీషన్ దాఖలు చేయగా కొట్టివేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

08/31/2016 - 06:13

రాజమహేంద్రవరం, ఆగస్టు 30: హోమియో వైద్య పరీక్షల్లో అవకతవకలు వెలుగు చూశాయి. రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమి యో కళాశాలలో పరీక్షల ఒఎంఆర్ షీట్లు తారుమారైన విషయం యూనివర్శిటీ ఉన్నతాధికారులు జరిపిన విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ప్రిన్సిపాల్‌ను పరీక్షల విధుల నుంచి తప్పిస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాలు జారీచేశారు. అసలు విషయంలోకెళితే..

08/31/2016 - 06:12

విశాఖపట్నం, ఆగస్టు 30: వాతావరణ శాఖ నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి ఒక వ్యవస్థను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ) అభివృద్ధి చేస్తోంది.

Pages