S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 17:54

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదయ్యింది. తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌ను కాపీ చేశారంటూ ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులు సబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

07/05/2016 - 17:42

నెల్లూరు : ఏఎస్‌పేట పరిధిలోని పలు కాలనీలలో పిచ్చికుక్క గతరాత్రి నుంచి ఇప్పటివరకు 23 మందిని గాయపర్చింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రబుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/05/2016 - 17:40

సికింద్రాబాద్: చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ లో మంగళవారం కలుషిత నీరు తాగి 140 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారు. కలుషిత నీరు తాగిన వీరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. బాధితులను మెట్టుగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/05/2016 - 17:20

తిరుపతి : తిరుపతి శివారులోని మంగళం అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన ఎర్రచందనం కూలీలు పరారైయ్యారు. 14 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూలీల కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.

07/05/2016 - 17:17

తూర్పుగోదావరి: కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని మంగళవారం అరెస్ట్ చేశారు. రూ. 2.28 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

07/05/2016 - 17:15

కడప : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ పార్తీబన్ కందస్వామిని, ముగ్గురు తమిళ కూలీలను మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 21 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

07/05/2016 - 16:56

హైదరాబాద్: కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల సమావేశం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. కృష్ణానది బోర్డు నిర్వహణ, విధి విధానాలపై రెండు రాష్ట్రాల అధికారులు ప్రధానంగా చర్చించనున్నారు.

07/05/2016 - 16:54

హైదరాబాద్‌ : సనత్‌నగర్ మెట్రోస్టేషన్ సమీపంలో మంగళవారం వాటర్ ట్యాంకర్ ఓ బైకును ఢీ కొట్టింది. కూకట్‌పల్లి ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేస్తోన్న మురళి కృష్ణ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా. వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. మురళీ కృష్ణ కు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే లోపే అతను మరణించాడు. ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

07/05/2016 - 16:51

హైదరాబాద్‌: భువనగిరి కోటను అడ్వెంచర్, టూరిస్టు కేంద్రంగా మారుస్తామని, నెల రోజుల్లో రోప్‌వే పనులు ప్రారంభిస్తామని తెలంగాణ పర్యాటక శాఖా మంత్రి చందులాల్‌ మంగళవారం తెలిపారు. రూ.50 కోట్లతో కోటని అభివృద్ధి చేస్తామన్నారు. కోటపై లైటింగ్‌, విడిది సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

07/05/2016 - 16:48

హైదరాబాద్‌: నగరంలోని పలుచోట్ల మంగళవారం వర్షం భారీ వర్షం కురిసింది. ఎర్రగడ్డ, బాలానగర్‌, సనత్‌నగర్‌, జీడిమెట్లలో భారీ వర్షం నమోదవగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఓ మోస్తారు వర్షం కురిసింది.

Pages