S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 16:27

ఢిల్లీ: హైకోర్టుల పేర్లు మార్చుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కలకతా హైకోర్టును కోల్‌కతా హైకోర్టుగా, బాంబే హైకోర్టును ముంబై హైకోర్టుగా, మద్రాస్ హైకోర్టును చెన్నై హైకోర్టుగా పిలుస్తారు.

07/05/2016 - 16:25

హైదరాబాద్: గుంటూరు జిల్లా న్యాయమూర్తిగా సి.సుమలత, కృష్ణా జిల్లా న్యాయమూర్తిగా వై.లక్ష్మణరావు, కర్నూలు జిల్లా న్యాయమూర్తిగా జి.అనుపమ చక్రవర్తి, నెల్లూరు జిల్లా న్యాయమూర్తిగా మౌలానా జునైద్ అహ్మద్, కడప జిల్లా న్యాయమూర్తిగా జి.సునీత, విశాఖ సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్‌.శశిధర్‌రెడ్డిని నియమించారు.

07/05/2016 - 15:39

దిల్లీ: మోదీ మంత్రివర్గంలో 19 మంది కొత్తవారు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఓ మంత్రి గాభరాలో తన పేరును మరచిపోయారు. తన పేరు చెప్పకుండానే ఆయన ప్రమాణ పత్రం చదువుతుండగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గమనించి తప్పును సరిదిద్దారు. మహారాష్ట్ర నుంచి బిజెపి భాగస్వామి పక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందిన రామ్‌దాస్ అథవాలే (56) ప్రమాణ స్వీకారం చేస్తున్నపుడు తడబడిపోయి తన పేరును చదవడం మరిచారు.

07/05/2016 - 15:39

హైదరాబాద్: భార్యను హత్యచేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో తీసుకుపోయి శంషాబాద్ సమీపంలో భర్తే పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో పోలీసులు కొత్తకోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని పద్మారావునగర్‌లో ఉంటున్న వ్యాపారి రూపేశ్ తన భార్య సింథియాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

07/05/2016 - 15:38

హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ రాజకీయాలు చేస్తున్నారని, న్యాయాధికారులను సస్పెండ్ చేసినా ఆయన పెదవి విప్పడం లేదని బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.

07/05/2016 - 15:37

విజయవాడ: తప్పుడు కథనాలను ప్రచురించారన్న అభియోగంపై రాజమండ్రి పోలీసులు సాక్షి పత్రికపై కేసులు నమోదు చేశారని సమాచారం. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇటీవల ఆమరణ దీక్ష చేసినపుడు ఆయన ఆరోగ్యం గురించి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లకు భిన్నంగా సాక్షిలో వార్తలు రాశారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

07/05/2016 - 15:37

సికింద్రాబాద్: చైన్‌స్నాచింగ్‌లను అరికట్టేందుకు పోలీసులు ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ ఆగంతకులు నగరంలో రెచ్చిపోతూనే ఉన్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు ఎక్కుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఓ ఆగంతకుడు చేజిక్కించుకుని పరారయ్యాడు. రోడ్లపైనే కాదు, రైల్వేస్టేషన్లలోనూ చైన్‌స్నాచింగ్‌లు జరగడం పట్ల మహిళలు ఆందోళన చెందుతున్నారు.

07/05/2016 - 15:36

హైదరాబాద్: హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జీలకు ఆప్షన్ల రద్దు కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు మంగళవారం ఉదయం నగరంలోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమై హైకోర్టు విభజన విషయమై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.

07/05/2016 - 13:53

విజయవాడ : ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన సికిం ద్రాబాద్‌ - విజయవాడ ఇంటర్‌సిటీ ( నెంబర్‌ 12796 ) ఎక్స్‌ప్రెస్‌ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే స్వల్పంగా మార్పు చేసింది. ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు 10.08 గం టలకు గుంటూరు వచ్చి 10.10 గంటలకు విజయవాడ బయలుదేరి వెళుతోన్నది.

07/05/2016 - 13:49

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికారు. నిహాల్‌ చంద్‌, రామశంకర్‌ కఠారియా, సన్వర్‌లాల్‌ జాట్‌, మనుసుఖ్‌భాయ్‌ వాస్వా, ఎం.కె.కుందారియాను మంత్రివర్గం నుంచి తొలగించారు. సహాయ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నతి కల్పించడంతో పాటు 19మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

Pages