S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 12:28

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మంగళవారం ఉదయం ముగిసింది. రాష్టప్రతి భవన్‌లోని దర్బార్ హాలులో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత సహాయ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు క్యాబినెట్ హోదా లభించింది. ఈసారి క్యాబినెట్ విస్తరణలో ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది.
కొత్త మంత్రులు వీరే...
-------------------------

07/05/2016 - 11:59

నల్గొండ: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఓ ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా ఆరుగురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుజలూరు సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో 8 మంది వెళుతుండగా వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఢీకొంది. గాయపడ్డ ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

07/05/2016 - 11:58

శ్రీకాకుళం: పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కొన్ని సెకన్లపాటు కంపించడంతో ప్రజలు భయాందోళనలకు లోనై ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని సామగ్రి కింద పడినట్లు పలువురు తెలిపారు. కాగా, నెలరోజుల వ్యవధిలో భూమి కంపించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

07/05/2016 - 11:58

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గతంలో తమకు కేటాయించిన గదులను ఇతరులకు కేటాయించడం పద్ధతి కాదని టిడిఎల్‌పి నాయకులు విమర్శిస్తున్నారు. తాము గదులను ఖాళీ చేయకుండానే వాటిని వేరేవారికి ఇవ్వడంలో స్పీకర్ మధుసూదనాచారి ఏకపక్షంగా వ్యవహరించారని టిడిపి నేత రేవంత్ ఆరోపించారు. స్పీకర్ నిర్ణయంపై అవసరమైతే తాము కోర్టుకు వెళతామన్నారు.

07/05/2016 - 11:57

నల్గొండ: ఓ మానసికరోగి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం బీభత్సం సృష్టించాడు. ఆస్పత్రి వార్డులో ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశాడు. దీంతో చుట్టుపక్కలవారు జోక్యం చేసుకుని మానసికరోగిని బంధించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

07/05/2016 - 11:51

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి సమన్లు జారీ చేసింది. కార్తీ చిదంబరం స్వయంగా లేదా తన ప్రతినిధి ద్వారా ఈ వారంలో హాజరవ్వాలని ఈడీ ఆదేశించింది. 2జీ కుంభకోణంలో ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందంలోని మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి కేసు విచారణ జరుగుతుండగా తొలిసారి కార్తీకి ఈడీ నోటీసులు పంపించింది.

07/05/2016 - 11:39

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో మంగళవారం ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నతి లభించింది. కేబినెట్‌ మంత్రిగా ప్రమాణం చేశారు.

07/05/2016 - 11:17

ఉత్తరాఖండ్‌ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పలు గ్రామాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేశాయి. ఛమోలీ ప్రాంతంలో చాలా గ్రామాలు వరద బారిన పడ్డాయి. నదులు పొంగడంతో భారీ సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. వరద నీరు ఊరును ముంచెత్తడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడిపారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.

07/05/2016 - 22:31

ముంబై : మంగళవారం ఉదయం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల బాటపట్టింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 32 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది, నిఫ్టీ 15 పాయింట్లడాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు కోల్పోయి రూ. 67.35ల వద్ద ఉంది.కు పైగా నష్టంలో ట్రేడవుతోంది.

07/05/2016 - 07:51

విజయవాడ, జూలై 4: కృష్ణా పుష్కరాలకు కేవలం 38 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రాజధాని బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా విజయవాడ నగరంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు పుష్కరుడు కృష్ణలో ప్రవేశించే పుణ్యకాలం నాటికి కూడా పూర్తయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి.

Pages