S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 01:01

తిరుమల, జూన్ 17: తిరుమలలోని బాలాజీ నగర్‌లో ప్రతి రోజూ రాత్రి చిరుతపులి సంచరిస్తూ హల్‌చల్ చేస్తోంది. స్థానిక బాలాజీనగర్ ప్రాంతం, దీనికి సమీపాన ఉండే ప్రైవేట్ మఠాల వద్దకు గత కొద్ది రోజులుగా చిరుత తచ్చాడుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ అర్థరాత్రి వేళలో చిరుతపులి సమీప అటవీప్రాంతం నుంచి నివాసాల వెనుక వైపున్న పొదలలోకి చేరుకుని వేటాడేందుకు ఎదురుచూస్తోంది.

06/18/2016 - 01:00

తిరుపతి, జూన్ 17: ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశంలోని వ్యవసాయ రంగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని దీనిని వ్యవసాయ విద్యార్థులు అర్థం చేసుకోవడంతోపాటు సద్వినియోగం చేసుకోవాలని ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పిజి స్టడీస్ డీన్ డాక్టర్ ఆర్ వీరరాఘవయ్య అన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, అగ్రిబిజెనెస్ పి జి విద్యార్థులకు ఒక్కరోజు అనుసంధాన కార్యక్రమం జరిగింది.

06/18/2016 - 00:59

తిరుపతి, జూన్ 17: గ్రామీణ పేద ప్రజల కోసం త్వరలో మొబైల్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్‌రెడ్డి చెప్పారు. స్విమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం పుత్తూరు మండలం, కె వి ఆర్ పురం గ్రామంలోని ఎంపిపి స్కూల్లో డాక్టర్ ఎన్ టి ఆర్ ఉచిత వైద్య సేవాశిబిరాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

06/18/2016 - 00:59

తిరుపతి, జూన్ 17: దేశంలోని పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలంటే శాస్ర్తియ పద్ధతిలో పశుగణన జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర గణాంఖాల కార్యదర్శి టిసిఎం అనంత్ అన్నారు. తిరుచానూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం పశుగణాంకాల సేకరణపై వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని అన్నారు.

06/18/2016 - 00:59

తిరుపతి, జూన్ 17: తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఇందుకు ప్రజలు సహకరించాలని కమీషనర్ వినయ్‌చంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయల్‌చెరువు రోడ్డు వెడల్పు చేయడం, సుందరీకరణ అలాగే లక్ష్మీపురం సర్కిల్‌లో కల్వర్టు పనులు, ఎమ్మార్ పల్లిలో రాములవారి గుడి, ఎల్.ఎస్.వినగర్ 2వ లైనులో కాలువ నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. టీచర్ల కాలనీలో డబ్ల్యూ.బి.ఎం.

06/18/2016 - 00:58

పూతలపట్టు, జూన్ 17: ప్రతివిద్యార్థి విద్యార్థి దశలోనే కష్టపడి చదివితే బంగారు భవిషత్తుకు పునాది అని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయాన్ని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. అనంతరం స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్‌ను మంత్రి గంటాశ్రీనివాసరావు సందర్శించి విద్యార్థుల శిక్షణా తరగతులను పరిశీలించారు.

06/18/2016 - 00:57

తిరుమల, జూన్ 17: ఇటీవల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన టిటిడి ఇ ఒ సాంబశివరావును టిటిడిలోని పలు విభాగాల అధికారులు దుశ్శాలువలు, పుష్ప గుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం టిటిడి సీనియర్ అధికారులతో ఇ ఒ సమీక్షా సమావేశం అనంతరం ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఇ ఒ వారిని ఉద్దేసించి మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరారు.

06/18/2016 - 00:57

తవణంపల్లె, జూన్ 17: టి.పుత్తూరు కోదండరాముల వారి ఆలయంలో ఈనెల 14నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తిరుమంజనం, పాలాభిషేకం కార్యక్రమం జరుగగా సాయంత్రం స్వామివారిని ఊంజల్‌సేవ జరిగింది. రాత్రి అందంగా అలంకరించిన స్వామివారిని హనుమంత వాహనంపై ఉంచిపురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు పలపుష్ప నారికేళ తాంబూలాది కర్పూర హారతులిచ్చి తీర్థ ప్రసాదాలను పొందారు.

06/18/2016 - 00:55

ముద్దనూరు, జూన్ 17: మేజర్ పంచాయతీని దత్తత తీసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ జవహర్‌రెడ్డి శుక్రవారం పలుచోట్ల జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. మొదటగా నాలుగురోడ్ల కూడలిలో కేంద్ర ఆర్థికశాఖ నిధులు, ఎన్ ఆర్‌జి ఎస్ నిధుల ద్వారా నిర్మాణం చేపట్టిన సిసి రోడ్లను తనిఖీ చేశారు.

06/18/2016 - 00:54

కడప, జూన్ 17:కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం ప్రతి ఒక్కరికీ శాశ్వత గృహం నిర్మించేందుకు పట్టణాలకు 6300 గృహాలు మంజూరుచేసింది.

Pages