S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 11:54

ఖమ్మం: పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద మావోయిస్టులు మంగళవారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. రహదారిని తవ్వేసి చెట్లను నరికివేశారు. పోలవరంతో పాటు గ్రీన్‌హంట్‌ను ఆపివేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని రాసిన లేఖలను సంఘటన స్థలంలో మావోలు విడిచిపెట్టారు.

05/03/2016 - 11:53

కరీంనగర్: దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ చిరుతపులి బావిలోపడిన ఘటన ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లిలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. బావిలో పడిన చిరుతను చూసి గ్రామస్థులు అధికారులకు సమాచారం చేరవేశారు. బావిలోనుంచి చిరుతను బయటకు తీసే ప్రయత్నాలు ప్రారంభించారు.

05/03/2016 - 07:01

అనంతపురం మే 2: తెలుగుదేశం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నగరంలోని కమ్మభవన్‌లో నేడు నిర్వహించనున్నారు. ఉదయం 10.30గం.లకు ప్రారంభకానున్న సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఇతర ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ సంఘాల నాయకులు హాజరు కానున్నారు. ఈనేపథ్యంలో పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది.

05/03/2016 - 07:00

కడప, మే 2: వైసిపి హైకమాండ్ పిలుపు మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ప్రభుత్వవిధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నా నిర్వహించారు. వైకాపా శ్రేణులు ఎండను లెక్కచేయకుండా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కడపలో వైకాపా జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాధరెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా, కడప మేయర్ కె.సురేష్‌బాబుల నేతృత్వంలో ధర్నా చేపట్టారు.

05/03/2016 - 06:58

తిరుపతి, మే 2 : తన అధికార దాహం, తన కుమారుడి అధికార దాహం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపిస్తున్న శ్రద్ద రాష్ట్ర వ్యాప్తంగా తాగడానికి నీరులేక గొంతెండుతున్న ప్రజల దాహార్తిని తీర్చడానికి శ్రద్ధ చూపడంలేదని వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు.

05/03/2016 - 06:56

కాకినాడ, మే 2: కాకినాడ నగర పాలక సంస్థకు అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టు జిల్లా కలెక్టర్, కాకినాడ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి హనుమంతు అరుణ్‌కుమార్ చెప్పారు. ఎన్నికలకు ముందుగా ‘కోడ్’ (ఎన్నికల ప్రవర్తన నియమావళి) జారీ అయ్యే అవకాశం ఉందని, ఈలోగా ప్రగతి సాధించేందుకు అధికారులు రేయింబవళ్ళు శ్రమించాలని సూచించారు.

05/03/2016 - 06:55

కర్నూలు, మే 2 : కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి ఎగువన తెలంగాణలో నిర్మించే పాలమూరు, దిండి ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు జరిగే నష్టంపై సోమవారం జరిగిన మంత్రివర్గంలో చర్చించారు.

05/03/2016 - 06:54

ఆత్మకూరు, మే 2: ఆత్మకూరు కేంద్రంగా రెవెన్యూ డైగ్లాట్‌లో చుక్కలున్న భూముల రైతుల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ ఆందోళనలకు అఖిలపక్షంగా రాజకీయ పార్టీలన్నీ మద్దతివ్వడం గమనార్హం. ఈ నిరసనల నేపథ్యంలో చుక్కల భూములేమిటి? అంటూ అంతటా సందేహాలు రేకెత్తుతున్నాయి. దీని గురించి అనుమానాల నివృత్తికి వెళ్లాలంటే 108 సంవత్సరాలకు పూర్వం చోటుచేసుకున్న వివిధ సంఘటనల సమాహారంపై ప్రస్తావించుకోవాలి.

05/03/2016 - 06:51

చీరాలరూరల్, మే 2: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నీళ్లు లేకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడంతో ఆందోళన చేసి ప్రయాణికులు 50 నిమిషాల పాటు చీరాల రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి ఆందోళన చేశారు. సోమవారం ఉదయం 11.30 నిమిషాలకు చీరాల చేరుకున్న అహ్మదాబాద్ - చెన్నై సూపర్‌ఫాస్ట్ రైలు రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు 12.20 గంటల వరకు చీరాల్లో రైలును నిలిపి వేశారు.

05/03/2016 - 06:51

అనకాపల్లి (నెహ్రూచౌక్), మే 2: అధికార దాహంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు సాధ్యం కాని హామీలను గుప్పించి గద్దెనెక్కి రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలుచేయకుండా ప్రజలను మోసగించారని ఆరోపిస్తూ సోమవారం అనకాపల్లిలో వైకాపా పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Pages