S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 04:58

బెంగళూరు, మే 2: ఈశాన్య బెంగళూరులో 22ఏళ్ల యువతిని పట్టపగలే అపహరించుకుపోయిన ఘటన విస్మయానికి గురిచేసింది. ఆమెను అపహరించుకుపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పేయింగ్ గెస్ట్ హాస్టల్ ముందు ఫోన్‌లో మాట్లాడుతున్న యువతిని వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి చేతులతో ఎత్తుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లాడు. కొద్దిసేపటి తరువాత ఆమెను వదిలేసి అతను పారిపోయాడు.

05/03/2016 - 04:53

విజయవాడ, మే 2: వైకాపా నుంచి వలసలు జోరందుకుంటున్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో అదే స్పీడులో వర్గ రాజకీయాలు కూడా ఊపందుకుంటున్నాయి. భూమా వర్గీయులు తమ అనుచరులపై దాడి చేస్తున్నారంటూ మాజీ మంత్రి, నంద్యాల తెలుగుదేశం ఇన్‌చార్జ్ శిల్పా మోహన్‌రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో రెండు వర్గాలను పిలిపించుకుని పంచాయితీ పెట్టారు.

05/03/2016 - 04:47

రాజమహేంద్రవరం, మే 2: రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిల పొత్తు కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితులు నెలకొంటున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్రం నుండి రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి సహాయం అందడంలేదన్నారు. రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్‌తోపాటు బిజెపికీ భాగం ఉందన్నారు.

05/03/2016 - 04:46

ఖమ్మం, మే 2: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు ఖమ్మం జిల్లా వైకాపా కార్యవర్గమంతా టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు.

05/03/2016 - 04:46

గుంటూరు (కొత్తపేట), మే 2: ఆర్థిక కుంభకోణంలో బాధితులుగా మారిన అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి హిందూ కళాశాల కూడలిలో మానవహారం నిర్వహించారు.

05/03/2016 - 04:45

ఖమ్మం, మే 2: తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలకు భవిష్యత్ లేదని, త్వరలోనే వైసిపి తరహాలో టిడిపి నేతలంతా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు ఖమ్మం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు.

05/03/2016 - 04:44

రామభద్రపురం, మే 2: గృహనిర్మాణశాఖ ఎఇ రూ.పది కోట్ల మేరకు అక్రమాస్తులు కూడబెట్టారు. పక్కాసమాచారంలో ఏకకాలంలో పలు చోట్ల దాడులు నిర్వహించిన అధికారులు అతని బంధువుల పేర ఉన్న భారీ భవంతులు, లాకర్లలోని బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

05/03/2016 - 04:44

గుంటూరు (కొత్తపేట), మే 2: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సెజ్‌ల పేరుతో వాన్‌పిక్, లేపాక్షి, సరస్వతి సిమెంటు ఫ్యాక్టరీల పేరుతో వేలాది ఎకరాలను రైతుల వద్ద నుంచి అప్పనంగా కాజేసి, చివరకు ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రైతులపైనే దాడులు చేసిన జగన్‌కు అన్నదాతల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

05/03/2016 - 04:44

కాకినాడ, మే 2: ఎపి ఎంసెట్-2016కు హాజరైన అభ్యర్ధులకు ఏ విధమైన అభ్యంతరాలున్నా ఈనెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని జెఎన్‌టియుకె స్పష్టంచేసింది. ఏప్రిల్ 29న ఎంసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అదే రోజు ప్రిలిమినరీ కీని జెఎన్‌టియుకె ప్రకటించింది.

05/03/2016 - 04:43

ఒంగోలు, మే 2: జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు ఆర్‌టిఒ కార్యాలయం బయట ఉన్న ఏజెంట్ల కార్యాలయాలపై సోమవారం దాడులు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై కాకినాడ డిటిసి ఆదిమూలం మోహన్ ఎసిబికి చిక్కిన నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఆర్టీఎ ఏజెంట్ల కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం బ్రోకర్ల వ్యవస్ధను చాలా ఏళ్ల కిందట రద్దుచేసింది.

Pages