S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/10/2016 - 04:25

మనిషి పరిసరాలు లేకుండా బతకలేడు. మనిషి లేకుండా ప్రకృతి బతకలేదు. భూమండలాన్ని కాపాడటం ప్రతి మానవుని కర్తవ్యం. భూమండలం కాలుష్యానికి కూడా మనిషే కారకుడు. చివరకు మనిషి బతకలేని పరిస్థితి వస్తుందా అనే అనుమానం వస్తున్నది. ఓజోన్ పొర కరిగిపోవటం కార్బన్‌డై ఆక్సైడ్ పెరగటం, కార్తెలు మారటం ప్రమాదానికి సంకేతం. భూగోళమంటే రాజధానులు, దేశాల పేర్లు చెప్పటం కాదు.

03/10/2016 - 04:24

మదరాసు ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. తమిళనాడులోని ప్రభుత్వేతర పాఠశాలల్లో ప్రతిరోజు జాతీయ గీతాన్ని-నేషనల్ యాంథమ్-ఆలపించాలని మార్చి ఐదవ తేదీన ఆదేశించింది! విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో విధిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్న కేంద్ర ప్రభుత్వం వారి సూచన ఈ ఆదేశానికి నేపథ్యం!

03/10/2016 - 04:20

పశ్చిమ బెంగాల్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలన్న భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని వామకూటమి-లెఫ్ట్‌ఫ్రంట్-నిర్ణయం సైద్ధాంతికమైన దివాళాకోరుతనానికి పరాకాష్ఠ! గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో జట్టుకట్టింది!

03/10/2016 - 04:06

శివమయం జగత్. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీలేదు. శివశబ్దమే కల్యాణకారకం అని అర్థం. శివుడు సకల జగాలకు పాలకుడు. దిక్కులనే అంబరాలు ధరించినవాడు. జగమంతటికీ ఆకలి తీర్చే అన్నపూర్ణ సాక్షాత్తు ఆయన ధర్మపత్ని అయినప్పటి ఆయన మాత్రం ఆదిభిక్షువుగా పేరుగాంచాడు.

03/10/2016 - 04:05

ప్రకృతి అంతా రాగరంజితమైంది. కృష్ణుడు గోవులను తోలుకొని పల్లె చేరాడు. ఇక నేను కూడా అస్త్రాది చేరుతాను అని ఉల్లసించాడు సూర్యుడు. ఆకాశమంతా ఎర్రబడింది కేశి మహాసురుడి మృత శరీరంలా. తమ కులం పెద్దను భీకరంగా వధించాడనే క్రోధంతో నిశాచర గణం పరిగెత్తివచ్చినట్లు నాలుగు దెసలా చీకట్లు ఆవరించాయి.

03/10/2016 - 04:01

‘‘ఆ తాచుపాము మెడ పట్టి పడగ దింపాలి రామలింగ నాయకా! ఇక ఉపేక్ష పనికిరాదు’’ తిమ్మరుసు నెమ్మదిగా చెప్పినా నిర్ణయం దృఢంగా ఉంది.
‘‘కాగల కార్యమేమిటి మహామంత్రీ!’’ వ్యాస రాయలు శాంతంగా అడిగారు.
‘‘ఏముంది. వీరేంద్రుడిని తన్ని తగలేయటమే’’ ఆవేశంగా బుసలు కొట్టాడు రామలింగనాయకుడు.

03/10/2016 - 03:57

తే. విగతజీవుఁడై పడియున్న వేదమూర్తి
యతని చేత సంజీవితుఁడై వెలుంగె
దనుజ మంత్రి యుచ్చారణ దక్షు చేత
నభిహితం బగు శబ్దంబునట్ల పోలె

03/10/2016 - 03:48

‘అది ఇది ఏలన? ఇక అన్ని రంగముల..’ అన్నట్టుగా భారతీయ మహిళలు గగనవీధిలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మన రక్షణరంగానికి సంబంధించి త్రివిధ దళాల్లో మహిళల భాగస్వామ్యం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది. దేశ సరిహద్దుల్లో కఠోర బాధ్యతలు నిర్వహించేందుకే కాదు, విమానాల్లో విహరిస్తూ ఆకాశమార్గాన యుద్ధ విన్యాసాలు చేసేందుకూ మగువలు ముందుకొస్తున్నారు.

03/10/2016 - 03:50

దేశ సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షించే కీలక బాధ్యతలను తొలిసారిగా ఓ మహిళ స్వీకరించబోతోంది. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన 24 ఏళ్ల తనూశ్రీ పరీఖ్ సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అధికారుల శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందేందుకు ఎంపికై సరికొత్త రికార్డును సృష్టించారు. శిక్షణ అనంతరం ఆమె అసిస్టెంట్ కమాండర్‌గా బాధ్యతలు చేపడతారు. బిఎస్‌ఎఫ్‌లో నేరుగా అధికారి హోదాలో ఓ మహిళ నియామకం పొందడం ఇదే ప్రథమం.

03/10/2016 - 03:40

పాకిస్తాన్‌లోని చెక్వాల్ జిల్లాలో అతి పురాతన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కటాస్‌రాజ్ ఆలయాన్ని సందర్శించి శివరాత్రి సందర్భంగా అభిషేకాది పూజాలు, జాగరణలు చేయడానికి 175 మంది హిందువులు ఈమధ్య వాఘా గేట్‌ను దాటి ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారు.

Pages