S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/09/2016 - 21:37

యూత్‌ఫుల్ దర్శకుడిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని లేటెస్టుగా ‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు మారుతి. ఆయన తాజాగా వెంకటేష్‌తో రూపొందిస్తున్న ‘బాబు బంగారం’ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తరువాత మారుతి ఓ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

03/09/2016 - 21:35

నిశ్చల్, వందనాగుప్త జంటగా కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తులసిదళం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని రేపు విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ చెప్పిన విశేషాలు..ఆయన మాటల్లోనే
ప్రేమకు సమస్య హారరే

03/09/2016 - 19:36

న్యూదిల్లి:టి-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ కోల్‌కతాలో నిర్వహించేందుకు ఐసిసి అనుమతించినప్పటికీ భారత్‌నుంచి తమ జట్టుకు గట్టి భద్రత ఇస్తామన్న హామీ వస్తేనే పాకిస్తాన్ ఆ పోటీలో పాల్గొంటుందని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇంతవరకు తమకు భారత్‌నుంచి అలాంటి హామీ ఏమీ లభించలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు.

03/09/2016 - 19:35

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారంనాడు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ పనులు చక్కబెట్టుకున్నాక లండన్ బయలుదేరి వెళతారు. గురువారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌నుంచి దిల్లీకి వెళతారు.

03/09/2016 - 19:34

ధర్మశాల:టి-20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ తొలి పోటీలో బంగ్లాదేశ్ జట్టు విజయంతో బోణీ కొట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో బుధవారం నేదర్లాండ్స్‌తో జరిగిన పోటీలో బంగ్లాదేశ్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్న బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది.

03/09/2016 - 17:47

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి తీరతామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై మంత్రి దేవినేని, జగన్ మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నెలకొంది. మంత్రి దేవినేని స్పందిస్తూ పట్టిసీమ ద్వారా గోదావరి జిలాలను తరలించి కృష్ణా డెల్టాలో పంటను కాపాడామన్నారు. వైఎస్‌ హయాంలో జలయజ్ఞం పేరుతో వేలకోట్లు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు.

03/09/2016 - 17:44

నల్గొండ: నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీలో బుధవారం జెన్‌కో ఏడీ వెంకట్ భాస్కర్‌ ఇంట్లో రూ.10 లక్షలు విలువచేసే బంగారం, రూ.60 వేల నగదును దుండగులు పట్టుకుపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

03/09/2016 - 17:42

వరంగల్ : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కారు జోరుగా సాగుతోంది. 36 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించి మేయరు పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇతరులు 9 స్థానాలను గెల్చుకున్నారు.

03/09/2016 - 17:39

హైదరాబాద్‌: అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీలో 10.99శాతం అభివృద్ది సాధిస్తే... తెలంగాణలో 9.24శాతమే నమోదైందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి హామీలన్నీ సాధించుకుంటామన్నారు.

03/09/2016 - 17:37

హైదరాబాద్: ఓ వివాహితను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో నిందితుడైన ఎపి మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్‌ను బుధవారం బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు కస్టడీలో ఉంచుకుని నిందితుడిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Pages