S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/09/2016 - 12:02

విశాఖ: విశాఖ ఏజెన్సీలోని సీలేరు ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేసి కోటి రూపాయల విలువచేసే 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

03/09/2016 - 12:02

శ్రీకాకుళం: విదేశీ జీడిపిక్కల దిగుమతిపై 9.36 శాతం పన్ను విధించటాన్ని వ్యతిరేకిస్తూ పలాస ప్రాంతంలో బుధవారం జీడి పరిశ్రమల యజమానులు బంద్ పాటిస్తున్నారు. దాదాపు 150 జీడిపప్పు పరిశ్రమలు మూతపడ్డాయి.

03/09/2016 - 12:01

హైదరాబాద్: ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘంగా ప్రసంగించరాదని స్పీకర్ పదేపదే చెప్పటంతో, అందుకు నిరసనగా ఎ.పి. అసెంబ్లీలో బుధవారం వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. సమావేశం ప్రారంభమైన వెంటనే విపక్ష నేత వై.ఎస్.జగన్ మాట్లాడుతూ రైతు రుణాలను ప్రభుత్వం చెల్లించనందున రాష్టవ్య్రాప్తంగా రైతులు అధిక మొత్తంలో అపరాధ వడ్డీ చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

03/09/2016 - 12:01

హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలకు, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు పూర్తి ఆధిక్యతలో నిలిచారు. వరంగల్‌లో 58 డివిజన్లు ఉండగా, ఇప్పటివరకు తెరాస 29, కాంగ్రెస్ 3, బిజెపి 2, ఇతరులు 6 డివిజన్లలో గెలిచారు. ఖమ్మంలో 50 డివిజన్లు ఉండగా, తెరాస 34, కాంగ్రెస్ 10, సిపిఎం, సిపిఐ, వైకాపా చెరో రెండు స్థానాల్లో గెలిచారు.

03/09/2016 - 07:38

ఇంద్రకీలాద్రి: మహా శివరాత్రి పర్వదిన మహోత్సవాల్లో భాగంగా పాతబస్తీ కెనాల్ రోడ్‌లో మంగళవారం సాయంత్రం వైభవోపేతంగా శ్రీ కన్యకపరమేశ్వరీ అన్నసత్రం కమిటీ అధ్యర్యంలో స్వామి రథోత్సవ ఊరేగింపు మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. తొలుత రథంలో కొలువై ఉన్న దేవతమూర్తులకు ఆయన పూజలు చేశారు.

03/09/2016 - 07:37

విజయవాడ: అనుమతించిన రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జిల్లాలో ఉచిత నూతన ఇసుక విధానం అమలుపై జిల్లా కలెక్టర్ బాబు.ఎ మంగళవారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

03/09/2016 - 07:37

మచిలీపట్నం (కోనేరుసెంటర్): దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని వక్తలు అన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ (ఐసిఇయు) ఆధ్వర్యంలో స్థానిక ఎల్‌ఐసి డివిజన్ కార్యాలయంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

03/09/2016 - 07:36

తోట్లవల్లూరు: ఆడపిల్లలు అభివృద్ది చెందిననాడే దేశాభివృద్ధి జరుగుతుందని తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలులో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ తోట్లవల్లూరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఉపాధ్యాయిని సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సునీత మాట్లాడుతూ మహిళలు విద్యతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలన్నారు.

03/09/2016 - 07:35

మచిలీపట్నం (కల్చరల్): పట్టణంలోని పలు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిఎంఎస్ అండ్ ఎస్‌విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పదవ అదనపు జిల్లా జడ్జి స్వర్ణలత మాట్లాడుతూ స్ర్తిలు చిన్న, చిన్న సమస్యలకు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వివేకంతో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.

03/09/2016 - 07:34

మచిలీపట్నం: పెన్షన్లు, రేషన్ పంపిణీలో దూసుకుపోతున్న కృష్ణా జిల్లా ఇంటిపన్ను వసూళ్లలో మాత్రం వెనుకబడింది. నూరుశాతం ఇంటిపన్ను వసూళ్లు గగనకుసుమంగా మారుతోంది. లక్ష్యాన్ని సాధించే విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సత్ఫలితాలు ఇవ్వడం లేదు.

Pages