S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/24/2017 - 00:28

విజయవాడ, జూలై 23: 2017-18 విద్యా సంవత్సరం ఆరంభమై విద్యాసంస్థల్లో త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతుంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు, కళాశాలల యాజమాన్యాల మధ్య వార్ నడుస్తోంది. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 3 వేల ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి.

07/24/2017 - 02:19

భీమవరం, జూలై 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతల కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రకటించారు. ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ జైల్ భరోలో తామే స్వచ్ఛందంగా అరెస్టు అవుతామన్నారు.

07/23/2017 - 03:06

అమరావతి, జూలై 22: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు-జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ఖరారయింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగుల సమస్యలను గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వారిని ఆదుకోవాలన్న పవన్ సూచనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిగణనలోకి తీసుకున్నారు. అక్కడకు వైద్యశాఖ మంత్రి సహా ప్రత్యేక వైద్యబృందాన్ని పంపించారు.

07/23/2017 - 03:05

వినుకొండరూరల్, జూలై 22: గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని గోకనకొండ గ్రామంలో వివాహిత కొండి వరలక్ష్మి (22) శనివారం రాత్రి తన 6 నెలల కుమార్తె శర్మిషను నీటితొట్టిలో వేసి చంపి, అనంతరం తాను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలనేపథ్యంలో పాపను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

07/23/2017 - 03:04

అమరావతి, జూలై 22: దళితులపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం వేసుకున్న లెక్కలు తప్పేలా కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపిలోని మాలలు కాంగ్రెస్ వైపు, మాదిగలు టిడిపి వైపు.. తెలంగాణలో మాదిగలు టిడిపి, మాలలు కాంగ్రెస్ వైపు ఉండేవారు. విభజన తర్వాత కాంగ్రెస్‌కు చెందిన మాల వర్గ నేతలు ప్రత్యామ్నాయంగా టిడిపిలో చేరారు.

07/23/2017 - 03:03

విజయవాడ (కార్పొరేషన్), జూలై 22: అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాష్టప్రతి ఎన్నికల్లో మిలాఖత్ అయిన విషయాన్ని గుర్తిస్తే ఆ రెండు పార్టీలు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి మోకరిల్లుతూ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్ట పెట్టినట్టుగా భావించాల్సి ఉంటుందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసిసి పిఆర్‌ఓ కెహెచ్ మునియప్ప ధ్వజమెత్తారు.

07/23/2017 - 03:03

విజయవాడ (పటమట) 22: బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడు సంవత్సరాలలో దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోయిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ విద్యావేత్తకాదు, కేవలం 4వ తరగతి చదివిన ఆయనకు సంస్కరణలు గురించి ఏమి తెలుసునని ప్రశ్నించారు.

07/23/2017 - 03:02

హైదరాబాద్, జూలై 22: దళితులపై జరుగుతున్న దాడుల్లో ఎపి రెండో స్థానంలో ఉందని వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు.

07/23/2017 - 02:59

విశాఖపట్నం, జూలై 22: విశాఖ భూ కుంభకోణంపై విచారణ నిమిత్తం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను బిజెపి శాసనసభ పక్ష నేత పి విష్ణుకుమార్ రాజు శనివారం కలిశారు. సిట్ ఉన్నతాధికారి వినీత్ బ్రిజ్‌లాల్‌ను స్వయంగా కలిసి పలు అంశాలపై తన వద్దనున్న ఆధారాలను అందజేశారు.

07/23/2017 - 02:57

అమరావతి, జూలై 22: నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం ఆసక్తికరంగా మారింది. గత కొద్దిరోజుల క్రితం పునర్విభజన ప్రక్రియ మొత్తం పూర్తయిపోయిందని, ప్రధాని ఆమోదమే తరువాయంటూ హడావిడి చేసిన టిడిపి-టిఆర్‌ఎస్ వర్గాలకు రెండు తెలుగురాష్ట్రాల బిజెపి నాయకత్వాల అభ్యంతరాలతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్టయింది.

Pages