S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/11/2017 - 00:09

విజయవాడ, జూలై 10: అధికార దాహం కోసం రాష్ట్రంలో జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారని, అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ఇడుపులపాయను ముడుపులపాయగా మార్చి తండ్రి బాటలో జగన్ పయనించడం చాలా విడ్డూరంగా ఉందని సోమవారం ఒక ప్రకటనలో జవహర్ విమర్శించారు. పాదయాత్రలో గనులను గుర్తించడానికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు.

07/10/2017 - 03:36

శ్రీశైలం, జూలై 9: ఆషాడమాస పౌర్ణమి పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ఆదివారం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

07/10/2017 - 03:35

పుట్టపర్తి, జూలై 9: నిస్వార్థ సేవలకు ప్రతిరూపం సత్యసాయి సేవలని కేంద్ర ఐటి, సమాచార శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అభివర్ణించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఆదివారం నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుతో కలిసి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

07/10/2017 - 03:30

కర్నూలు, జూలై 9: గత మూడేళ్లలో రాష్ట్రంలో రూ. 3.75లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వాటిని ఆధారాలతో నిరూపిస్తే రాష్ట్ర కేబినెట్ మొత్తం మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి సవాల్ విసిరారు. కర్నూలు నగరంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం కెఇ విలేఖరులతో మాట్లాడారు.

07/10/2017 - 03:30

మచిలీపట్నం, జూలై 9: వైసిపి ప్లీనరీ నేరగాళ్ల పంచాయితీ మాదిరిగా సాగిందని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఘాటుగా విమర్శించారు. ఆత్మస్తుతి కోసమే ప్లీనరీ సమావేశాలు నిర్వహించారుతప్ప ప్రజాసమస్యలపై మాత్రం కాదని విమర్శించారు.

07/10/2017 - 03:28

కాకినాడ, జూలై 9: తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రామన రాంబాబు ఊహించినట్టే ఆదివారం రాజీనామా చేశారు. కాకినాడలో కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కలసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్ సైతం పదవికి రాజీనామా చేశారు.

07/10/2017 - 03:27

విశాఖపట్నం, జూలై 9: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి 22వ చాతుర్మాస్య దీక్ష రుషీకేశ్‌లో ప్రారంభమైంది. ఈ దీక్ష సెప్టెంబర్ ఆరో తేదీ వరకూ జరగనుంది. గణపతి, వ్యాస పూజలతో ఈ దీక్ష ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ గవర్నర్ కృష్ణకాంత్ పాల్, అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్‌చంద్ అగర్వాల్, ఉత్తరాఖండ్ బిజెపి అధికార ప్రతినిధి నరసింగరావు దంపతులు హాజరయ్యారు.

07/10/2017 - 03:27

తిరుపతి, జూలై 9: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పెద్దజియ్యంగారి నేతృత్వంలో చాతుర్మాస్య దీక్ష సంకల్పం వైభవంగా జరిగింది. పెద్దజియ్యంగారు తిరుమల బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కనగల మఠం నుంచి చిన్నజియ్యంగార్ శిష్యబృందంతో బయల్దేరారు. వరాహస్వామివారి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించారు. మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.

07/10/2017 - 03:18

అమరావతి, జూలై 9: ‘చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికి ఉండాలన్నదే నా కోరిక. చనిపోయిన తర్వాత నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండేలా ప్రజలకు మంచిపని చేయాలనుంది. చంద్రబాబు మాదిరిగా ఎన్నికల్లో అబద్ధపు హామీ ఇచ్చి ఉంటే మేం కూడా అధికారంలోకి వచ్చేవాళ్లం. భవిష్యత్ తమదేనన్న భరోసా కార్యకర్తల్లో కనిపిస్తోంది. మేం అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తాం.

07/10/2017 - 03:16

అమరావతి, జూలై 9: ‘నాయకుడనేవాడు ప్రజల మనసులు చదవాలి. వారి గుండె చప్పుడులో ఉండాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి లేనిలోటు మా కుటుంబంతో పాటు ప్రజల్లోనూ ఉంది. కాంగ్రెస్, టిడిపి కలిసి నా బిడ్డపై అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశాయి. అసెంబ్లీలో జగన్ పట్ల అధికార పక్షం తీరును చూసి ఎన్నోసార్లు బాధపడ్డాను.

Pages