S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/11/2017 - 00:14

విజయవాడ, జూలై 10: మరో పది రోజుల్లో విజయవాడ మెట్రో రైలుపై తుది నిర్ణయం తీసుకుంటామని పురపాలక మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాటాడుతూ ఇటీవల అమెరికా పర్యటనలో సిఎం చంద్రబాబునాయుడు ఎలక్ట్రికల్ బస్సులు పరిశీలించారతెలిపారు. రాష్ట్రంలో వాటి వినియోగంపై దృష్టి సారించాలని ఆదేశించారన్నారు.

07/11/2017 - 00:13

విజయవాడ, జూలై 10: శానిటరీ నాప్కిన్స్‌పై జిఎస్‌టి విధింపును నిరసిస్తూ నెలసరిపై పన్ను వద్దు అంటూ మహిళల చేపట్టిన నిరసన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘నా నెలసరిపై పన్ను వద్దు’ (డోన్ట్ ట్యాక్స్ ఆన్ మై పీరియడ్) అంటూ సామాజిక మాధ్యమాల్లో చేపట్టిన నిరసన గళం జోరందుకుంది. శానిటరీ నాప్కిన్స్‌పై 12 శాతం మేర జిఎస్‌టి విధించిన కేంద్ర ప్రభుత్వ తీరుపై మహిళల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

07/11/2017 - 00:13

విజయవాడ, జూలై 10: గురుకుల పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేయడాన్ని స్వచ్చంద సంస్థలకు అప్పగించడం వల్ల 80 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో వివిధ కార్మిక సంఘాల నేతలతో సోమవారం మంత్రి సమావేశయమ్యారు. మధ్యాహ్న భోజన పథక కార్మికులకు తగిన న్యాయం చేయాలని కోరారు.

07/11/2017 - 00:12

అమరావతి, జూలై 10: పర్యాటక వసతి గృహాలు ఇక కొత్త అందాలను సంతరించుకోనున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సౌకర్యవంతంగా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఐదు నక్షత్రాల హోటళ్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అంతర్గత రూపురేఖలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోగా, పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని అందించనున్నాయి.

07/11/2017 - 00:12

విజయవాడ, జూలై 10: వైఎస్సార్ సిపి ప్లీనరీ అంతా అబద్ధాలతో సాగింది.. రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా వైఎస్సార్ సిపి అధినేత జగన్ అబద్ధాలు మాట్లాడారు.. రైతులు, మహిళల కోసం వైఎస్‌తోపాటు కాంగ్రెస్ పాలనలో పదేళ్లలో ఎంతమేర వెచ్చించారు.. టిడిపి మూడేళ్ల పాలనలో ఎంత ఖర్చు చేశాం.. అనే దానిపై బహిరంగ చర్చకు రావాలని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సవాల్ విసిరారు.

07/11/2017 - 00:12

విజయవాడ, జూలై 10: రోడ్డు ప్రమాదంలో కాలు నుజ్జునుజ్జ అయ్యి శస్త్ర చికిత్సకు సహాయం అందించాలని తన వద్దకు వచ్చిన నెల్లూరు జిల్లా వాసి గంగామహేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 7 లక్షల సహాయం అందజేశారు. చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలం చావలి లింగమనాయుడుపల్లిలో ప్రమాదానికి గురై కోమాలో ఉన్న నూతలపాటి కుప్పయ్య నాయుడుకు రూ. 7 లక్షలు మంజూరు చేశారు.

07/11/2017 - 00:11

విజయవాడ, జూలై 10: మీరు పదోన్నతులు, బదిలీలు కావాలంటే ప్రజాప్రతినిధులు గుర్తొస్తారు. అధికారులు పనితీరు ద్వారా ఫలితాలు చూపించకుంటే స్థానచలనం తప్పదు. మిమ్మల్ని ఉపేక్షిస్తే ప్రజలు మా స్థానాలను మారుస్తారని మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు చురకలు అంటించారు. సోమవారం కృష్ణాజిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో యనమల హాజరయ్యారు.

07/11/2017 - 00:11

గుంటూరు, జూలై 10: రాష్ట్ర కొబ్బరి అభివృద్ధి బోర్డు పథకాల పర్యవేక్షణకు రాష్టస్థ్రాయి మానిటరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ మేరకు సోమవారం జీవో నెంబర్ 416 విడుదల చేసింది. అగ్రికల్చరల్ కో ఆపరేటివ్, హార్టికల్చర్ సెక్రటరి కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

07/11/2017 - 00:10

విజయవాడ, జూలై 10: ఈనెల 17తేదీ జరిగే రాష్టప్రతి ఎన్నికల్లో మతతత్వ బిజెపి అభ్యర్థి రామ్‌నాధ్ కోవింద్‌ను బలపరచే విషయమై పునరాలోచన చేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సోమవారం సిఎం చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. సామాజిక న్యాయ, ప్రజాస్వామ్య, సెక్యులర్ సిద్ధాంతాలకు ప్రతినిధిగా పోటీచేస్తున్న మీరా కుమార్‌ను బలపరిచే విధంగా పునరాలోచన చేయాలని కోరారు.

07/11/2017 - 00:10

విజయవాడ (క్రైం), జూలై 10: వైసిపి అధినేత జగన్ తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డి అన్నారు. 30ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానంటున్న జగన్.. సీఎం సీటుకు జైలుకు తేడా తెలుసుకుని మాట్లాడాలన్నారు.

Pages