S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/11/2017 - 02:46

అమరావతి, జూలై 10: పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు గతేడాది కన్నా వేగంగా సాగుతుండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రోజుకు సరాసరిన 2,500 క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ పనులు జరుగుతుండగా, వచ్చే వారం కల్లా పనులు వేగాన్ని సగటున రోజుకు 3,500 క్యూబిక్ మీటర్ల మేర పెంచాలని అధికారులు ఆదేశించారు.

07/11/2017 - 02:44

కాకినాడ, జూలై 10: మూఢ నమ్మకంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో జరిగింది. కలకలం సృష్టించిన ఈ దుర్ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

07/11/2017 - 02:42

కర్నూలు, జూలై 10: నిత్య వివాదాలతో వార్తలకెక్కుతున్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసారి ఏకంగా ఐసియులోనే ఎసిలు పనిచేయకుండా మొరాయించాయి. దీంతో రోగులు ఎవరి ఫ్యాన్ వారు తెచ్చుకోవాల్సిన పరిస్థితి సోమవారం ఎదురైంది. రోగులకు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టాల్సిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియూ)లో గాలి లేక రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

07/11/2017 - 02:39

భీమవరం, జూలై 10: రాష్ట్రంలోని జలాశయాలు, కాలువల్లోని నీటి నిల్వలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇక నుంచి ఈ లెక్కలు పక్కాగా ఉండాలని భావించి ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చెయ్యాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ‘వాటర్ రిసోర్స్’ సైట్‌ను కూడా ఏర్పాటుచేసింది. దీనిపైన ఒక యాప్‌ను కూడా రూపొందించనుంది. వీటి ద్వారా ఇక ప్రతీ రోజూ వివరాలు నమోదుచేయాలి.

07/11/2017 - 02:38

కాకినాడ, జూలై 10: తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌కు కొత్త ఛైర్మన్‌గా ఊహించినట్టే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్ బాధ్యతలు స్వీకరించడానికి రంగం సిద్ధమయ్యింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 15వ తేదీన జడ్పీ తాత్కాలిక ఛైర్మన్‌గా నవీన్ బాధ్యతలు చేపట్టనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు.

07/11/2017 - 02:36

విశాఖపట్నం, జూలై 10: విశాఖ భూ కుంభకోణం ఎప్పుడు ఎవరి మెడకు ఎలా చుట్టుకుంటుందో తెలియడం లేదు. కుంభకోణంలో పాల్పంచుకున్న రాజకీయ నాయకులంతా తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కుంభకోణానికి కారణం ఉద్యోగులని చివరిగా చూపించే వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. అసలు విశాఖలో భూ కుంభకోణం తమ ప్రభుత్వంలో జరగలేదని, గత ప్రభుత్వాల పాపమేనని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.

07/11/2017 - 02:35

చిన్నమండెం, జూలై 10: కడప జిల్లాలో సోమవారం ఆర్టీసీ బస్సు తగులబడింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి-పెద్దమండెం మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. రాయచోటి నుంచి చిన్నమండెం మీదుగా పెద్దమండెంకు వెళ్లిన పల్లెవెలుగు బస్సు తిరిగి రాయచోటికి వస్తుండగా కుంటకిందపల్లె వద్ద ఆగిపోయింది.

07/11/2017 - 02:35

విజయవాడ, జూలై 10: ఒక విమానయాన సంస్థ బోర్డింగ్ పాస్ ఇచ్చేందుకు నిరాకరించడంపై మీడియా ప్రశ్నకు తనదైన శైలిలో దండం పెట్టి, సమాధానం చెప్పకుండా అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి దాటవేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం సోమవారం జరిగింది.

07/11/2017 - 02:34

గుంటూరు, జూలై 10: రాష్ట్రంలో మూడేళ్ల చంద్రబాబు అవినీతి పాలనపై వైసిపి విడుదల చేసిన పుస్తకంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని తేదీ, సమయాన్ని టిడిపి నాయకులు ఖరారు చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. అవినీతికి ఆధార్‌కార్డు లాంటి చంద్రబాబు నాయుడు ఇతరులను విమర్శించడం మానుకోవాలని హితవుపలికారు.

07/11/2017 - 02:34

కొండపి, జూలై 10 : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థి ఈత కొలనులో మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. ప్రకాశం జిల్లా కొండెపి మండలంలోని కట్టావారిపాలెం గ్రామానికి చెందిన కట్టా వెంకటరమణయ్య కుమారుడు మల్లికార్జునరావు (22) రెండు నెలల క్రితం ఉన్నత చదువుల (ఎంఎస్) చదివేందుకు జర్మనీ వెళ్ళాడు.

Pages