S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/12/2017 - 00:38

న్యూఢిల్లీ, జూలై 11: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని న్యాయాధికారుల క్యాడర్ విభజనపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ ఆగస్టు 2వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే న్యాయాధికారుల నియామకాలపై హైకోర్టు మార్గదర్శకాలను కేంద్రానికి సమర్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సుప్రీం కోర్టుకు నివేదిక సమార్పించాల్సి ఉంది.

07/12/2017 - 00:38

న్యూఢిల్లీ,జూలై 11: ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాలలోని 2010-16 మధ్యకాలంలో తపాలాశాఖలో గ్రామీణ్ డాక్ సేవక్(జీడీఎస్) విభాగంలో కారుణ్య నియామకాలు అర్హత ఉండి తిరస్కరణకు గురైన వారికి ఉద్యోగ నియామకాలు కల్పించాలని కేంద్రాన్ని గతంలో పోస్టల్ శాఖలో పని చేసిన వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలకు చేందిన గ్రామీణ డాక్ సేవక్ విభాగంలో గతంలో పనిచేసిన వారి కుటుంబ సభ్యలకు కారుణ్య నియామకాల ద్వారా

07/12/2017 - 00:37

అమరావతి, జూలై 11: పర్యాటకం పేరిట ప్రభుత్వ భూములు లీజుకు తీసుకుని ఆపైన ఎలాంటి పనులూ చేపట్టకుండా ఉన్న సంస్థల పట్ల ఇక ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామంటూ పాలకులను ఒప్పించి రాష్ట్రంలోని పలుచోట్ల వందలాది ఎకరాల భూములను వివిధ ప్రైవేట్ సంస్థలు లీజు రూపంలో తమ పరం చేసుకోగా ఇప్పుడు పర్యాటక శాఖ ఆ అంశాలను పూర్తి స్థాయిలో సమీక్షిస్తోంది.

07/12/2017 - 00:37

అమరావతి, జూలై 11: రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కారు మరో పెద్ద బాధ్యత కట్టబెట్టనుంది. తుపాను షెల్టర్ల నిర్వహణ ఇకపై మహిళా సంఘాలే చూడనున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న తుపాను కేంద్రాల నిర్వహణ తీరును బట్టి వాటిని బహుళ ప్రయోజనకారిగా మార్చాలన్న సర్కారు లక్ష్యానికి డ్వాక్రా బృందాలు సహకరించనున్నాయి.

07/11/2017 - 23:55

న్యూఢిల్లీ,జూలై 11: ఆంధ్రాలో ఏపి విభజన చట్ట ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మంగళవారం నాడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మానవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు,ఎంపీ కేసినేని నానిలు కలిశారు.

07/11/2017 - 23:55

అమరావతి, జూలై 11: రాష్ట్రంలో ప్రతి పేదవాడూ కోరుకునేంత దాకా చదువుకునే వీలు కల్పిద్దాం. విద్య సామాన్యుడి హక్కు అని తెలియజేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి చదవలేకపోతున్నామనే ఆవేదన ఏ పేద విద్యార్థిలోనూ రానివ్వకుండా చేద్దామన్నారు. అనంతపురం జిల్లాలో ‘ఎనర్జీ వర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నాం.

07/11/2017 - 23:54

మార్కాపురం, జూలై 11 : విజయవాడలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న తురక సాంబయ్య (19) మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలో చదువుతున్న సాంబయ్య ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం గ్రామంలోని ఇంటికి వచ్చి ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు ప్రశ్నించినప్పటికీ ఏమీ చెప్పలేకపోయాడు.

07/11/2017 - 23:54

తిరుపతి, జూలై 11: వైకాపా రాష్ట్ర ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రకటించిన నవరత్నాల్లాంటి హామీలను చూసి టిడిపికి నవరంధ్రాల్లో అలజడి పుడుతోందని వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడారు.జగన్ హామీ ఇచ్చాడు అంటే అది అమలు చేయడం కోసమేనని ప్రజలకు బాగా తెలుసన్నారు.

07/11/2017 - 23:54

ఆళ్లగడ్డ, జూలై 11: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ట్రాన్స్‌కో ఎడిఇ నాగరాజు ఇంట్లో మంగళవారం సైతం సోదాలు కొనసాగాయి. ఆదాయానికి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు సోమవారం దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డ, కర్నూలులోని ఆంధ్రబ్యాంకు శాఖల్లో నాగరాజు, అతని బంధువుల పేర 5 లాకర్లు ఉన్నట్లు గుర్తించారు.

07/11/2017 - 23:53

విజయవాడ, జూలై 11: లౌకిక సిద్ధాంతాలకు ప్రతినిధిగా రాష్టప్రతి ఎన్నికల్లో పోటీచేస్తున్న మీరాకుమార్ అభ్యర్థిత్వాన్ని తెదేపా, వైసిపి, బిజెపి ఎమ్మెల్యేలు బలపరచాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి కోరారు. ఆ మేరకు ఆయా పార్టీలకు ఆయన మంగళవారం లేఖ రాశారు. రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామనాధ్ కోవింద్‌ను తెలుగుదేశం బలపరచడం ఏపి ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమన్నారు.

Pages