S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/11/2017 - 02:31

విశాఖపట్నం, జూలై 10: స్థానిక 104 ఏరియాలోని 41వ వార్డు టౌన్ ప్లానింగ్ ఉద్యోగి 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు సోమవారం దాడి చేసి పట్టుకున్నారు. ఏసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ అందించిన వివరాల ప్రకారం వెంకటరెడ్డి తన ఇంటి ప్లాన్ కోసం టౌన్ ప్లానింగ్ ఇన్‌స్పెక్టర్ డి శ్రీనివాసరావు వద్దకు వెళ్లాడు. ఇందుకోసం ఆయన 40 వేల రూపాయల లంచం అడిగాడు.

07/11/2017 - 02:30

అనంతపురం, జూలై 10: రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని కేసుల దర్యాప్తులో పురోగతిని సాధించాలని, తద్వారా పోలీసుశాఖ భవితవ్యం మెరుగ్గా ఉంటుందని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు అన్నారు. అనంతపురం పోలీసు ట్రైనింగ్ కాలేజీ (పిటిసి)లో 350 మంది శిక్షణ ఎస్‌ఐలు, ఎఎస్‌ఐలకు ఇండక్షన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని డిజిపి సోమవారం ప్రారంభించారు.

07/11/2017 - 02:21

విజయవాడ(బెంజిసర్కిల్), జూలై 10: తాను ఐటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి 90 రోజులు పూర్తయ్యిందని, ఈ మూడు నెలల్లో రెండు ప్రధాన పాలసీలతో 35 ఐటి కంపెనీలు రాష్ట్రాంలో ఏర్పాటు చేయడంతో పాటు సుమారు పది వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, ఐటి కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

07/11/2017 - 02:25

విజయవాడ, జూలై 10: ఏపి సిఆర్డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ) పరిధిలోని పాత లేఅవుట్ల సమస్యని మంత్రిమండలి ఉప సంఘం ఎట్టకేలకు పరిష్కరించింది. మంత్రి మండలి ఉప సంఘం సచివాలయం 2వ బ్లాక్‌లో సోమవారం మధ్యాహ్నం ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సీఆర్డీఏ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సమావేశమైంది.

07/11/2017 - 02:15

అమరావతి, జూలై 10: నంద్యాల నియోజకవర్గంలో ఎన్నిక ఏకపక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడలు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు నంద్యాల ఉపఎన్నిక ఒక పరీక్ష అని, ఈ పరీక్షలో ఫస్టు మార్కులు రావాలని అన్నారు.

07/11/2017 - 01:25

రాజమహేంద్రవరం, జూలై 10: పట్టిసీమపై చర్చకు తాను సిద్ధమేనని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రకటించారు. తన సవాల్‌ను స్వీకరించి చర్చకు అంగీకరించిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గోరంట్ల చెప్పినట్టు 18వ తేదీన రైతుల సమక్షంలో చర్చకు తాను సిద్ధమేనన్నారు.

07/11/2017 - 01:24

కాకినాడ సిటీ, జూలై 10: స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ముగ్గురు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు పసికందులు, ఓ మహిళ వున్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం సమీపంలోని బొబ్బిల్లంక గ్రామానికి చెందిన పొన్నాడ అనసూయ (55), పొన్నాడ పవన్‌సాయికుమార్ (17 నెలలు), రాజమహేంద్రవరానికి చెందిన కోన వెంకట గణిత్ (16 నెలలు) గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు.

07/11/2017 - 01:23

విజయవాడ, జూలై 10: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అన్ని పార్టీల ట్రేడ్ యూనియన్లు మద్దతు పలికాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించామన్నారు. వైఎస్‌ఆర్ సిపి ట్రేడ్ యూనియన్ ఈ సమావేశానికి హాజరు కాలేదన్నారు.

07/11/2017 - 01:23

హైదరాబాద్, జూలై 10: అమరావతిలో తమ పార్టీ ప్లీనరీ పండుగలా జరిగిందని, తెలుగు దేశం పార్టీ మహానాడు తద్దినంలా జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమ పార్టీ ప్లీనరీ సక్సెస్ కావడంతో టిడిపి నేతల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

07/11/2017 - 01:22

తిరుపతి, జూలై 10: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ఇప్పటి వరకు సందర్శకులకు ఎంతో ఆహ్లాదకరంగా నిలిచిన 12 ఏళ్ల వయసు కలిగిన జిరాఫీ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. గుండెపోటుతో మృతి చెందినట్లు క్యూరేటర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

Pages