S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/04/2017 - 03:43

అమరావతి, జూలై 3: ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల్లో కనీసం నాలుగు పంపుల ద్వారా అయినా నీటిని వదిలి ఏలేరు రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈనెల మూడో సోమవారం పురుషోత్తపట్నం పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని చెప్పారు.

07/04/2017 - 03:25

విశాఖపట్నం, జూలై 3: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నూతన మద్యం పాలసీ ఆరంభంలోనే తడబడుతోంది. కొత్తగా మద్యం దుకాణాల జారీ, బార్లకు లైసెన్సుల మంజూరు వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాలసీ ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా కొలిక్కి రాలేదు.

07/04/2017 - 02:14

మారేడుమిల్లి, జూలై 3: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన చాపరాయిలో గిరిజనుల మరణాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే సంభవించాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్ష్యుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఒకే గ్రామంలో 20 రోజుల వ్యవధిలో 16 మంది గిరిజనులు జ్వరాలతో మృతిచెందడం జాతీయ విపత్తేనని అన్నారు.

07/04/2017 - 02:12

రంపచోడవరం, జూలై 3: ఏజెన్సీలో వైద్య సేవలు విస్తృత పరచడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. భారీగా జ్వర మరణాలు సంభవించిన తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి గ్రామస్థులను కోడెల పరామర్శించారు.

07/04/2017 - 02:10

గండేపల్లి, జూలై 3: ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిలో శస్తచ్రికిత్సలు చేయించుకున్న పలువురు కంటిచూపు కోల్పోయినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో శస్తచ్రికిత్సలు జరగగా, అప్పటినుంచి బాధితులు సదరు ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ చివరకు విలేఖర్ల ముందుకొచ్చారు.

07/04/2017 - 02:09

హైదరాబాద్, జూలై 3: సదావర్తి సత్రం భూములను తక్కువ ధరకే టిడిపి నేతలు కొట్టేయాలని చేసిన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ఆభూములపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం తాము డబ్బులు కడతామని తెలిపారు.

07/04/2017 - 02:09

ఇంద్రకీలాద్రి: ఈ నెల 7 నుండి 9వ తేదీవరకు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో శాకాంబరీదేవి మహోత్సవాలు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవతగా ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వివిధ రకాలైన కూరగాయాలనే ఆభరణాలుగా ధరించి శాకంబరీదేవిగా భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.

07/04/2017 - 02:08

శ్రీశైలం, జూలై 3: ఆశాడ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 9న శ్రీశైల భ్రమరాంబికకు శాఖంబరి అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో అలంకరించనున్నారు. ఆ రోజున అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు.

07/04/2017 - 02:08

హైదరాబాద్, జూలై 3: యుపిఏ అభ్యర్థిగా రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న మీరా కుమార్ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడే పార్లమెంటు తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ బిల్లు ఆమోదించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అటువంటి మీరాకుమార్ పోటీ చేస్తే తాము ఎందుకు మద్దతునివ్వాలని భూమన ప్రశ్నించారు.

07/04/2017 - 02:07

భీమవరం, జూలై 3: రాష్ట్రంలో సంచలనం కలిగించిన పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు సాంఘిక బహిష్కరణ అంశాన్ని కాంగ్రెస్ నేతలు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల నేతలు గ్రామాన్ని సందర్శించిన నేపథ్యంలో మంగళవారం పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గ్రామాన్ని సందర్శించనున్నారు.

Pages