S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/05/2019 - 20:49

విశాఖపట్నం, జూలై 5: నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని పక్కనపెట్టి పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీల అమలు విషయం చూడాలని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఏపీ సీఎం జగన్‌కు సూచించారు.

07/05/2019 - 20:49

నెల్లిమర్ల, జూలై 5: ఫిజియో థెరపీ వైద్యానికి మంచి భవిష్యత్ ఉందని ఆంధ్రామెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ అన్నారు. శుక్రవారం మిమ్స్ మెడికల్ కళాశాలలో ఫిజియో థెరపీ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన సర్ట్ఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిజియో థెరపీ వైద్యరంగంలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు.

07/05/2019 - 20:48

విజయవాడ, జూలై 4: శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీ (ఆర్టీజీఎస్) శుక్రవారం హెచ్చరించింది. సముద్రపు అలలు 2.5 నుంచి 4 మీటర్ల ఎత్తుకు ఎగిసి పడతాయని తెలిపింది. గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

07/05/2019 - 20:47

విజయవాడ, జూలై 5: రాష్ట్రంలోని శనగ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ధరల స్థిరీకరణ నిధి నుంచి మార్కెట్ రేటుకు అదనంగా క్వింటాల్‌కు 1500 రూపాయలు చొప్పున చెల్లించేందుకు నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో ధర అంత లాభదాయకంగా లేకపోవడంతో శనగ రైతులు తమ ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజీల్లో, గోదాముల్లో నిల్వ చేశారు. రెండు సంవత్సరాలుగా గోదాముల్లో దాదాపు 59 లక్షల క్వింటాళ్ల మేర శనగ మగ్గుతోంది.

07/05/2019 - 20:46

విజయవాడ, జూలై 5: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8న రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుస్థిర వ్యవసాయాన్ని సాధించేందుకు వీలుగా రైతులకు కావాల్సిన సేవలు, ఇతర అంశాల్లో మద్దతు ఇచ్చేందుకు వీలుగా రైతు దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు.

07/05/2019 - 20:45

విజయవాడ, జూలై 5: అటవీ హక్కుల చట్టం- 2006 ప్రకారం ఆయా భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో అటవీ భూముల హక్కు చట్టం రాష్ట్ర స్థాయి పర్యవేక్షణా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎల్వీ మాట్లాడుతూ ఈ చట్టం కిందకు వచ్చే భూముల వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు.

07/05/2019 - 04:57

కావలి రూరల్, జూలై 4: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన, అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీకి చెందిన పలువురు ముఖ్యులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

07/05/2019 - 04:56

విశాఖపట్నం, జూలై 4: అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ఏర్పాటు ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది.

07/05/2019 - 04:54

విశాఖపట్నం, జూలై 4: ప్రపంచంలో శాంతి, సుస్థిరత భారతదేశం ద్వారానే సాధ్యమవుతుందని, ప్రపంచ అగ్రరాజ్యాలు సమస్యల వలయంలోకి జారుకుంటున్న తరుణంలో అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి రవికుమార్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.

07/05/2019 - 04:35

విజయవాడ, జూలై 4: గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలను డీఎస్సీ (జిల్లా ఎంపిక కమిటీ) ద్వారా చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ఆయన సమీక్ష గురువారం నిర్వహించారు.

Pages