S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/12/2019 - 23:47

గుంటూరు, ఏప్రిల్ 12: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సార్వత్రిక ఎన్నికల స్ఫూర్తిని కొనసాగిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవిఎల్ నరసింహారావు హాజరయ్యారు.

04/12/2019 - 16:46

అమరావతి: ఈవీఎంల వ్యవహారంపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఇందుకోసం తాను రేపు ఢిల్లీ వెళుతున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై తాను దేశస్థాయిలో పోరాడుతున్నట్లు తెలిపారు. తనను సంప్రదించకుండానే సీఎస్‌ను, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చారని అన్నారు. తనుకు వీళ్లు భద్రత కల్పిస్తారా అని ప్రశ్నించారు.

04/12/2019 - 12:43

తాడేపల్లిగూడెం: స్థానిక మసీదు సెంటర్‌లో గురువారం అర్థరాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతిచెందాడు. మద్యం తాగిన సంపత్, షేక్ జానీల మధ్య ఈ గొడవ జరిగింది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి జానీపై సంపత్ చాకుతో దాడిచేశాడు. అడ్డుకోబోయిన ఇద్దరిపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ పిల్లి వెంకన్న(45) తాడేపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

04/12/2019 - 12:34

విజయవాడ: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి బి. ఉదయలక్ష్మి ఫలితాలను శుక్రవారంనాడు విడుదల చేశారు. 24 రోజుల్లోనే ఫలితాలు విడుదల అవ్వటం విశేషం. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే విజయం సాధించటం విశేషం. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 60శాతం, ద్వితీయ సంవత్సరంలో 72శాతం ఉతీర్ణత సాధించింది. రెండు సంవత్సరాల ఫలితాల్లో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో ఉంది.

04/12/2019 - 12:31

విజయవాడ: ఏపీలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో పదిమంది మృతిచెందారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం పరాకులవాండ్లపల్లి వద్ద లారీ-మినీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో తొమ్మిది మంది వ్యక్తులకు గాయాలయ్యాయి. అలాగే కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి వద్ద ఆయిల్ ట్యాంకర్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

04/12/2019 - 05:41

నెల్లూరు/తిరుపతి, ఏప్రిల్ 11: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు చోట్ల ఇవిఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. నెల్లూరు నగరం, రూరల్, కోవూరు, కావలి తదితర నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో ఇవిఎంలు మొరాయించాయి. సాంకేతిక సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేక పోయారు. దీంతో ఇటువంటి చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

04/12/2019 - 05:38

విజయవాడ, ఏప్రిల్ 11: రాష్ట్రంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన కొత్త ఈవీఎంలకు కూడా టీడీపీ ఏజెంట్ల ఒత్తిడి మేరకు మాక్ పోలింగ్ చేయించాకే పోలింగ్ ప్రారంభించారు. మొరాయించిన ఈవీఎంలకు చాలా చోట్ల మరమ్మతులు చేసి పని చేయించారు. కొన్ని చోట్ల కొత్త ఈవీఎంలను అమర్చారు.

04/12/2019 - 05:36

కడప, ఏప్రిల్ 11: స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా కడప జిల్లాలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలుచోట్ల టీడీపీ, వైకాపా వర్గీయులు పరస్పరం దాడులకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 71.03 శాతం ఓట్లు పోలయ్యాయి. మైదుకూరు నియోజకవర్గం జాండ్లవరం, చిన్నయ్యగారిపల్లెలో ఈవీఎంలను టేబుల్ పైనుంచి కిందకు తోసేశారు.

04/12/2019 - 05:36

పులివెందుల, ఏప్రిల్ 11: ‘రాష్ట్ర ప్రజలకు మాపై నమ్మకముంది.. అలాగే దేవుని ఆశీస్సులు మాపై ఉన్నాయి.. ఈ ఎన్నికల్లో గెలుపు మాదే’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందుల మున్సిపల్ పరిధిలోని బాకరాపురంలో ఉన్న 134వ నెంబరు పోలింగ్ బూత్‌లో జగన్ గురువారం ఉదయం 7.55 గంటలకు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

04/12/2019 - 05:35

విజయనగరం, ఏప్రిల్ 11: విజయనగరం జిల్లాలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ ఆంధ్రా-ఒడిశా వివాదాస్పద గ్రామాలైన కొఠియా ప్రజలకు చుక్కెదురైంది. వీరంతా ముందు ఒడిశాలో ఓటు వేసుకొని ఆంధ్రాలోని పోలింగ్ స్టేషన్‌కు రావడంతో అక్కడ పోలింగ్ అధికారి వారికి ఓటు వేసే అవకాశం లేదని స్పష్టం చేయడంతో వారంతా వెనుదిరిగారు. కొఠియాలో దాదాపు వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు.

Pages