S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/18/2017 - 05:11

మడకశిర, ఫిబ్రవరి 17 : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు దండుకోవడానికే ప్రధాని నరేంద్రమోదీ రైతులకు రుణమాఫీ ప్రకటన చేశారని పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిరలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఓటమి బాటలో ఉన్న నేపథ్యంలో అధికారం చేజిక్కుంచుకోవడానికి రుణమాఫీ ప్రకటన చేసిందన్నారు.

02/18/2017 - 03:46

అమరావతి, ఫిబ్రవరి 17: నేతల క్రమశిక్షణా రాహిత్యం, కుమ్ములాటలు, ప్రతిపక్షాలపై విమర్శల్లో నిర్లిప్తత, జిల్లా నేతల వైఫల్యాలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్షింతలు వేశారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన పార్టీ వర్క్‌షాప్‌లో బాబు సుదీర్ఖ సమయం కేటాయించారు. జిల్లాల వారీగా బృందాలుగా విభజించి చర్చలు జరిపించారు.

02/18/2017 - 03:42

విజయవాడ (రైల్వేస్టేషన్), ఫిబ్రవరి 17: ప్రధాన రైల్వే స్టేషన్లకు చెందిన విలువైన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వాణిజ్య పరంగా అభివృద్ధి చేసి, ఆదాయం పెంచుకునే ఆలోచనలో రైల్వేశాఖ ఉండగా, విజయవాడలో 45 ఏళ్ల క్రితం చేసుకున్న ఒక ఒప్పందం అతీగతీ లేకుండా ఉంది.

02/18/2017 - 03:40

విజయవాడ, ఫిబ్రవరి 17: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎనిమిది ఐటి కంపెనీలు శుక్రవారం ప్రారంభమ కావటం శుభసూచకమని, రాబోయే కాలంలో అమరావతిలో మరిన్ని ఐటి కంపెనీలు రానున్నాయని సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.

02/18/2017 - 03:39

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 17: అణు సాంకేతికత పరిఙ్ఞనంలో పిహెచ్‌డి చేసి దేశ విదేశాల్లో ప్రముఖ కంపెనీల్లో పని చేసి స్వామీజీగా మారిన కృష్ణదీక్షిత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలిశారు. విజయవాడలో ఐటి కంపెనీ ప్రారంభోత్సవంలో సీఎంకు ఈ విశిష్ట అతిధి తారసపడ్డారు. వృత్తిని వదిలి జీయర్ స్వామి వద్ద శిష్యరికం చేసిన కృష్ణదీక్షిత్ ఆతర్వాత కాలంలో జీయర్‌గా పేరొందారు.

02/18/2017 - 03:34

విజయవాడ, ఫిబ్రవరి 17: రాష్ట్ర ఉన్నత విద్యామండలి సలహాదారుగా డాక్టర్ ఈదర వెంకట్‌ను ప్రభుత్వం నియమించింది. ఒంగోలుకు చెందిన ఆయన ప్రస్తుతం అమెరికాలో ప్రోబ్స్ బిజినెస్ స్కూల్ ప్రోగ్రామ్ చైర్‌గా వ్యవహరిస్తున్నారు.

02/18/2017 - 03:34

విజయవాడ, ఫిబ్రవరి 17: మార్చి 8న జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఉత్తమ కథనాలకు సంబంధించి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సమాజంలో మహిళల స్థితిగతులపై సామాజిక సందేశంతో రూపొందించిన లఘుచిత్రాల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు.

02/18/2017 - 03:33

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 17: ప్రత్యేక హఓదాతోనే రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి సాధ్యమన్న విషయాన్ని పక్కదారి పట్టించి లేని ప్యాకేజీపై ప్రచారం చేస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు ప్యాకేజీతో ఎవరికి మేలు కలుగుతుందో ప్రజలకు తగు సమాధానం చెప్పాలని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

02/18/2017 - 03:29

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 17: తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. కేసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. తెనాలి, భీమవరం వంటి ప్రాంతాల్లో అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కాగా..

02/18/2017 - 03:29

విజయవాడ, ఫిబ్రవరి 17: రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు కృషి ఫలితంగా గ్రానైట్‌పై భారం తగ్గింది. ప్రభుత్వం ఈ మేరకు జిల్లా ఖనిజాభివృద్ధి నిధి (డిఎంఎఫ్)ని 12.5 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిఎంఎఫ్‌ను తగ్గించాలని కోరుతూ గ్రైనైట్ వ్యాపారులు నెల రోజల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మంత్రి శిద్దా రంగ ప్రవేశం చేసి గ్రానైట్ వ్యాపారులతో చర్చించారు.

Pages