S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/17/2017 - 03:57

విజయవాడ, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో వివిధ నగర పాలక, పురపాలక సంఘాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్తను ఇంధనంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కర్మాగారాల ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే స్థలాలను కేటాయించింది. ఒంగోలులో కూడా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు చేసేందుకు గురువారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

02/17/2017 - 04:10

మచిలీపట్నం, ఫిబ్రవరి 16: జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా నవ్యాంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలు అన్నారు.

02/17/2017 - 03:56

విజయవాడ, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో నీటి ఎద్దడి నెలకొన్ని ఐదు జిల్లాల్లో రాష్ట్ర విపత్తు స్పందన నిధుల నుంచి 35 కోట్ల రూపాయల విడుదల చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప తెలిపారు. అనంతపురానికి 10 కోట్ల రూపాయలు, చిత్తూరు జిల్లాకు 6, కడప, నెల్లూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, ప్రకాశం జిల్లా 12, శ్రీకాకుళం జిల్లాకు 1 కోటి రూపాయలను కేటాయించినట్లు తెలిపారు.

02/17/2017 - 03:54

చిత్తూరు, ఫిబ్రవరి 16 : చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. గురువారం నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతానికి ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది.

02/17/2017 - 03:53

విజయవాడ, ఫిబ్రవరి 16: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా అన్నమనేని వాసుదేవనాయుడు పేరును ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆయన విజయం కోసం పనిచేయాలని కోరింది.

02/17/2017 - 03:53

విజయవాడ, ఫిబ్రవరి 16: ఆదర్శవంతమైన జీవితం గడిపేవారు, సమాజం కోసం పాటుపడే మేధావులు నీతి వాక్యాలు బోధిస్తే విద్యార్థుల్లో చైతన్యం వస్తుంది కానీ, 11 ఛార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉండి 16 నెలలు జైలుశిక్షను అనుభవించి ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కే ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి విద్యార్థులతో ‘యువభేరి’లు అంటూ సభలు, సమావేశాలు నిర్వహించే అర్హత లేదని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్

02/17/2017 - 03:52

గుంటూరు, ఫిబ్రవరి 16: సౌత్‌సెంట్రల్ రైల్వే పరిధిలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను వచ్చే ఏడాది నుండి పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో చేపట్టనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం గుంటూరు పర్యటనకు ప్రత్యేక రైలులో విచ్చేసిన జిఎం గుంటూరు రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

02/17/2017 - 03:51

విజయవాడ, ఫిబ్రవరి 16: రబీ కాలంలో మెట్ట పైరుగా, మాగాణులతో వేసిన మినుము పంటలో తామర పురుగుల ద్వారా ఆశించిన మొవ్వకుళ్ళు వైరస్ కారణంగా వ్యాపించిన తలమాడు తెగులుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గణనీయంగా పంట దెబ్బతిన్నది. తామర పురుగు అనే రసం పీల్చే పురుగు మినుము పంటలో ప్రతి సంవత్సరం కొంత మేరకు ఆశించటం సహజం. అయతే కేవలం ఈ పురుగు ఉద్ధృతి వలన మినుము పంటకు తీవ్ర నష్టం జరగటం గతంలో ఎన్నడూ జరగలేదు.

02/17/2017 - 02:23

అమరావతి, ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తొలివిడత పూర్తి అయింది. ఫైబర్ నెట్ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో గత నెలలో మొదలయ్యాయి. ఏపీఎస్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపిఎస్‌ఎఫ్‌ఎల్) ఆధ్వర్యంలో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి.

02/17/2017 - 02:21

దేవరపల్లి, ఫిబ్రవరి 16: ప్రేమను నిరాకరించిన యువతిపై ప్రేమికుడు కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దేచర్ల వద్ద జరిగింది. కొవ్వూరు రూరల్ ఎస్‌ఐ ఎం సోమసుందరం తెలిపిన వివరాల ప్రకారం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామానికి చెందిన పన్ను దీప (27) తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది.

Pages