S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/21/2017 - 03:58

విజయవాడ, ఫిబ్రవరి 20: విద్యుత్ సమర్థ వినియోగంలో మనమే ముందున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందుబాటు ధరల్లో అందిస్తూనే పొదుపు, సంరక్షణ విధానాలను అలవాటు చేయడం ద్వారా నెలవారీ బిల్లులు తగ్గేలా ఏపి స్టేట్ ఎనర్జీ ఎఫిషియంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

02/21/2017 - 03:58

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగు తమ్ముళ్లకు విషమపరీక్ష పెట్టింది. ఎమ్మెల్సీ స్థానాన్ని మిత్రపక్షమైన బిజెపికి కేటాయించిన టిడిపి అధిష్ఠానం అభ్యర్థి విజయానికి కలిసి పనిచేయాలంటూ ఆదేశించింది. దీనికి సంబంధించి ఇరు పార్టీల నేతలతో సమన్వయ కమిటీకి రూపకల్పన చేశారు కూడా.

02/21/2017 - 03:57

విజయవాడ, ఫిబ్రవరి 20: విశాఖ జిల్లాలోని వర్గ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేధాలపై ‘మిమ్మల్ని భరించలేను.. ఇకనైనా మారండి’ అంటూ స్పష్టం చేసినట్లు తెలిసింది. మంత్రి గంటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

02/21/2017 - 03:22

గుంటూరు, ఫిబ్రవరి 20: దేశ సమగ్రత, ఆర్థికాభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారిన అవినీతి, ఉగ్రవాదాలను శాశ్వతంగా పారదోలేందుకు నగదు రహిత లావాదేవీలు దోహదపడతాయని పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. సోమవారం గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డిజి ధన్‌మేళా కార్యక్రమాన్ని అశోక్ గజపతిరాజు, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు.

02/21/2017 - 03:20

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 20: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి వ్యూహరచన చేస్తున్నామని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. సోమవారం ఉదయం నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పెద్దనోట్ల రద్దు వ్యతిరేక ప్రచార కమిటీ చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన విలేఖర్లకు వివరించారు.

02/21/2017 - 03:19

విజయవాడ, ఫిబ్రవరి 20: అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు సాగించే ఎగుమతి, దిగుమతిదారులకు కస్టమ్స్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఆథరైజెడ్ ఎకనామిక్ ఆపరేటర్’ ( ఏఇఓ) పథకం ఎంతో ప్రయోజనకరమని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ అన్నారు. దీన్ని వ్యాపారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

02/21/2017 - 03:17

గుంటూరు, ఫిబ్రవరి 20: ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలతో మోసం చేస్తున్నాయి.. ఇచ్చిన మాట తప్పుతున్నాయి.. మీరు చేయలేకపోతే ఎందుకు చేయలేదో తేల్చండి.. ఆపై ప్రజలే నిర్ణయిస్తారు’.. అని జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అల్టిమేటమిచ్చారు. ‘ఎన్నికలకు ముందు వీధివీధి తిరిగి హామీలు గుప్పించారు.. ప్రజలు పదేపదే రోడ్లపైకి వస్తున్నారు.. ఒకటి రెండు కులాలు ఉద్యమబాట పట్టాయి.. నేను ముందుగానే హెచ్చరించా..

02/21/2017 - 03:14

విజయవాడ, ఫిబ్రవరి 20: రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వడ్డీ భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎక్కువ వడ్డీతో ఉన్న రుణాలను చెల్లించేందుకు వీలుగా తక్కువ వడ్డీతో రుణాలు తీసుకునే వీలు కల్పించాలని ప్రభుత్వం కోరుతోంది. ఈమేరకు భారతీయ రిజర్వు బ్యాంక్‌కు ప్రభుత్వం లేఖ రాసింది.

02/21/2017 - 03:13

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చనిపోయినట్లు సృష్టించి ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి ఘటిస్తూ హల్‌ఛల్ చేస్తున్న నకిలీ ఫొటో ప్రచారంపై ఏపి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. ఈమేరకు ఆయన విజయవాడలో పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

02/21/2017 - 03:13

విజయవాడ, ఫిబ్రవరి 20: మార్చి 9న శాసన మండలి పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నందున రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఆ తర్వాత నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు సోమవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖ రాశారు. మార్చి 8న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధవౌతోందని ఆయన పేర్కొన్నారు.

Pages