S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/14/2017 - 04:35

గుంటూరు, ఫిబ్రవరి 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో తమతో కలసొచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాడేందుకు వెనుకాడబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ నెల 16న గుంటూరులో పార్టీ అధినేత జగన్ యువభేరి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో బొత్స మాట్లాడారు.

02/14/2017 - 04:34

అమరావతి, ఫిబ్రవరి 13: జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా స్పీకర్ అనని మాటలను అన్నట్లుగా జరిగిన ప్రచారం, రోజాకు సంబంధించిన వ్యవహారంపై సోషల్ మీడియాలో అయిన వైరల్ ప్రచారంపై శాసనసభ సీరియస్‌గా స్పందించనుంది. ఆ మేరకు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వెనుక ఎవరున్నారన్న దానిపై విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

02/14/2017 - 04:33

విజయవాడ, ఫిబ్రవరి 13: వైసిపి నేత జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) పలు ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో పాక్షికంగా నేరం రుజువైనందున జగన్‌ను కస్టడీలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

02/14/2017 - 02:31

విజయవాడ, ఫిబ్రవరి 13: రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతోపాటు అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రత్యేక హోదాకోసం పోరాటం చేయగలిగితే ఎన్జీవో సంఘం బేషరతుగా మద్దతు ఇస్తుందని ఎపి ఎన్జీవో సంఘానికి రెండోదఫా అధ్యక్షునిగా ఎన్నికైన పి అశోక్‌బాబు చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన సోమవారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడారు.

02/14/2017 - 02:30

విజయవాడ, ఫిబ్రవరి 13: వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. అమ్మకు వందనం కార్యక్రమం రూపకల్పన సహా వివిధ సంస్థలకు భూ కేటాయింపులు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి ముందు సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది.

02/14/2017 - 02:30

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ‘మా సమస్యలు పరిష్కరించండి, మమ్మల్ని కాస్త పట్టించుకోండి..’ అని ఎపి ఫార్మర్ లెజిస్లేటర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కె. సుబ్బరాజు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు.

02/14/2017 - 02:29

గుంటూరు, ఫిబ్రవరి 13: రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన విషయంలో తమతో కలసొచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాడేందుకు వెనుకాడబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

02/14/2017 - 02:27

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: ప్రకృతి అందాలతో అలరారుతున్న విశాఖ నగరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి మరో కీలక అడుగు పడబోతోంది. ఇప్పటి వరకూ విశాఖకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వచ్చి చూసి వెళుతున్నారు. కొత్త పర్యాటక ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీనికి కారణాలను కనుగొన్న అధికారులు త్వరలోనే కొత్త కార్యక్రమానికి అంకురార్పణ చేయబోతున్నారు.

02/13/2017 - 03:45

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన సమితి ఆధ్వర్యంలో విశాఖ కేంద్రంగా ఆమరణ దీక్ష చేస్తున్న నిరసన కారులచే బలవంతంగా దీక్ష విరమణ చేయించారు. ఈ నెల 9 నుంచి సమితి ఆధ్వర్యంలో ఆరుగురు నిరసనకారులు ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి విదితమే.

02/13/2017 - 03:39

విజయవాడ, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో ఎంతో కీలకమైన ఎపి ఎన్‌జివో సంఘానికి అధ్యక్షునిగా పి అశోక్‌బాబు రెండోదఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి సైతం మరోమారు ఎన్నికయ్యారు. ఈనెల 19తేదీ జరగాల్సిన ఎన్నికల కోసం ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్‌జివో హోంలో నామినేషన్ల ఘట్టం జరిగింది.

Pages