S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/13/2017 - 03:37

తిరుపతి, ఫిబ్రవరి 12: భారతీయ ఆయుర్వేద వైద్యం నేడు ప్రపంచ దేశాల ప్రజల ఆమోదం పొందిందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్ అన్నారు. విశ్వ ఆయుర్వేద పరిషత్, తిరుపతి ఆయుర్వేద కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాథమిక వైద్య అవసరాలు తీర్చడంలో ఆయుర్వేద ప్రాధాన్యత అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది.

02/13/2017 - 02:51

అమరావతి, ఫిబ్రవరి 12: అమరావతి సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్రసంగమ తీరాన మూడురోజులపాటు జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు సంపూర్ణంగా ముగిసింది. దీనికోసం గత నాలుగునెలల నుంచి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన వరస సమీక్షలు, పోలీసు, రెవిన్యూ ఉన్నతాధికారులు చేసిన కృషి ఫలించింది.

02/13/2017 - 02:47

విజయవాడ, ఫిబ్రవరి 12: మహిళా సాధికారత కోసం 20 సంవత్సరాలు క్రితమే డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేసి మహిళల ఆర్థిక స్వావలంబన సాధించామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు.

02/13/2017 - 02:44

ముందు కార్పొరేట్ రంగంలో పని చేసి ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఓ ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నా. అప్పుడు ‘విండోస్’,‘బిల్‌గేట్స్’తో పని చేస్తే ఇప్పుడు విండోస్, గేట్స్ లేని సామాన్య ప్రజలకోసం పనిచేస్తున్నా. మహిళలు తమకు ఇష్టమైన రంగాన్ని ఎన్నుకుని దానిపైనే శ్రద్ధగా పనిచేస్తే తప్పక రాణిస్తారు.ఇతర విషయాలపైనా అవగాహన పెంచుకుని అవసరమైనప్పుడు అందులోనూ పనిచేయగల నేర్పు ఉండాలి.

02/13/2017 - 02:35

విజయవాడ, ఫిబ్రవరి 12: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అయితే మహిళా సాధికారతకు మరింత కృషి జరగాలని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు.

02/13/2017 - 02:32

విజయవాడ, ఫిబ్రవరి 12: కడివెడు పాలలో చుక్క విషం చల్లే ప్రయత్నం జరిగింది.. అయినా.. ఆశించిన దానికంటే మహిళా సదస్సు ఎంతో విజయవంతంగా.. భావితరాలకు స్ఫూర్తిదాయకంగా జరిగిందంటూ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సదస్సు ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన తాజాగా జరిగిన వైకాపా శాసనసభ్యురాలు రోజా ఘటనను పురస్కరించుకుని ఎంతో ఆవేదనతో పై విధంగా వ్యాఖ్యానించారు.

02/13/2017 - 02:29

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 12: అంతర్జాతీయ ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు సక్సెస్ అయింది.. భద్రతా ఏర్పాట్లలో బెజవాడ పోలీసుశాఖ ప్రణాళిక.. నెలరోజుల కృషి ఫలించింది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ప్రముఖులకు రక్షణ వంటి కీలక అంశాలను చక్కగా నిర్వహించడంలో నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ కృతకృత్యులయ్యారు.

02/13/2017 - 01:33

తిరుపతి, ఫిబ్రవరి 12: ఎస్సీ వర్గీకరణను ఎవరు వ్యతిరేకించినా వారి నాలుకలు కోస్తామని ఎపి ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్ని రమణయ్య మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు హెచ్చరించారు. ఆదివారం తిరుపతిలోని తుడా ప్రాంగణంలోని రాజీవ్ సమావేశ మందిరంలో ఎపి ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర సదస్సు జరిగింది.

02/13/2017 - 01:31

విజయనగరం, ఫిబ్రవరి 12: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు లౌకిక శక్తులతో కలిపి వామపక్షాలు పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి ఇక్కడ అమర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంస్కరణలు, లౌకికవాదం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర అంశాలపై పోరాటం సాగిస్తామన్నారు.

02/13/2017 - 01:28

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12: గోదావరి చాలా చిత్రమైన నది..వరదల సమయంలో ఉప్పొంగి ఊళ్ళను ముం చుతూ సముద్రంలోకి ఉరకలేసే ఈ నది వేసవి సమీపించేకొద్దీ చిక్కి శల్యమై క్షీణించిపోతోంది..ఖరీఫ్ సమయంలో లక్షల క్యూసెక్కుల వరద జలాలు పంటలను ముంచేస్తూ సముద్రంలోకి పోతే..రబీ సమయంలో చుక్క నీటికి కటకటలాడే దుస్థితి చవి చూడాల్సి వస్తోంది. రబీ సమయంలో లక్షల ఎకరాల సాగునీటిని కటకటలాడాల్సిందే.

Pages