S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/14/2017 - 05:03

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 13: కృష్ణాకు నీరివ్వాలనే ఉద్దేశంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం ఏదో విధంగా పోలవరం కుడి ప్రధాన కాల్వ నిర్మాణాన్ని పూర్తిచేశారు.. కానీ ఎడమ ప్రధాన కాలువ పనులకు మాత్రం అతీగతీ కన్పించడం లేదు. పురుషోత్తపట్నం పథకం ద్వారా ఏలేరు ఆయకట్టును స్థిరీకరించాలనే ధ్యాస తప్ప లక్ష్యం మేరకు పోలవరం ఎడమ ప్రధాన కాల్వను పూర్తిచేయాలనే ధ్యేయం మాత్రం పాలకుల్లో కన్పించడం లేదు.

02/14/2017 - 05:01

విజయవాడ, ఫిబ్రవరి 13: వెలగపూడి సచివాలయంలో నిర్మించిన అసెంబ్లీ, శాసన మండలి భవనాలను రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘనాథరెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు నెలల కాలంలో అసెంబ్లీ, మండలి భవనాలను నిర్మించుకున్నామన్నారు. భవన నిర్మాణంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు.

02/14/2017 - 04:43

విజయవాడ, ఫిబ్రవరి 13: జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను మార్చి 31లోగా ఖర్చుచేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చంద్రన్న బీమా, పంట సంజీవని పథకాలు రాష్ట్ర రైతులకు, పేదలకు మేలు కలిగించేవని, వాటి అమల్లో నిర్లక్ష్యాన్ని సహించనని హెచ్చరించారు.

02/14/2017 - 04:41

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 13: డిమాండ్ల సాధనకు ఈనెల 26న దీక్ష చేపడతానని ప్రకటించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విధిగా పోలీసు అనుమతి తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే అనుమతి లేకుండా ఏ కార్యక్రమం నిర్వహించకూడదనే విషయాన్ని గ్రహించాలని అన్నారు.

02/14/2017 - 04:38

విజయవాడ, ఫిబ్రవరి 13: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, శ్రేయస్సులే ధ్యేయంగా సేవలందిస్తూ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఎపి ఎన్‌జివో సంఘ ప్రతిష్టను మరింత పెంచటంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు తమపైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నూతన కార్యవర్గం పనిచేస్తుందని ఎపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర సంఘానికి మరోసారి ఎన్నికైన నూతన అధ్యక్ష, కార్యదర్శులు పి.అశోక్‌బాబు, ఎన్.చంద్రశేఖరరెడ్డి అన్నారు.

02/14/2017 - 04:37

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 13: పులిచింతల జలాశయాన్ని సాగర్ కుడికాల్వకు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతాంగ సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు.

02/14/2017 - 04:37

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: బాల్య వివాహాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహిళల్లో 18 ఏళ్లు, పురుషుల్లో 21 ఏళ్లు నిండకుండానే ఒక ఇంటి వారవుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బాల్య వివాహాల్లో జాతీయ సగటు 2.4 శాతం ఉండగా, రాష్ట్రంలో కృష్ణా జిల్లా 2.3 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

02/14/2017 - 04:36

ఖమ్మం, ఫిబ్రవరి 13: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుచరులుగా వ్యవహరిస్తూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని, కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అందరికంటే ముందు బలపర్చడం వీరివంతని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు.

02/14/2017 - 04:36

విజయవాడ, ఫిబ్రవరి 13: మహిళల అపరిష్కృత సమస్యలకు కనీసం పరిష్కార మార్గాన్ని చూపటంలో కూడా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుచేసి నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ ఘోరంగా విఫలమైందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య అన్నారు. ఉన్నత లక్ష్యాలతో నిర్వహించవలసిన ఇటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమంగా నిర్వహించడం సిగ్గుచేటని సోమవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు.

02/14/2017 - 04:35

విజయవాడ, ఫిబ్రవరి 13: బంగారు తల్లి పథకాన్ని రద్దుచేసిన తెలుగుదేశం ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంట్ పేరిట సదస్సు నిర్వహించడం విడ్డూరమని పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు.

Pages