S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/13/2017 - 01:27

నెల్లూరు, ఫిబ్రవరి 12: అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో మహిళా బిల్లుపై మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెరాస ఎంపి కవితలు పార్లమెంటులో ఇదే బిల్లుపై ఎందుకు ప్రస్తావన తీసుకురావడం లేదని సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి బివి రాఘవులు ప్రశ్నించారు.

02/13/2017 - 01:27

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12: వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్‌ల ఆధారంగా ఆమెను జాతీయ పార్లమెంటు సదస్సుకు హాజరుకాకుండా ముందస్తుగా అరెస్టు చేసినట్లు ప్రభుత్వం, డిజిపి ప్రకటించడాన్ని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వానికి పాలనలో సోషల్ మీడియా ప్రామాణికమా అని నిలదీశారు.

02/13/2017 - 01:26

హైదరాబాద్, ఫిబ్రవరి 12: జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి అవమానించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదివారం ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. ఇది మహిళా పార్లమెంటు సదస్సును అపహాస్యం చేయడమేనని అన్నారు. మహిళా ఎమ్మెల్యే పట్ల ఎపి పోలీసులు దారుణంగా వ్యవహరించారని తప్పుపట్టారు.

02/12/2017 - 08:41

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 11: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుండి ఈ నెల 15న పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన ఉపగ్రహాలతో పాటు విదేశాలకు చెందిన మొత్తం 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.

02/12/2017 - 08:41

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నది ఎడమ గట్టుపై నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి భూసేకరణ గుదిబండగా మారింది. పరిహారం విషయమై పీటముడి పడటంతో రైతులు భూములివ్వడానికి ససేమిరా అంటున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన సమయంలోగా పథకం పూర్తికావడం సందేహాస్పదంగా మారింది.

02/12/2017 - 08:40

విశాఖపట్నం, ఫిబ్రవరి 11: ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పనిచేస్తామని విభజన హామీల సాధన సమితి స్పష్టం చేసింది. ఎందుకూ కొరగాని ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరడం ముఖ్యమంత్రి చంద్రబాబు అవివేకానికి నిదర్శనమని మేధావుల ఫోరం ప్రతినిధి చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

02/12/2017 - 08:39

అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 11: అనంతపురం నగరంలో శనివారం జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్రలో ఇస్కాన్ దక్షిణ భారత ఇన్‌చార్జి శ్రీ సత్యగోపీనాథ్‌దాస్ స్వామీజీ, మంత్రాలయం రాఘవేంద్రస్వామి పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు, ఎస్పీ రాజశేఖరబాబు హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతోనే ఆనందమయ జీవనం

02/12/2017 - 08:39

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 11: ప్రధాని మోదీ పేదల పక్షమంటూ కార్పొరేట్, ధనికవర్గాలకు వత్తాసు పలుకుతున్నారని, వాగాడంబరంతో దేశ ప్రజలను మోసం చేస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం అనంతపురం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రధాని వైఖరి తేటతెల్లమైందన్నారు.

02/12/2017 - 08:38

కాకినాడ, ఫిబ్రవరి 11: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను తూర్పు గోదావరి జిల్లాలో నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియకు జిల్లా అధికారులు వారం రోజుల క్రితమే ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ పరిణామం మెట్ట ప్రాంతంలోని పలు మండలాలకు చెందిన రైతులకు శిరోభారంగా మారింది. ఈ ఖరీఫ్‌కు సంబంధించి ధాన్యం నూర్పిళ్ళు అనేక చోట్ల జరుగుతున్నాయి.

02/12/2017 - 08:37

నెల్లూరు, ఫిబ్రవరి 11: కళ్లు తెరచినా, మూసినా చీకటిని మాత్రమే చూడగలిగే అంధులు వారు. అయినా దేవునిపై ఉన్న భక్తి, తమపై తమకు ఉన్న ఆత్మవిశ్వాసంలో సకలాంగులకు ఏమాత్రం తీసిపోరు. అదే మొక్కవోని దీక్ష, దక్షలతో కోనేటిరాయుడ్ని తమ మనోనేత్రంతో చూసి తరించేందుకు పాదయాత్రగా బయల్దేరారు. ఒకరికొకరు చేదోడుగా నెల్లూరు నగరం నుండి శనివారం వేకువజామున తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు.

Pages