S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/16/2017 - 03:03

హైదరాబాద్, ఫిబ్రవరి 15: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు, ప్రైవేటు, డీమ్డ్ వర్శిటీలకు ర్యాంకులు ఇచ్చేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సిద్ధమైంది. గత ఏడాది కేవ లం కొద్ది విద్యాసంస్థలను మాత్ర మే గుర్తించి వాటికి ర్యాంకులు ఇచ్చిన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈసారి వర్శిటీలు అన్నింటికీ ర్యాంకులు ఇవ్వనుం ది.

02/16/2017 - 03:02

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కు కర్మాగారానికి నీటి ఇబ్బందులు తప్పేట్టు లేవు. గతేడాదితో పోలిస్తే ఈ సారి నీటి సరఫరాలో తీవ్ర వ్యత్యాసం చోటుచేసుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు ఉక్కు కర్మాగారానికి నీటిని సరఫరా చేసే ఏలేరు కాలువ పూడికతో నిండిపోయింది.

02/15/2017 - 04:40

తిరుపతి, ఫిబ్రవరి 14: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి 11 కోట్ల రూపాయలతో నూతన సహస్రనామ కాసుల హారం తయారుచేయించడానికి టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం తిరుమల్లోని అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేఖరులకు వివరించారు.

02/15/2017 - 04:37

గుంటూరు, ఫిబ్రవరి 14: రాజధాని ఎక్స్‌ప్రెస్ హైవే వెంట పారిశ్రామిక హబ్‌లు ఏర్పాటు కానున్నాయి.. అనంతపురం నుంచి అమరావతి వరకు 598.830 కిలోమీటర్ల మేర 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో ఈ ఎక్స్‌ప్రెస్ హైవే రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 26వేల 890 ఎకరాల భూములను సేకరించేందుకు రంగం సిద్ధమైంది.

02/15/2017 - 04:33

ఆళ్లగడ్డ, ఫివ్రబరి 14: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టిడిపి నియోజవర్గం ఇంచార్జి గంగుల ప్రభాకరరెడ్డి బుధవారం వైకాపాలో చేరనున్నారు. హైదరాబాద్‌లో పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైకాపా కండువా కప్పుకోనున్నారు. మంగళవారం ఆళ్లగడ్డలో తన అనుచరులు, నియోజకవర్గంలోని అభిమానులతో సమావేశమైన గంగుల తన మనసులో మాట చెప్పారు.

02/15/2017 - 03:27

అమరావతి, ఫిబ్రవరి 14: కాపు కార్పొరేషన్ ద్వారా అందుతున్న ఫలాలన్నీ కాపులకే తప్ప బలిజలకు అందడం లేదంటూ ఇప్పటివరకూ ఆందోళన చేస్తున్న బలిజ నేతలు తాజాగా అదే డిమాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి వినిపించారు.

02/15/2017 - 03:21

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 14: ఒకే రాకెట్..104 ఉపగ్రహాల ప్రయోగం. ఇది మన శాస్తవ్రేత్తల సాంకేతిక సామర్ధ్యానికి పరీక్షలాంటిది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భాతర అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో పిఎస్‌ఎల్‌వి-సి 37 ప్రయోగంతో సందడి వాతావరణం నెలకొంది. 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపిస్తుండడంతో అందరి చూపు షార్‌వైపే పండింది.

02/15/2017 - 02:07

ఒంగోలు, ఫిబ్రవరి 14: ప్రకాశం జిల్లాలోని 56మండలాలను కరవుమండలాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆమేరకు రాష్ట్రప్రభుత్వం మంగళవారం జిఒఎంఎస్ నెంబరు రెండును విడుదల చేయటంతో జిల్లాలోని పాలక,ప్రతిపక్షపార్టీలకు చెందిన నేతలందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

02/15/2017 - 01:59

హైదరాబాద్, ఫిబ్రవరి 14: కర్నూలు జిల్లాలో హంద్రీ నది నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి వ్యవసాయ భూములను విధ్వంసం చేసే విధంగా లారీల అక్రమ రవాణా జరుగుతున్నా, అధికారులు వౌనంగా ఎందుకు చూస్తూ ఊరుకున్నారంటూ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుమారుడిపై వచ్చిన అభియోగాలపై విచారణకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

02/14/2017 - 05:05

విజయవాడ, ఫిబ్రవరి 13: పోలవరం పనుల్లో వేగం మరింత పెంచాలని, నిర్ణీత షెడ్యూల్‌లో ఒక వారం ఆలస్యమైనా వెనుకబడిపోతామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రాజెక్టు కావడం వల్ల అడుగడుగునా ఆ స్ఫూర్తి కనిపించాలని కోరారు. ‘వారం వారం సమీక్షకు అత్యధిక సమయం కేటాయిస్తున్నాను. పనుల్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సందేహించకుండా నేరుగా నా దగ్గరకు రండి. వెంటనే సమయం ఇస్తాను.

Pages