S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/16/2016 - 03:04

కర్నూలు, డిసెంబర్ 15: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల తలెత్తిన నగదు కొరత, చిల్లర ఇబ్బందులు రానున్న ఫిబ్రవరి నెల వరకూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ అయితే వాటి ఫలితాలు మాత్రం 6 నెలల తరువాతే ప్రజలకు అందుతాయని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

12/16/2016 - 03:03

తిరుపతి, డిసెంబర్ 15: తిరుమల సన్నిధానం అతిథిగృహంలో గురువారం చోరీ జరిగింది. భక్తులకు చెందిన 2.30 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని సన్నిధానం అతిథిగృహంలో 30వ నెంబర్ గదిలో బస చేశారు. గురువారం ఉదయం గదికి తాళం వేసి టిఫిన్ చేయడానికి వెళ్లారు.

12/16/2016 - 03:02

గుంటూరు, డిసెంబర్ 15: రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యాన ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఫ్లెమింగో ఫెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

12/16/2016 - 02:09

పోలవరం, డిసెంబర్ 15: దేశంలో ఏ ప్రాజెక్టు ప్రాంతంలో లేనంత గట్టిదనం కలిగివున్న రాయి పోలవరం స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో ఉందని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) జియాలజిస్టు జిజెఎస్ ప్రసాద్ తెలిపారు. గురువారం స్పిల్‌వే నిర్మాణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో ఉన్న రాయి 90 శాతం గట్టితనం కలిగివుందని పరీక్షల్లో వెల్లడైందన్నారు.

12/16/2016 - 02:07

అమరావతి, డిసెంబర్ 15: పెద్దనోట్ల అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. చిన్ననోట్ల కోసం ప్రజలు పడుతున్న కష్టాలు, వారికి సమస్యలు ఎదురవకుండా తీసుకోవలసిన చర్యలపై చంద్రబాబునాయుడు క్యాబినెట్ విస్తృతంగా చర్చించి, మంత్రులను కూడా ఇకపై ఆ అంశంపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన క్యాబినెట్ భేటీ నగదు కష్టాల చుట్టూ తిరిగింది.

12/16/2016 - 02:06

గుంటూరు, డిసెంబర్ 15: ప్రభుత్వం అన్ని అంశాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తోంది.. అయితే అధికారులు కొన్ని సందర్భాలలో చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు.. సైంటిఫిక్ అప్రోచ్ కొరవడింది.. ఇళ్ల స్థలాలు..పెన్షన్లు..రుణమాఫీ..చేస్తున్నా ప్రజల్లో విస్తృత ప్రచారం జరగడంలేదు..విశ్వసనీయత పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందించాలని సిఎం చంద్రబాబు మంత్రులు, అధికారులకు క్లాస్ పీకారు.

12/16/2016 - 02:06

గుంటూరు, డిసెంబర్ 15: వృద్ధిరేటులో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అత్యున్నత స్థానానికి చేరేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో గురువారం సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు.

12/16/2016 - 02:05

విజయవాడ, డిసెంబర్ 15: ఉన్నతాధికారులు, మంత్రుల మొబైల్ లావాదేవీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. సచివాలయంలో గురువారం శాఖాధిపతుల సమావేశంలో మాట్లాడిన బాబు ఎంత మంది మొబైల్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని ప్రశ్నించారు. అతి తక్కువ మంది అధికారులు మొబైల్ లావాదేవీలు జరపడంపై సిఎం ఆశ్చర్యపోయారు. హెచ్‌వోడిలు, మంత్రుల్లో 20 శాతం మంది కూడా మొబైల్ లావాదేవీలు చేయడం లేదన్నారు.

12/16/2016 - 02:03

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 15: ఎపి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా జెడి శీలం నియమితులయ్యారు. ఈమేరకు ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేసారు. ప్రస్తుతం ఈ కమిటీ కి చైర్మన్‌గా పనిచేస్తున్న మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో జెడి శీలంను నియమించినట్టు, ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

12/16/2016 - 02:02

నందికొట్కూరు, డిసెంబర్ 15: బాలిక(14)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో గురువారం వెలుగుచూసింది. బాధితురాలి తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని సంగయ్యపేటకు చెందిన బాలిక(14) స్థానిక బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.

Pages