S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/13/2016 - 03:19

గుంటూరు, డిసెంబర్ 12: పోలీస్ బోర్డు సూచించిన నిబంధనల మేరకే పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని డిజిపి ఎన్ సాంబశివరావు చెప్పారు. సోమవారం గుంటూరులో నిర్మాణంలో ఉన్న మోడల్ పోలీసు స్టేషన్లను, కానిస్టేబుళ్ల నియామకపు పోటీలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.

12/13/2016 - 03:18

విజయవాడ, డిసెంబర్ 12: అక్రమాలు, భూకబ్జాల్లో నేరస్తుడైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని వెంటనే పదవి నుంచి తొలగించాలని, అక్రమాస్తులు కూడబెట్టిన శేఖర్‌రెడ్డి, గాలి జనార్ధనరెడ్డిలను అరెస్ట్ చేయాలని, చట్టబద్ధత లేకుండా పెద్దనోట్లు రద్దుచేసిన ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

12/13/2016 - 02:34

విజయవాడ, డిసెంబర్ 12: మాజీ ఎంపి పివి రాజేశ్వరరావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు తనయుడు రాజేశ్వరరావు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

12/13/2016 - 02:32

విజయవాడ, డిసెంబర్ 12: వార్ధా తుపాను తీరం దాటడంతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్లు డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. 24 గంటలూ పనిచేసే హెల్ప్‌డెస్క్‌ను విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేశారు.

12/13/2016 - 02:30

విజయవాడ, డిసెంబర్ 12: రాజధాని అమరావతి ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కన్సల్టెంట్‌ను అమరావతి అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి సూచించారు. అమరావతి గ్రీన్ కన్సల్టెంట్స్ హెచ్‌సిసి ప్రతినిధులతో విజయవాడ కేదారేశ్వరపేటలోని కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు వివిధ నమూనాలను వివరించారు.

12/13/2016 - 02:30

విజయవాడ, డిసెంబర్ 12: అంచనా వేసిన ప్రాంతానికి 8 కిలోమీటర్ల దూరంలో వార్ధా తుపాను తీరం దాటింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు వివరించారు. తుపానుల రాకను ముందే పసిగట్టి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సేవలు తీసుకోవడం తెలిసిందే.

12/13/2016 - 02:29

హైదరాబాద్, డిసెంబర్ 12: చెన్నైలో అక్రమంగా కోట్లాది రూపాయలు పట్టుబడిన, టిటిడి బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి ఎపి తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నబాబు ఆరోపించారు. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితులపై నిఘా పెడితే మరింత నల్లధనం బయటకు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

12/13/2016 - 02:28

విజయవాడ, డిసెంబర్ 12: దేశంలో ఆరు రాష్ట్రాల పర్యాటక విభాగంతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్న స్టేజిల్లా సంస్థ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో హోమ్‌స్టేలను ఉమ్మడిగా ప్రోత్సహించేందుకు టూరిజంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వెరిఫైడ్ హోమ్‌స్టేలకు సంబంధించి అతిపెద్ద అగ్రిగేటర్ స్టేజిల్లా.

12/12/2016 - 05:25

విజయవాడ (క్రైం), డిసెంబర్ 11: రవాణా కేంద్రమైన విజయవాడలో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి తరలించే యత్నంలో అక్రమార్కులు అడ్డంగా దొరికిపోయారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి 300 కేజీలకు పైగా గంజాయి, రెండు ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు.

12/12/2016 - 05:23

విజయవాడ, డిసెంబర్ 11: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రంగా మారిన విజయవాడ నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం రోజురోజుకూ మూతపడే దిశగా పయనిస్తోంది. 1982లో నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కోస్తా ఆంధ్ర ప్రాంత అవసరాల కోసం నగరంలో ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

Pages