S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/14/2016 - 02:32

హైదరాబాద్, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిన్లాండ్ విద్యావిధానాన్ని అమలుచేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫిన్లాండ్ విద్యావిధానం అమలు అధ్యయనానికి ఒక కమిటీని కూడా నియమించింది. ఉపాధ్యాయ విద్య పారదర్శకత కోసం కమిటీని నియమించారు. నిబంధనలకు అనుగుణంగా ఎయిడెడ్ టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు.

12/13/2016 - 03:30

విశాఖపట్నం, డిసెంబర్ 12: విశాఖను ఐటి పరిశ్రమకు కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపడుతున్నారని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆధ్వర్యాన విశాఖ ఎయులో సోమవారం జరిగిన డిజిటల్ సమ్మిట్-2016 సదస్సులో ఆయన మాట్లాడారు.

12/13/2016 - 03:28

విజయవాడ, డిసెంబర్ 12: పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇక్కట్లపై విజయవాడ కేంద్రంగా ప్రజా ఉద్యమం చేపడతామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యున్నత ప్రజావేదికైన పార్లమెంట్ వైపు కనె్నత్తి చూడకుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు.

12/13/2016 - 03:27

గుంటూరు, డిసెంబర్ 12: పెద్దనోట్ల రద్దును ప్రజలు హర్షిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని, గతంలో నల్లధనంపై నానాయాగీ చేసిన ప్రతిపక్షాలు నేడు నోరుమెదపడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

12/13/2016 - 03:25

గుంటూరు, డిసెంబర్ 12: దేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉందని, మీరు త్యాగాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశంసించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కార్యకర్తలు, నాయకులను వేధింపులకు గురిచేయటంతో పాటు 150 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.

12/13/2016 - 03:23

నూజివీడు, డిసెంబర్ 12: కృష్ణా జిల్లా నూజివీడులో సోమవారం మిలాదున్నబీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పండుగను పురస్కరించుకుని మహ్మదీయుల పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో దాన్ని కట్టిన ఇనుప పైపు విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురైన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు నూజివీడు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

12/13/2016 - 03:21

విజయవాడ, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలు, చేస్తున్న ప్రకటనలు అటుంచి పది మంది సమక్షంలో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవటం అన్నిస్థాయిల్లో, అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారుతోంది.

12/13/2016 - 03:20

రాజమహేంద్రవరం, డిసెంబర్ 12: ఎట్టకేలకు పోలవరం ఎడమ ప్రధాన కాల్వ (ఎల్‌ఎంసి) పనుల్లో కదలికవచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులు ఇపుడు మళ్లీ మొదలయ్యాయి. ఏలేరు ఆయకట్టు స్థిరీకరణ, విశాఖకు సాగునీరు, పారిశ్రామిక అవసరాల రీత్యా కాలువ పనులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే ఖరీఫ్‌నాటికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

12/13/2016 - 03:20

విజయపురిసౌత్, డిసెంబర్ 12: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్‌కు 1324 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రానికి సాగర్ జలాశయం నీటిమట్టం 524.70 అడుగులకు చేరుకుంది. ఇది 157.98 టిఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 450 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 5296 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లోగా 5676 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 670.30 అడుగులకు చేరుకుంది.

12/13/2016 - 03:19

రామచంద్రపురం, డిసెంబర్ 12: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలోని రామానుజన్ గణిత అకాడమి నిర్వహించిన 27వ జాతీయ స్థాయి గణిత పోటీలలో విజేతల వివరాలను సోమవారం అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు కెవివి సత్యనారాయణ, ఎగ్జామ్ సెల్ నిర్వాహకుడు కె శ్రీకృష్ణసాయి, ఎం నాగార్జున విడుదల చేశారు.

Pages