S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/02/2016 - 12:29

రాజమండ్రి : తాను ఏపార్టీలో లేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. మంత్రి నారాయణ నాకు శత్రువు కాదని, వ్యక్తిగత అంశాలపై ఎవరూ మేసేజ్‌లు పెట్టొద్దని ఆయన కోరారు. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల తరలింపు సాధ్యం కాదని, దీనిపై చర్చకు వస్తే నిరూపిస్తామన్నారు.

09/02/2016 - 12:16

విజయవాడ : తుని విధ్వంసం కేసులో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, నెంబర్‌ వన్‌ న్యూస్‌ చానెల్‌ యజమాని సుధాకర్‌నాయుడులకు సీఐడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న విచారణకు హాజరుకావాలని సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసులు జారీ చేశారు. తుని విధ్వంసం కేసులో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి.

09/02/2016 - 11:59

కడప : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏడో వర్ధంతి సందర్బంగా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు శుక్రవారం నివాళులర్పించారు. 2009 సెప్టెంబర్ 2వతేదీన హెలికాప్టర్ ప్రమాదంలో వెఎస్సార్ మృతిచెందిన విషయం తెలిసిందే.

09/02/2016 - 11:52

విజయవాడ: జిఎస్‌టి సహా ఇతర బిల్లులను ఆమోదించేందుకు ఎపి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకూ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడతారు.

09/02/2016 - 11:51

విజయవాడ : సార్వత్రిక సమ్మె సందర్భంగా శుక్రవారం ఎపిలో బస్సు సర్వీసులకు పెద్దగా అంతరాయం కలగలేదు. ఒక వర్గం కార్మికులు నల్లబాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎపి ఎన్జీవోల సంఘం సమ్మెకు మద్దతు ప్రకటించింది. విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సమ్మె ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది.

09/02/2016 - 06:34

హైదరాబాద్, ఆగస్టు 31: నవ్యాంధ్రలో అధికార తెలుగుదేశం పార్టీ సొంతిల్లు చక్కదిద్దుకునే పనిలోఉంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిన సందర్భంగా పార్టీ-ప్రభుత్వంపై జనాభిప్రాయం సేకరించేందుకు పార్టీ రంగంలోకి దిగింది. ఆ మేరకు గత పదిరోజుల నుంచి పార్టీ నెంబరు ఫోన్ల నుంచి వివిధ వర్గాల ప్రజల సెల్‌ఫోన్లకు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నలు వస్తున్నాయి.

09/02/2016 - 13:27

హైదరాబాద్, ఆగస్టు 31: కంప్యూటర్లు వినియోగించడంలోనూ, నిరంతరం సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేయడంలోనూ, అతిగా డిజిటల్ వినియోగంలోనూ తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలోనే ఉన్నాయి. మొత్తం మీద మనవాళ్లు డిజిటల్ ముదుర్లేనని ఇటీవల ఇంటెల్ కార్పొరేషన్ నిర్వహించిన సర్వేలో తేల్చి చెప్పింది. భారతదేశం సహా 14 దేశాల్లో ఇంటెల్ కార్పొరేషన్ ఈ సర్వేను నిర్వహించింది.

09/02/2016 - 05:23

కొవ్వూరు, సెప్టెంబర్ 1: కుటుంబ కలహాల నేపధ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణ పరిధిలోని 19వ వార్డు దగ్గువారి వీధిలో గురువారం మధ్యాహ్నం బోదంకి నరసింహమూర్తి తన భార్య వరలక్ష్మి, అత్త మాచవరపు అచ్చాయమ్మలపై కత్తితో దాడి చేశాడు. అనంతరం నరసింహమూర్తి కూడా కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు.

09/02/2016 - 05:21

అనంతపురం, సెప్టెంబర్ 1: వర్షాభావం కారణంగా ప్రతి ఏటా పంటల్ని తీవ్రంగా నష్టపోతూ ఆర్థికంగా కుంగిపోతున్న రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అందులో భాగంగా పంట దిగుబడి ఆధారంగా రైతులకు పంట బీమా ప్రయోజనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

09/02/2016 - 05:18

గోరంట్ల, సెప్టెంబర్ 1: లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట ఎండిపోయి అనంతపురం జిల్లా రైతులు తీవ్ర కష్టనష్టాలతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు జల ఫిరంగుల పేరిట రైతులను మరోసారి దగా చేయడానికి ఉపక్రమించారని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Pages