S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/03/2016 - 17:58

హైదరాబాద్: ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా జీవోలు తీసుకువస్తే ఏదో ఒక రోజు ఇలాంటి తీర్పు వస్తుందని ముందే ఊహించామని టీజేఏసీ నేత కోదండరాం అన్నారు. 2013 భూసేకరణ చట్టం హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 123 జీవోతో అన్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారని చెప్పారు.

08/03/2016 - 17:42

కాకినాడ: సూరంపాలెంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో రేణుకా గాయత్రి అనే విద్యార్థిని బుధవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను సహచర విద్యార్థినులు గుర్తించి పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆమె ఆత్మహత్యకు యత్నించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఏ విషయాన్ని చెప్పేందుకు విద్యార్థినులు సుముఖత చూపడం లేదు.

08/03/2016 - 17:41

అనంతపురం: ఈ ఏడాది రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అనంతపురంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు తగిన సన్నాహాలు చేయడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఇక్కడి పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రాంగణంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.

08/03/2016 - 14:46

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో జరుగుతున్న ఆందోళనపై టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు బుధవారం తన పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ ఆందోళనను పలు రూపాల్లో కొనసాగించాలని ఆయన సూచించారు. కేంద్రం స్పందనపై తమ భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

08/03/2016 - 14:45

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో తాము చేస్తున్న పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు టిడిపి ఎంపీలు తెలిపారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, అనంతకుమార్ ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వారం లోగా తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే మళ్లీ పోరాటం ప్రారంభిస్తామన్నారు.

08/03/2016 - 14:44

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదాను సాధించడంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆయన స్వగ్రామమైన వీరులపాడు మండలం పొన్నవరంలో బుధవారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సుజనా ఇంటి ముందు రోడ్డును చీపుర్లతో ఊడ్చి వారు తమ నిరసన తెలిపారు. మంత్రి పదవిని కాపాడుకునేందుకు సుజనాచౌదరి బిజెపితో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

08/03/2016 - 14:37

విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఉదయం డీసీసీ అధ్యక్షుడు ఆదిరాజు ఆధ్వర్యంలో విజయనగరంలోని కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు బంగ్లా ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు.

08/03/2016 - 13:01

విజయవాడ: రేపు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయల్దేరనున్నారు. ప్రత్యేక హోదా విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అవుతారని సమాచారం. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌‌ను పుష్కరాలకు ఆహ్వానించనున్నారు.

08/03/2016 - 11:47

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ విజయవాడలో బుధవారం ఉదయం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చీపుర్లను చేతపట్టుకుని రోడ్లను ఊడ్చారు. హోదా విషయంలో బిజెపి, టిడిపి నేతలు నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

08/03/2016 - 11:46

రాజమండ్రి: నగరంలోని ఆల్మట్‌తోట వద్ద బుధవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ఆటో, వ్యాన్ ఢీకొనగా మధ్యలో ఓ బైక్ ఇరుక్కుపోయి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రెండు వాహనాలను ఓవర్‌టేక్ చేయడానికి బైక్‌పై ప్రయాణిస్తున్న వారు ప్రయత్నించి కింద పడ్డారు. ఆటో, వ్యాన్ మధ్య వారు నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.

Pages