S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/01/2016 - 12:03

విశాఖ: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధర్మకర్తగా వ్యవహరించిన మాజీ మంత్రి ఆనందగజపతి రాజు మరణించడంతో ఆ స్థానంలో ఆయన తమ్ముడు అశోక్‌ను నియమించారు.

04/01/2016 - 12:03

విశాఖ: నక్కపల్లి మండలం ఉపమాక వేంకటేశ్వర ఆలయానికి చెందిన సత్రంలో ముగ్గురు ఉద్యోగులు మద్యం సేవించి, రాసలీలలకు పాల్పడిన ఘటనపై విచారణకు దేవస్థానం ఇవో ఆదేశించారు. టిటిడి అజమాయిషీ కింద ఉన్న ఈ ఆలయంలో రాసలీలలకు సంబంధించి వీడియో దృశ్యాలు బహిర్గతం కావడంతో ఆలయ పవిత్రతను మంటగలిపారని భక్తులు విమర్శిస్తున్నారు. విచారణలో దోషులని తేలితే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇవో తెలిపారు.

04/01/2016 - 12:01

విశాఖ: దేశవ్యాప్తంగా వంద రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫె సేవలను అందుబాటులోకి తేవాలన్న రైల్వే శాఖ నిర్ణయంలో భాగంగా శుక్రవారం విశాఖ స్టేషన్‌లో వైఫై సేవలను ప్రారంభించారు. డిసిఎం ఎల్వీందర్ యాదవ్ ఈ సేవలను ప్రారంభించారు.

04/01/2016 - 12:00

కడప: మైదుకూరులో శుక్రవారం పోలీసులు సోదాలు చేసి 80 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ఆరుగురు కూలీలను అరెస్టు చేశారు.

04/01/2016 - 04:11

హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలో ఉన్న 53 వేల అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లను మార్చనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చెప్పారు. తొలి దశలో 5వేల అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మిస్తామని అన్నారు. 700 చదరపు అడుగల విస్తీర్ణంతో ఈ ప్రీస్కూళ్ల భవనాల నిర్మాణం జరపాలని అన్నారు. ప్రీ స్కూల్ భవనంలోనే మెడికల్ సబ్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

04/01/2016 - 04:11

హైదరాబాద్, మార్చి 31: తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించిన భారీ బడ్జెట్ గురించి, ప్రతిపాదించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని రాష్టమ్రంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టిడిపి శ్రేణులకు వౌఖికంగా ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.

04/01/2016 - 04:10

విజయవాడ, మార్చి 31: ఉగాది లోపు సిఆర్‌డిఎ కార్యాలయంలో తాము అందచేసిన తెలుగు శిలాఫలకాలను రాజధాని అమరావతిలో ప్రతిష్ఠించాలని కేంద్ర హిందీ ప్రచార కమిటీ సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ తెలుగులో జరగాలి.. ఒకటో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు పాఠ్య ప్రణాళికలో తెలుగును ఒక బోధనాంశంగా చేర్చాలని ఆయన కోరారు.

04/01/2016 - 03:09

భీమవరం, మార్చి 31: క్రికెట్ బుకీలు బౌండరీలు దాటారు. తమ సొంత ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, గోవా రాష్ట్రంలోని గోవా కేంద్రంగా ఈ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బెట్టింగుల మక్కాగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో రకరకాల పందాలు కోట్లలో సాగుతుంటాయి.

04/01/2016 - 03:07

విశాఖపట్నం, మార్చి 31: రాష్ట్రంలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు గడువు గురువారంతో ముగిసింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజున కూడా పెద్ద ఎత్తున ఇంటి యజమానులు పన్ను చెల్లించేందుకు బారులు తీరారు. గురువారం సాయంత్రానికి రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు సంబంధించి ఆస్తి పన్ను బకాయిలు రూ.801.87 కోట్లు వసూలు చేయగలిగారు.

03/31/2016 - 17:33

నెల్లూరు: తమిళనాడు సరిహద్దుల్లో రెండు ఎర్రచందనం లారీలను స్మగ్లర్లకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఇద్దరు దొంగలు పరారయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న ఈ ఇద్దరు లారీ దొంగలు పరారైన విషయం తెలిసి ఓ కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. తడ ఎస్‌ఐకి చార్జిమెమో ఇచ్చారు.

Pages