S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/31/2016 - 15:47

హైదరాబాద్: ఎపి సర్కారు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నట్లు తాము చేస్తున్న ఆరోపణలను ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక సైతం తేటతెల్లం చేస్తోందని వైకాపా అధినేత వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తమ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగట్టిందన్నారు.

03/31/2016 - 15:40

విజయవాడ: ఏపిలో పెంచిన విద్యుత్ చార్జీలు శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయి. కొత్త చార్జీలను గురువారం ఇక్కడ ఎపిఈఆర్‌సి చైర్మన్ భవానీ ప్రసాద్ విడుదల చేశారు. పెంచిన చార్జీల వల్ల గృహవినియోగదారులపై పెద్దగా భారం పడదు. 96 శాతం మంది ప్రజలకు ఇవి ఎలాంటి భారం కావని అధికారులు తెలిపారు. ఈ ఏడాది 783 కోట్ల రూపాయల మేరకు చార్జీలను పెంచాలని ప్రతిపాదించినా ఆ మొత్తాన్ని 216 కోట్లకు తగ్గించారు.

03/31/2016 - 15:39

ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో సహస్ర అనే ఆరేళ్ల బాలికను గురువారం ఉదయం బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అపహరించుకుపోయారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపుచర్యలు ప్రారంభించారు.

03/31/2016 - 15:38

విశాఖ: అవినీతి ఆరోపణలు రావడంతో చింతపల్లి ఎస్‌ఐ రాఘవేంద్ర రెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిపై సమగ్ర విచారణ జరిపేందుకు సస్పెండ్ చేసినట్లు తెలిసింది

03/31/2016 - 15:38

కడప: రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో గురువారం ఓ గుడిసె కాలిపోయి అందులో ఉన్న తల్లి, కుమార్తె సజీవ దహనమయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

03/31/2016 - 12:25

ఏలూరు: డిపాజిట్ల పేరుతో వేల కోట్ల రూపాయలు కాజేసిన అగ్రిగోల్డ్ నిందితులను బెంగళూరుకు చెందిన సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి ఏలూరు జైలులో ఉన్న ఆ సంస్థ చైర్మన్ ఎవి రామారావు, ఎండి శేషునారాయణతో పాటు మరో ముగ్గురిని కర్నాటక సిఐడి పోలీసులు కస్టడీలోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువెళ్లారు.

03/31/2016 - 12:24

తిరుపతి: అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీన పరచుకోవడంలో సిఐడి అధికారులు విఫలమయ్యారని, వారు తీవ్ర జాప్యం చేసినందున నిందితులు ఆస్తులను అమ్మేసుకున్నారని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ కేసుపై అసెంబ్లీలో మాట్లాడేందుకు తమకు తగినంతగా అవకాశం ఇవ్వలేదని, అయినా బాధితులకు న్యాయం జరిగేలా తాను పోరాడతానని ఆయన ప్రకటించారు.

03/31/2016 - 12:24

హైదరాబాద్: ఎపి సిఎం చంద్రబాబు గురువారం ఇక్కడ కాపు కులానికి చెందిన ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. కాపు ఆర్థిక సహాయ సంస్థ, బిసి కమిషన్ నివేదిక తదితర విషయాలను చర్చించారు. కాపు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

03/31/2016 - 12:23

కర్నూలు: ఆదోని పట్టణంలో ఆర్ట్సు కళాశాల రోడ్డులో బుధవారం అర్ధరాత్రి దాటాక ఇండియన్ బ్యాంకు ఎటిఎం మిషన్‌ను దుండగులు ఓ వాహనంలో వేసుకుని పరారయ్యారు. ఎటిఎంలో 5.27 లక్షల నగదు ఉందని బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం, వారు ఉపయోగించిన వాహనం కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.

03/31/2016 - 12:21

ఏలూరు: కొవ్వూరు మండలం తంగిడి వద్ద గురువారం ఉదయం హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో ఓ లారీ అక్కడికక్కడే కాలిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సజీవం దహనం కాగా, గాయపడ్డ క్లీనర్‌ను ఆస్పత్రికి తరలించారు.

Pages