S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/02/2016 - 03:04

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఏప్రిల్ 1: దుర్గగుడిని మరింత అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.100కోట్ల ఖర్చుతో మాస్టర్ ప్లాన్ రూపొందించి ఈ మేరకు పనులను ప్రారంభించేందుకు దుర్గగుడి ఇన్‌చార్జ్ ఇవో చంద్రశేఖర్ ఆజాద్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పనుల వివరాలను అజాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి స్వయంగా వివరించి ఆయన వద్దనుండి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ తెచ్చుకున్నారు.

04/02/2016 - 03:02

భీమవరం, ఏప్రిల్ 1: రైల్వేలో వివిధ పనులకు టెండర్లు పిలవగానే కాంట్రాక్టర్లు కుమ్మక్కవ్వడం, ముందే నిర్ణయించుకుని అధిక శాతాలకు టెండర్లు దాఖలు చేయడం, తమవారు కాకుండా వేరేవారు వస్తే బెదిరించి వెనక్కి పంపడం వంటి సంఘటనలతో ఆ శాఖ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇకపై ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఇన్నాళ్లు మ్యాన్యువల్‌గా జరిగిన టెండర్లను ఇకపై ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

04/02/2016 - 02:01

విజయవాడ, ఏప్రిల్ 1: రాజధాని రైతుల కోసం ప్రభుత్వం ఒక పత్రికను విడుదల చేయబోతోంది. అలాగే రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు కూడా మరో పత్రికను తీసుకురాబోతోంది. ఈ బాధ్యతలను సిఆర్‌డిఏకి ప్రభుత్వం అప్పగించింది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాలు, నిర్మాణ పనులు, జిఓలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపరచనున్నారు.

04/01/2016 - 18:13

కాకినాడ: ప్రేమపేరుతో యువతిని మోసగించడమే గాక, ఆమె ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సతీష్ అనే కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రెండువారాల రిమాండ్‌కు శుక్రవారం తరలించారు. సఖినేటిపల్లి మండలం శంగృవరపుపాడుకు చెందిన ఓ యువతి ఇటీవల ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రి పాలైంది. సతీష్ వంచించడం వల్లే తాను ఆత్మహత్యకు యత్నించినట్లు ఆమె చెప్పడంతో పోలీసులు కేసు పెట్టారు.

04/01/2016 - 18:11

విజయవాడ: ఎపి రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖకు ఎపి ప్రభుత్వం భారీగా పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్‌కు 471, తూళ్లూరు పోలీస్ సబ్ డివిజన్‌కు 674 పోస్టులను మంజూరు చేశారు. విజయవాడ నగరంలో భద్రతాపరంగా విధులను నిర్వహించేందుకు 583 పోస్టులను మంజూరు చేశారు.

04/01/2016 - 17:22

ఏలూరు: కొవ్వూరు పట్టణంలో 16వ వార్డు కౌన్సిలర్ గోపాలకృష్ణను ప్రత్యర్థులు శుక్రవారం మధ్యాహ్నం హత్య చేశారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన తర్వాత బైక్‌పై ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో రాజకీయ ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి కౌన్సిలర్‌ను చంపారు.

04/01/2016 - 13:59

విజయవాడ: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఏపి మంత్రివర్గం విజయవాడలో శనివారం ఉదయం భేటీ అవుతోంది. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు, ఉచిత ఇసుక పంపిణీ విధానం వంటి అంశాలపై సిఎం చంద్రబాబు మంత్రులతో చర్చిస్తారు. క్యాబినెట్ భేటీ తర్వాత పార్టీ నేతలతో ఆయన విడిగా సమావేశమవుతారు.

04/01/2016 - 13:56

విజయవాడ: 95వ భారత జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడ 150 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ జరిపారు. నగర వీధుల్లో సాగిన ఈ ర్యాలీ అందరినీ అలరించింది.

04/01/2016 - 13:55

గుంటూరు: భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త కిరాతకం ఇది. గుంటూరు జిల్లా గురజాలలో శుక్రవారం ఈ ఉదంతం వెలుగు చూసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.

04/01/2016 - 13:55

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు ఈ నెల 11న తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆ రోజు టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకుంటారు. ఈరోజు కార్యకర్తలతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జ్యోతుల, పరుపుల శుక్రవారం తెలిపారు. ఇటీవల 8మంది వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే.

Pages