S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/07/2016 - 07:27

హైదరాబాద్, మార్చి 6: బ్రిటీష్ హై కమిషనర్ ఆహ్వానంపై పెట్టుబడులు తెచ్చేందుకు లండన్ వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడున్న మ్యూజియంను సందర్శించాలని అమరావతి అభివృద్ధి అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు. మ్యూజియంలో ఉన్న అద్భుతమైన బౌద్ధ శిల్పకళా సంపదను అమరావతికి తీసుకువచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను సిఎం చంద్రబాబుకు రాసినట్లు తెలిపారు.

03/07/2016 - 07:09

రాజమహేంద్రవరం: గోదావరి తీరంలో భారతీయ జనతాపార్టీ నిర్వహించిన సంకల్ప సభ విజయవంతమయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి-బిజెపి సంకల్పం నినాదంతో భారతీయ జనతాపార్టీ నిర్వహించిన సంకల్ప సభ ఆ పార్టీకి నవ్యాంధ్రప్రదేశ్‌లో తిరుగులేని అదనపు బలాన్ని ఇచ్చింది.

03/07/2016 - 07:08

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టే స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి మంగళవారం ఉదయం 10:30 గంటల నుండి కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భాతర అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో ముహూర్తం ఖరారు చేసింది.

03/07/2016 - 07:00

సూళ్లూరుపేట: దేశంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఆదివారం షార్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశంలోకి 10 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడ్డారని, ఏ క్షణంలోనైన దాడులు చేయవచ్చునని ఐబి హెచ్ఛరికలు జారీ చేసినే నేపథ్యంలో అన్ని ప్రధాన నగరాల్లో కేంద్ర భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.

03/07/2016 - 06:57

హైదరాబాద్: తెలంగాణలో ఓటుకు నోటు కేసుతోనే తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతమతమవుతుంటే, మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్‌పై హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేయడం తలనొప్పిగా మారింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి రావెల కిశోర్‌ను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కొంత చికాకు పడినట్లు తెలిసింది.

03/07/2016 - 06:53

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆదిదంపతులు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రోజూ మాదిరిగానే స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ వేద పండితులు విశేష పూజలు చేశారు. సాయంత్రం శ్రీ పార్వతీపరమేశ్వరులను గజ వాహనంపై ఆశీనులను చేసి శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

03/07/2016 - 06:53

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ ఆదివారం ఉదయం హంస, చిలుక వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందుచేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన నాగరాత్రి పురస్కరించుకొని ఉదయం గంగాదేవి సమేత సోమస్కందమూర్తి హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ చిలుక వాహనంపై ఊరేగారు. వేదపండితులు, మంగళవాయిద్యాలు, సాంస్కృతిక బృందాలు వెంటరాగా స్వామి, అమ్మవార్లు భక్తులను కటాక్షించారు.

03/07/2016 - 01:37

రాజమహేంద్రవరం: కేంద్రంలో ఎన్‌డిఏ అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భరోసా ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాష్ట్ర బిజెపి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి- బిజెపి సంకల్పం నినాదంతో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సభకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె హరిబాబు అధ్యక్షత వహించారు.

03/07/2016 - 01:16

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజునే వైకాపా సభ్యులు నల్లకండువాలు ధరించి నిరసనలతో అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ప్రసంగం సమయంలో కొంతసేపు నిరసనల హోరుకే విపక్ష పార్టీ పరిమితమైంది. సమావేశాలు ఈనెల 30 వరకు జరగాల్సి ఉంది.

03/07/2016 - 01:14

అమరావతి ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నారు
భూదందా ఆరోపణలన్నీ కట్టుకథలే
లాక్కుంటే రైతులు ఊరుకుంటారా?
తెదేపా నేతలు అక్రమాలకు పాల్పడలేదు
రుజువు చేస్తే ఆస్తులు రాసిస్తాం
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడతాం
ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగితే ఉపేక్షించం
కుళ్లుతోనే అమరావతిపై వైకాపా దుష్ప్రచారం
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు

Pages