S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/06/2016 - 18:22

రాజమహేంద్రవరం: ఏపీకి కేంద్రం సాయం చేయలేదని దుష్ప్రచారం జరుగుతోందని, కేంద్రం ఏవిధంగా సాయం చేస్తోందో తెలిపేందుకే వచ్చానని భాజపా జాతీయ అమిత్‌ షా అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో భాజపా బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్డీయే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గోదావరి తీరాన సంకల్ప ర్యాలీలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు.

03/06/2016 - 18:15

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరునికి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ మరింత పురోగతి సాధించాలని, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీకాళహస్తీశ్వరునని ప్రార్థించానన్నారు.

03/06/2016 - 17:44

తిరుపతి: తిరుపతిలోని ఎస్‌బీహెచ్‌లో చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 725 గ్రాముల బంగారం, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

03/06/2016 - 05:26

శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబిక మల్లికార్జునస్వామివారు పుష్పపల్లకిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ అర్చక వేద పండితులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా పూలతో అలంకరించి అక్కమహాదేవి అలంకార మండపంలో ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

03/06/2016 - 05:25

రాజమహేంద్రవరం: గోదావరి డెల్టాకు నష్టం కలుగకుండా కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని ఎలా తీసుకెళతారో గోదావరి డెల్టా ప్రజలు, రైతులకు స్పష్టమైన హామీనివ్వటంతో పాటు శే్వతపత్రాన్ని విడుదలచేయాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేసారు.

03/06/2016 - 05:24

గుంటూరు:సనాతన ధర్మమే భారతదేశానికి శ్రీరామరక్ష అని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ అన్నారు. గుంటూరు విశ్వనగర్‌లో విశ్వంజీ 72వ జన్మదినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆయన భక్తులకు సందేశమిస్తూ, పెద్దలు సనాతన ధర్మాన్ని తమ పిల్లలకు తెలియజేయాలని, తద్వారా అబ్దుల్ కలామ్ వంటి దేశభక్తులను తయారు చేయవచ్చని అన్నారు.

03/06/2016 - 05:14

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఈనెల 10న పిఎస్‌ఎల్‌వి-సి 32 ప్రయోగం జరగనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి జరిగే ఈ రాకెట్ ద్వారా 1425 కిలోల బరువు గల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నా రు.

03/06/2016 - 03:44

రావాల్సిన లోటు నిధులు 13,766 కోట్లు
విభజన చట్టం హామీలు నెరవేర్చాల్సి ఉంది
2018 నాటికి పోలవరం తొలి దశ పూర్తి
ఏడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
వచ్చే బడ్జెట్‌లో కాపు సంక్షేమానికి వెయ్యి కోట్లు
ప్రపంచస్థాయి ప్రజా రాజధానిగా అమరావతి
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్
ఆంధ్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

03/06/2016 - 03:42

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో శనివారం దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్‌కు ప్రేమోన్మాధి కిరోసిన్ పోసి నిప్పు పెట్టడంతో తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ప్రేమిస్తున్నానంటూ వెంటబడినే వ్యక్తే, ఆమె తిరస్కరణను జీర్ణించుకోలేక కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడని బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.

03/06/2016 - 03:34

విశాఖపట్నం: ఇన్నోవేషన్స్, స్టార్టప్‌లకు ఆంధ్ర గమ్యస్థానంగా నిలవాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇన్నోవేషన్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించే స్టార్ట్ ఏపీ ఫెస్ట్-2016ను శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతో ముందుకొచ్చే విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్నారు.

Pages