S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/07/2016 - 16:32

విశాఖ: విశాఖ ఏజెన్సీలోని గూడెం కొత్తవీధి మండలం కుంకుమపూడి వద్ద గుండూరావు అనే వ్యాపారిని సోమవారం ఉదయం మావోయిస్టులు కాల్చిచంపారు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పెద్దపాడుకు వెళ్లివస్తున్న గుండూరావును అడ్డగించి మావోలు అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందునే వ్యాపారిని హతమార్చామని సంఘటన స్థలంలో మావోలు ఒక లేఖను వదిలివెళ్లారు.

03/07/2016 - 14:00

విజయవాడ: ఇక్కడి గుణదలలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల హాస్టల్‌లో సోమవారం ఉదయం కలుషిత ఆహారం కారణంగా 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు చేసుకుంటున్న వీరిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

03/07/2016 - 13:58

కర్నూలు: డోన్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో సోమవారం ఉదయం బొగ్గును తీసుకుని వెళుతున్న గూడ్స్‌లో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. మరో రైలింజన్ సాయంతో ఈ బోగీలను తిరిగి పట్టాలపైకి చేర్చారు. గూడ్స్ పట్టాలు తప్పడంతో గుంతకల్- నంద్యాల మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

03/07/2016 - 13:57

విజయవాడ: శివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం ఉదయం కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీటిలో దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు మరణించిన ఘటన అవనిగడ్డ మండలంలో జరిగింది. పాతయడ్లంక వద్ద కృష్ణానదిలో మనోజ్‌కుమార్, వెంకటరమణ, సాయి శ్రీనివాస్ స్నానం చేసేందుకు వెళ్లారు. నీటిలో కొట్టుకుపోయిన మనోజ్, వెంకటరమణ మరణించగా, సాయి శ్రీనివాస్ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు.

03/07/2016 - 13:56

తిరుపతి: సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం రాత్రి 8-30 గంటల నుంచి బుధవారం ఉదయం పది గంటల వరకూ తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేస్తారు. బుధవారం ఉదయం గ్రహణం ముగిశాక సంప్రోక్షణ అనంతరం ఆలయాలను తిరిగి తెరుస్తారు.

03/07/2016 - 13:56

విశాఖ: పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎపి విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం ఉదయం ఇక్కడి కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు రాసే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు.

03/07/2016 - 11:52

గుంటూరు: తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద సోమవారం ఉదయం ఇసుక మేట వద్ద ఫుట్‌బాల్ ఆడుతున్న నలుగురు పిల్లలు భూమిలోకి కూరుకుపోయారు. స్థానికులు ముగ్గురిని కాపాడారు. ఐతే ప్రవీణ్ నాయక్ అనే బాలుడు ఊబిలో ఊపిరాడక మరణించాడు.

03/07/2016 - 11:51

గుంటూరు: కోటప్పకొండ ప్రాంతాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎ.పి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరిగే జాతర ఏర్పాట్లను సోమవారం ఉదయం ఆయన పరిశీలించారు.

03/07/2016 - 11:49

గుంటూరు: శివరాత్రి సందర్భంగా కృష్ణానదిలో పుణ్యస్నానం చేసేందుకు వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థి నీట మునిగి మరణించాడు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

03/07/2016 - 11:48

హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో సోమవారం వేకువజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర, శ్రీముఖలింగం, రామతీర్థం తదితర ఆలయాల్లో అర్చనలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు.

Pages