S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/24/2018 - 02:51

న్యూఢిల్లీ, ఆగస్టు 23: కేరళ వరద బాధితులకు 144 మెట్రిక్ టన్నుల బియ్యం పంపాలన్న ఆంధ్రప్రదేశ్ బియ్యం ఎగుమతిదారుల సంఘం నిర్ణయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు స్వాగతించారు. అలాగే బియ్యంతో పాటు 10 వేల దుప్పట్లను కూడ కేరళకు పంపుతున్నారు. శుక్రవారం ఉదయం కాకినాడ పోర్టు నుంచి ప్రత్యేక కంటైనర్లలో అవి వెళ్తాయి. ఈ సందర్భంగా ఏపీ బియ్యం ఎగుమతిదారుల సంఘానికి మంత్రి సురేష్ ప్రభు అభినందనలు తెలిపారు.

08/24/2018 - 02:51

విజయవాడ, ఆగస్టు 23: సీనియర్ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. నిజాయితీపరుడు, విలువలకు నిదర్శనంగా నిలిచిన ఆయన మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటు అంటూ నివాళులు అర్పించారు. పాత్రికేయ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయ్యర్ నిబద్ధతకు మారుపేరని తెలిపారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ కూడా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

08/23/2018 - 06:21

అమరావతి, ఆగస్టు 22: అవాస్తవ..అసత్య ప్రచారాలలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ అండ్ కో గోబెల్స్‌ను మించిపోయారని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ తన అసత్య ప్రచారాల కోసం గోబెల్స్‌ను ప్రయోగించాడని అదే తరహాలో దుష్ప్రచారాలతో టీడీపీపై వైసీపీ బురదజల్లుతోందని శనివారం ఒక ప్రకటనలో యనమల ధ్వజమెత్తారు.

08/23/2018 - 05:42

రాజమహేంద్రవరం, ఆగస్టు 22: ఉగ్ర గోదావరి ఇంకా ప్రచండ వేగంతో పరుగులు తీస్తూనేవుంది. ఏజెన్సీ, కోనసీమ లంక గ్రామాలను భయకంపితం చేస్తూ ఉగ్రరూపంతో ఉరకలు వేస్తోంది. ఎగువన భద్రాచలం వద్ద వరద కాస్తంత నిలకడగా ఉన్నప్పటికీ ఉపనది శబరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరికకు రెండు అడుగుల దూరంలో ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 15.30 అడుగుల నీటి మట్టం నమోదైంది.

08/23/2018 - 05:38

రాజమహేంద్రవరం, ఆగస్టు 22: ఉగ్ర గోదావరి ఇంకా ప్రచండ వేగంతో పరుగులు తీస్తూనేవుంది. ఏజెన్సీ, కోనసీమ లంక గ్రామాలను భయకంపితం చేస్తూ ఉగ్రరూపంతో ఉరకలు వేస్తోంది. ఎగువన భద్రాచలం వద్ద వరద కాస్తంత నిలకడగా ఉన్నప్పటికీ ఉపనది శబరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరికకు రెండు అడుగుల దూరంలో ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 15.30 అడుగుల నీటి మట్టం నమోదైంది.

08/22/2018 - 04:27

అమరావతి, ఆగస్టు 21: వివిధ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల కోసం ఉద్దేశించిన పథకాలను వచ్చేనెల మూడో వారంలో పెద్దఎత్తున ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, కాపు, మైనారిటీ వర్గాల సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

08/22/2018 - 04:25

అమరావతి, ఆగస్టు 21: అమెరికన్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌వైపు ఆసక్తి చూపుతున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి కెనె్నత్ ఐ జస్టర్ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ అయ్యారు. తొలుత ఈ ప్రగతి, ఆర్టీజీఎస్, సాంకేతిక వినియోగం తదితర అంశాలను ముఖ్యమంత్రి వివరించారు. సులభతర వాణిజ్యంలో మొదటి స్థానం పొందేందుకు అనుసరించిన విధానాలను విశదీకరించారు.

08/22/2018 - 04:23

అమరావతి, ఆగస్టు 21: త్యాగానికి ప్రతీకగా చరిత్రలో చిరస్థాయిగా బక్రీద్ పండుగ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. బుధవారం బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆధ్యాత్మిక, చారిత్ర పండుగ అన్నారు. మక్కా, మదీనా సందర్శన సందర్భంలో హజ్ యాత్ర పూర్తయిన మరుసటి రోజు బక్రీద్ వేడుకలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.

08/22/2018 - 04:23

విజయవాడ (క్రైం), ఆగస్టు 21: మానవ అక్రమ రవాణా నిరోధంలో స్వచ్చంద సంస్ధల భాగస్వామ్యంతో సత్ఫలితాలు సాధించవచ్చని డీజీపీ ఆర్‌పి ఠాకూర్ అన్నారు. ఇందుకోసం పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోందని, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

08/22/2018 - 04:22

తాడేపల్లిగూడెం, ఆగస్టు 21: వరదలతో వేలాది ఎకరాలు ముంపు బారిన పడి రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని గాలికొదిలేసి శవ రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో మంగళవారం ఆయన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో కలిసి పర్యిటించారు.

Pages