S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/17/2018 - 06:16

విజయవాడ, ఆగస్టు 16: రోగుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. వెలగపూడి సచివాలయంలో రోగి భద్రత అన్న అంశంపై గురువారం సదస్సు నిర్వహించారు.

08/17/2018 - 06:15

భీమవరం, ఆగస్టు 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం యువజన కాంగ్రెస్ బస్సుయాత్ర నిర్వహించనుందని అఖిలభారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి, ఏపీ ఇన్‌ఛార్జి ఊట్ల వరప్రసాద్ పేర్కొన్నారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో అవసరమైతే ఆమరణ దీక్షలకు దిగుతామని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

08/17/2018 - 06:14

నాతవరం, ఆగస్టు 16: విశాఖ జిల్లా నాతవరం మండలం డి.యర్రవరం నుంచి వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర 238 రోజుకు చేరింది . ఇప్పటి వరకు 2,741 కిలో మీటర్లు జగన్ పాదయాత్ర చేసారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర కేవలం 45 నిమిషాల్లోనే ముగించారు. యర్రవరం నుండి ములగపూడి వరకు ఒకటిన్నర కిలో మీటర్లు పాదయాత్ర చేసి ముగించారు.

08/17/2018 - 06:12

గుంటూరు, ఆగస్టు 16: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అక్రమ మైనింగ్ జరిగిందని, ప్రస్తుతం మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయని వైకాపా నేతలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమని గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

08/17/2018 - 06:12

విజయవాడ, ఆగస్టు 16: ఎపీసీఆర్‌డీఏ పరిధిలోని దీవుల అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టులు, నగరాల అభివృద్ధిలో ఏ మాత్రం నిర్లిప్తత, జాప్యం లేకుండా పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు.

08/17/2018 - 06:11

విజయవాడ (క్రైం), ఆగస్టు 16: ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖకు అరుదైన గౌరవం దక్కింది. తొలిసారిగా శౌర్య పతకం లభించింది. అదేవిధంగా మరో రెండు ఉత్తమ సేవా పతకాలు కూడా ఆ శాఖ దక్కించుకుంది.

08/17/2018 - 02:37

కాకినాడ/సోంపేట ఆగస్టు 16: సముద్రంలో వేటకు వెళ్ళి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు సురక్షితంగా తీరానికి చేరారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎక్కువూరు గ్రామ తీరానికి గురువారం మధ్యాహ్నం బోటు చేరుకుంది.

08/17/2018 - 02:34

బళ్ళారి, ఆగస్టు 16: వరద నీటితో తుంగభద్ర నది పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద పెద్దమొత్తంతో రావడంతో 33 గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో తుంగభద్ర నది వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తుంగభద్ర జలాశయానికి అంతకంతకు వరద పెరుగుతుండడంతో గురువారం 33 గేట్ల ద్వారా 2,16,040 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

08/16/2018 - 06:36

విశాఖపట్నం, ఆగస్టు 15: భారీ వర్షంలోనూ జాతీయ పతాకాన్ని ఎగరేసి, ప్రజలంతా దేశభక్తిని చాటుకున్నారు. విశాఖ నగరంలోని కార్యాలయాలు, కర్మాగారాలు, కళాశాలలు, విద్యాలయాలు.. ఇలా అన్ని చోట్లా స్వాతంత్య్ర దినోత్స సంబరాలు మిన్నంటాయి. కానీ నగరం నడిబొడ్డునున్న ఒక హాస్టల్‌లో జెండా ఎగరలేదు. అక్కడున్న 102 మంది విద్యార్థులు అల్పాహారం మానేసి నిరసన తెలియచేయడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

08/16/2018 - 06:35

విజయవాడ, ఆగస్టు 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి వారం వారం ఐదు ప్రశ్నలను కన్నా సంధిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ హోదా కల్గిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని చంద్రబాబు నాయుడు ఎడాపెడా పెంచుకుంటూ పోతున్నారని, పోలవరం ప్రాజెక్టుకు బిల్లుల చెల్లింపుల్లో కుంభకోణం జరగలేదా అని ప్రశ్నించారు.

Pages