S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/28/2020 - 05:54

ముంబయి, జనవరి 27:కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా పడింది. గత నాలుగు నెలల్లో రెండోసారి స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సోమవారం జరిగిన లావాదేవీల్లో బీఎస్‌ఈ సెనె్సక్స్ 458.07 పాయింట్లు నష్టపోయి 41,155.12 వద్ద ముగిసింది. ఒకదశలో దాదాపు 500 పాయింట్ల వరకు మార్కెట్ నష్టపోయే పరిస్థితి తలెత్తింది.

01/28/2020 - 05:53

న్యూఢిల్లీ, జనవరి 27: దేశీయ ఉత్పత్తులకు మరింత ఊతాన్నించే లక్ష్యంతో ఫర్నిచర్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు అంతర్గత వాణిజ్యం పరిశ్రమల అభివృద్ధి విభాగం కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్టుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.

01/28/2020 - 05:52

న్యూఢిల్లీ, జనవరి 27: మార్కెట్ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఎల్‌ఎన్‌జీ ధరలను తగ్గించాలని భారత ప్రభుత్వం సోమవారం సోమవారం చేసిన అభ్యర్థనను ఖతర్ తిరస్కరించింది. ఇరు వర్గాల విశ్వసనీయత కంటే కూడా కాంట్రాక్టుల పవిత్రమే ముఖ్యమని స్పష్టం చేసింది. దీర్ఘకాల సప్లై కాంట్రాక్టులను మళ్లీ తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

01/28/2020 - 01:05

విశాఖపట్నం, జనవరి 27: అనేక రకాల ఆర్థిక సమస్యలతో నడుస్తున్న ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీల చెల్లింపులో కాస్తంత వెసులుబాటు లభించనుంది. ఆక్వా రైతులను ఆదుకునేందుకు వీలుగా వీరి నుంచి వసూలు చేసే యూనిట్ విద్యుత్ చార్జీలు రెండు రూపాయల నుంచి ఒక రూపాయి 50 పైసలకు తగ్గించింది. దీంతో ప్రతి యూనిట్‌కు 50 పైసలు వంతున తగ్గించినట్టు అయ్యింది.

01/27/2020 - 06:53

న్యూఢిల్లీ: ప్రధాన కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఆర్జనల తీరు, కేంద్ర బడ్జెట్ అంచనాలు ఈ వారం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు తన త్రైమాసిక ఫలితాలపై సోమవారం స్పందించనుంది. గత శనివారం ఈ బ్యాంకు ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ద్విగుణీకృత శాత నికర లాభం రూ. 4,670 కోట్లు ఆర్జించినట్టు ప్రకటించింది.

01/27/2020 - 06:45

ముంబయి, జనవరి 26: పేదలకు పది రూపాయలకే భోజనం అందించే అపూర్వమైన పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ‘శివ్ భోజన్’ పేరిట ఈ పథకాన్ని ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరంభించింది. శివ్ భోజన్ మధ్యాహ్న భోజన పథకాన్ని మహారాష్ట్ర మంత్రి అస్లామ్ షేక్ రద్దీ ఎక్కువగా ఉండే నాయిర్ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు.

01/27/2020 - 06:23

న్యూఢిల్లీ, జనవరి 26: బంగారం దిగుమతులు గత 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 6.77 శాతం తగ్గాయి. ఈ కాలంలో మొత్తం 23 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు జరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

01/27/2020 - 06:21

న్యూఢిల్లీ, జనవరి 26: వాహన ఎల్‌పీజీపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించాలని ‘అఖిల భారత ఆటోఎల్‌పీజీ సంఘాల సంకీర్ణం’ (ఐఏసీ) ఆదివారం నాడిక్కడ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అలాగే వాహనాలను గ్యాస్ ఆధారితంగా మార్చుకునేందుకు వినియోగించే పరికరాల పైనా పన్ను శాతాన్ని తగ్గించాలని, తద్వారా దేశంలో పరిశుద్ధమైన ఇంధన వాడకానికి చేయూతనివ్వాలని కోరింది.

01/27/2020 - 06:20

ముంబయి, జనవరి 26: సాంకేతికాభివృద్ధి, సంస్కరణల కారణంగా వస్తు, సరకు రవాణా, నిల్వలతో కూడిన ‘సమగ్ర లాజిస్టిక్స్ నెట్‌వర్క్’ విస్తరిస్తున్న దృష్ట్యా దేశీయంగా గిడ్డంగుల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

01/26/2020 - 06:35

ముంబయి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌లో ఏఏ అంశాలకు ప్రాధాన్యం ఉంటుందో? ఏఏ రంగాలు నిర్లక్ష్యానికి గురవుతాయో అంచనా వేయడంలో నిపుణులు సైతం విఫలమవుతున్నారు. దీనితో అనిశ్చితి కొనసాగిన నేపథ్యంలో, ఈవారం స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. చివరి రెండు రోజులు పరిస్థితి మెరుగుపడకపోతే, అటు మదుపరులు, ఇటు స్టాక్ బ్రోకర్లు కోలుకోలేని దెబ్బతినేవారు.

Pages